సంచికలో తాజాగా

తిక్కా సత్యమూర్తి Articles 1

నా పేరు తిక్కా సత్యమూర్తి. తల్లితండ్రులు శ్రీ తిక్కా వెంకటరెడ్డి నాయుడు, శ్రీమతి సోమేశ్వరమ్మ. పాఠశాల విద్య సొంతూరు దేవగుప్త రావులపాలెంలో జరగగా, కళాశాల విద్య అమలాపురం ఎస్.కె.బి.ఆర్. కళాశాలలో,విశ్వవిద్యాలయం విద్య ఆంధ్రా విశ్వ విద్యాలయంలోనూ సాగింది. కేంద్ర ప్రభుత్వ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలో విజయం సాధించి 1978 లో కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్ గా విశాఖపట్నంలో ఉద్యోగం మొదలు పెట్టాను. 2014లో హైదరాబాదులో కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ గా పదవీ విరమణ చేసి హైదరాబాద్ లోనే నివసిస్తున్నాను. ఆంధ్రా విశ్వ విద్యాలయం నుండి ఎం.ఏ, బి. ఎల్, ఎంఎల్, ఎంబిఏ డిగ్రీలతో పాటు న్యాయ శాస్త్రంలో పీ.హెచ్.డి పట్టా కూడా పొందాను. ఉద్యోగ బాధ్యత నిర్వహణలో నిబద్ధతకు గుర్తింపుగా భారత రాష్ట్రపతి విశిష్ట సేవా అవార్డు పొందాను . కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సయిజ్ చీఫ్ కమిషనర్ నుండి సమ్మాన్ అవార్డు కూడా పొందాను. కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ నుండి విశిష్ట సేవలకు గాను నగదు బహుమతులు కూడా అందుకున్నాను. ఉద్యోగ విరమణ తరువాత హైదరాబాద్ లోనే వకీలుగా వృత్తి కొనసాగిస్తున్నాను. నా భార్య శ్రీమతి తిక్కా శ్రీదేవి. ఇద్దరు పుత్రులు.. పెద్దాయన వినయ్ చంద్ర అమెరికాలో స్థిరనివాసం ఏర్పరచుకుంటే చిన్నాయన అజయ్ చంద్ర ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్నాడు. ఇక.. నా రచనా వ్యాసంగం సంగతికొస్తే .. కళాశాల రోజుల్లోనే వ్రాయటం మొదలెట్టాను. కళాశాల మేగజైన్ లో నా రచనలు ప్రచురితమయ్యాయి.కవితలు వ్రాస్తూ వివిధ అంతర్జాల సాహితీ సమూహాల్లో పోస్ట్ చేస్తున్నాను. “జీవిత పాఠాలు” ప్రచురితమవుతున్న నా నాల్గవ కవితా సంకలనం. "మనసులోని మాట" "అంతరంగ తరంగాలు" “అంతర్మథనం” ప్రచురింపబడ్డాయి. "అంతరంగ తరంగాలు"కు కవిత్వం విభాగంలో గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ జాతీయ పురస్కారం లభించింది. తెలుగు సాహితీ వనం వారినుండి 2025 వ సంవత్సరంలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్నాను.

All rights reserved - Sanchika®