ఆ అమ్మాయి –అమ్మ కమ్మని చేతివంటకడుపారా తినాలనినాన్న తెచ్చిన రకరకాల పళ్ళన్నీమనసారా రుచి చూడాలనీఅమ్మానాన్నల తీపి కబుర్లు వింటూకంటినిండా నిద్రపోవాలనీఊహల రెక్కలు అల్లారుస్తూసెలవు లివ్వగానేకాలేజీ హాస్టలు నుంచిరామచిలకై రయ్యిన ఊర్లో వాలిపోతుంది.
ఇంట్లో అడుగు పెట్టగానే –అమ్మా నాన్నల అరుపులు ఆహ్వానిస్తాయిరణగొణ ధ్వనులు విస్మయపరుస్తాయిచదువుకున్న సంస్కారం విడిచిఇద్దరూ పరిసరాలను మరిచిదున్నల్లా రంకెలేస్తూ పోట్లాడుకుంటూఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుంటారు.
ఆ బీభత్స దృశ్యాన్ని చూసిభీతిల్లి ఒంటరి కుందేలై కుమిలిపోతుంది.తనువు రెండు శకలాలుగా విడిపోతుందిఇల్లు నరకానికి నకలుగా తోస్తుందిఇప్పటివరకు జైలుగా భావించిన హాస్టలు భవనంసుందర నందనవనమైపోతుందిఅంతే –స్నేహితుల మధ్య సీతాకోకచిలుకలా విహరించడం కోసంమనసు రైల్వే స్టేషన్ వైపు పరుగుతీస్తుంది!
పిల్లల భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేసేఆ బాధ్యత లేని బాంధవ్యంరెండు సమాంతర రైలు పట్టాల్లావిడాకుల వైపుకు దారి తీస్తుంది!
సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
Very nice to know certain things. I hope you will continue this sprit even after retirement also.May god give you good health& happy life.🙏
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™