శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల - మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన 'రామకథాసుధ' సంకలనంలో వీరి కథ 'కౌగిలి' కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.
ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *సంగీత రీతులు, వాయిద్యాలు, మాత్రా చందస్సుల వివరణ ఆసక్తికరంగా సాగింది.. నావంటి సామాన్యుల కన్నా సంగీత పరిజ్ఞానమున్న వారికి ఇది…