సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సి.హెచ్. సుశీలమ్మ గారి స్పందన: *మొదటిసారిగా ‘శరcచంద్రిక’ తో విభేదిస్తున్నా. ఛాయాదేవి గారి బోన్సాయ్ కథ వచ్చిన తర్వాత “స్త్రీవాదం Feminism అనే “పదం” వచ్చింది. అయితే ఆ స్త్రీవాదం ఏదో వోల్గాతోనో, నీలి మేఘాలతోనో వచ్చిందనుకోవటం పొరపాటు.
    అంతకుముందే స్త్రీవాద ధోరణిలో రాసిన గొప్ప రచయిత్రులు ఉన్నారు. తొలితరం కథా రచయిత్రుల గురించి ప్రతి నెల 25 నెలల పాటు లైబ్రరీకి వెళ్లి చూస్తూ ఉంటే ఎన్నో అద్భుతమైనటువంటి అభ్యుదయ ధోరణిలో రాసిన కథలు దొరికాయి. కాబట్టి స్త్రీవాదము, ఫెమినిజం అనే పదం రాకముందే అబ్బూరి ఛాయదేవి రాసిన బోన్సాయ్ కథ నిజంగా స్త్రీవాద కథ అని నా ఖచ్చితమైన అభిప్రాయం. మీరు స్త్రీవాద కథ కాదు అని అన్నారు. కానీ మా అమ్మగారు, మీ అమ్మగారు ఆ రోజుల్లో ఇంటికి మహారాణులే. వారు చెప్పినట్టే ఇంటిల్లిపాదీ వినేవారం. కానీ దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక స్వాతంత్రం లేకపోతే కేవలం భర్త మీదే ఆధారపడి ఉంటే ‘కరివేపాకే’ కాదు గాని, ఏ కడుపు నొప్పి వచ్చి సోడా కొనుక్కోవాలన్న భర్తని డబ్బులు అడిగే పరిస్థితి. కాబట్టి బోన్సాయి కథ, సంభాషణలు వెనుక స్త్రీవాద ధోరణి ఉంది అనే నేను కచ్చితంగా అనుకుంటున్నాను.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®