సంచికలో తాజాగా

చింతకుంట్ల సంపత్ రెడ్డి Articles 1

చింతకుంట్ల సంపత్ రెడ్డి (వయసు 73) ఎం.ఏ (హిస్టరీ), ఎం.ఏ (ఇంగ్లిష్), మరియు సి.ఐ.ఇ.ఎఫ్.ఎల్ నుండి పి.జి.సి.టి.ఐ పట్టభద్రులు. సాంకేతిక విద్యాశాఖలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా సుదీర్ఘకాలం పనిచేసి, 2011లో హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్‌గా పదవీ విరమణ పొందారు. ఉద్యోగ కాలంలో పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలు, అధ్యాపకుల కోసం టీచర్స్ బుక్ రూపొందించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు రాజేంద్రనగర్‌లోని ఎన్.ఐ.ఆర్.డి మరియు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఇంగ్లిష్ ఎడిటర్‌గా సేవలందించారు. CS Reddy అనే కలం పేరుతో తెలుగు వివరణలతో వీరు రచించిన English Grammar Fundas పుస్తకం విశాలాంధ్ర, నవచేతన ప్రచురణల ద్వారా విడుదలై అత్యధికంగా అమ్ముడయ్యే గ్రామర్ పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం దాదాపు 500 పేజీల Your Words are Your Power అనే వొకాబులరీ పుస్తకం తుది దశలో ఉంది. పుస్తక పఠనం, అనువాదం, మరియు ఫోటోగ్రఫీలను తన ప్రవృత్తులుగా మలుచుకున్న వీరు సాహిత్య, ఛాయాచిత్ర రంగాలలో విశేష కృషి చేశారు. మనుబెహన్ గాంధీ రచన బాపు-నా మాతృమూర్తి, లియో టాల్‌స్టాయ్ హిందువులకో ఉత్తరం, జయప్రకాశ్ నారాయణ్ సామ్యవాదం నుండి సర్వోదయ వరకు వంటి ప్రముఖ రచనలతో పాటు వివిధ దేశాల ఉత్తరాలు, ఉపన్యాసాలు, కవితలు, మరియు చెహోవ్, వూల్ఫ్ గాంగ్ బోర్శర్ట్ కథలను తెలుగులోకి అనువదించారు; అంతేకాకుండా హన సూట్ కేస్, రబీంద్రనాథ్ టాగోర్ రచనలైన ఊర పక్షులు, మిణుగురులు, నాలుగు అధ్యాయాలు వంటి అనువాద పుస్తకాలు అచ్చుకు సిద్ధంగా ఉన్నాయి. ఫోటోగ్రఫీ రంగంలోనూ 1982లో FIP వారి మంత్లీ కాంపిటేషన్‌లో 'గ్రాండ్ అవార్డ్ (సిల్వర్ మెడల్)', 1984లో UNICEF నిర్వహించిన 'Focus on the Girl Child' అంతర్జాతీయ పోటీలో పంపిన మూడు చిత్రాలకు గాను ప్రతిష్టాత్మక 'గ్రాండ్ జ్యూరీ అవార్డ్' అందుకున్నారు. ఇటీవల అక్టోబర్ 2025లో ప్రపంచ వన్యప్రాణి సంస్థ (WWF) మరియు తెలంగాణ అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలో కూడా వీరు రెండవ బహుమతిని గెలుచుకున్నారు.

All rights reserved - Sanchika®