‘సినిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- ఎస్. జానకి పాడిన ‘తూ హై రాజా మై హూ రాణీ’ అనే పాటను శ్రీదేవి పై దర్శకులు కె. బాలచందర్ ఏ చిత్రంలో చూపించారు?
- ‘మనవి సేయవే, మనసారా చెలికి నాదు ప్రేమ’ పాటను ఘంటసాల గారు పాడగా, టి.వి.రాజు సంగీత దర్శకత్వంలో, కె. కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. పై చిత్రీకరించిన చిత్రం ఏది?
- వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., సావిత్రి, రేలంగి నటించిన ఏ చిత్రానికి ఎం.ఎస్. ప్రకాశ్ సంగీతం అందించారు?
- బి.ఆర్. పంతులు కన్నడంలో తీసిన ‘సాకు మగళు’ చిత్రం ఆధారంగా తెలుగులో ఎన్.టి.ఆర్., దేవిక, జానకి గార్లతో తీసిన చిత్రం ఏది?
- తమిళంలో నిర్మాత, దర్శకలు టి. ఆర్. రామన్న – ఎంజిఆర్, బి. సరోజాదేవి గార్లతో తీసిన ‘పాశం’ చిత్రాన్ని తెలుగులో ఎన్.టి.ఆర్., బి. సరోజాదేవి గార్లతో ఏ పేరుతో తీశారు?
- ఆమంచర్ల శేషగిరిరావు దర్శకత్వంలో డి. బి. నారాయణ గారు ఎన్.టి.ఆర్., దేవికలతో తీసిన ‘పెండ్లి పిలుపు’ చిత్రానికి సంగీత దర్శకులు ఎవరు?
- ఎన్.టి.ఆర్., ఏ.ఎన్.ఆర్., ఎస్.వి.ఆర్., కన్నాంబ, సావిత్రి, అంజలీదేవిలు నటించిన ‘చరణదాసి’ చిత్రంలో ద్విపాత్రలు వేసిన నటుడు ఎవరు?
- ఎన్.ఏ.టి.వారి ‘గులేబకావళి కథ’ చిత్రంలో ‘బకావళి’ పాత్రధారిణి పేరేమిటి?
- మద్రాసులో ఉన్న ఓ భవంతిలో పూర్వం తరచుగా షూటింగులు జరిగేవి. ఆ భవనం పేరు? (క్లూ: ఎర్రగులాబీలు చిత్రం)
- ‘కనులు చాలవు, కలము చాలదు, నిన్ను పొగడ కాళిదాసు కవిత చాలదు’ అనే పాట ఎస్.పి. బలాసుబ్రహ్మణ్యం, సుశీల పాడగా ఎన్.టి.ఆర్., అంబికలు తెరపై నటించిన దాసరి చిత్రం ఏది?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 ఏప్రిల్ 18వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సినిమా క్విజ్ 32 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 ఏప్రిల్ 23 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 30 జవాబులు:
1.మాయా మశ్చీంద్ర 2. యమగోల 3. ఎదురీత 4. వరకట్నం 5. అమర సందేశం 6. సరదా రాముడు 7. సతీ తులసి 8. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 9. మూడు పువ్వులు ఆరు కాయలు 10. అల్లాఉద్దీన్ అద్భుతదీపం
సినిమా క్విజ్ 30 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- జానకి సుభద్ర పెయ్యేటి
- మత్స్యరాజ విజయ
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- సునీతా ప్రకాష్
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్యా మనస్విని సోమయాజుల్
- వనమాల రామలింగాచారి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
1 Comments
bmnrao51@gmail.com
సినిమా క్విజ్ 30 లో నాలుగవ ప్రశ్న ‘రవికాంత్ నగాయిచ్ ఆఖరి చిత్రం’ అని అడిగారు మీరు. మీరు ‘తెలుగులో ఆఖరి చిత్రం ఏది ?’ అని స్పష్టం గా అడిగి వుంటే నేను ‘వరకట్నం’ అని చెప్పివుండేవాడిని. కానీ ఆఖరి చిత్రం అనగానే ఆయన దర్శకత్వం వహించిన ‘డ్యూటి’ హిందీ చిత్రం పేరు చెప్పాను. ప్రశ్నలో స్పష్టత లోపించడం వల్ల నా జవాబు తప్పు గా పరిగణించారు.