[శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ రచించిన ‘బంధం ఏమిటి’ అనే భావగీతం పాఠకులకి అందిస్తున్నాము.]


బంధం ఏమిటి నీకు నాకు?
రేయిని నేనైతే పవలువు నువ్వు
నీ రాకతో నన్ను కరిగిస్తావు
పరుగిడి నేవస్తే మరుగౌతావు.. ||బంధం||
బింబము దాగదు అద్దము లోపల
అలలే ఆగవు తీరపు తిన్నెల..
ఎదురుచూపులే మధువులు నింపెను
విరహ బాధలే హాయిని పెంచెను.. ||బంధం||
శిశిరము కనలేదు ఆమని చివురుల
శిలలే వినలేవు నది సరిగమలా..
కలయికే విషమౌనా అమర ప్రేమల?
కలవని ప్రేమే చరితగ మిగులున?.. ||బంధం||

శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ గారు ఆంగ్ల అధ్యాపకురాలు, వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, గీత రచయిత్రి, కవయిత్రి, అనువాదకురాలు(తెలుగు-ఇంగ్లీష్-హిందీ), సామాజిక కార్యకర్త.