సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నాగ జ్యోతి శేఖర్ గారి వ్యాఖ్య: *భలే రాసారు.. పాతకాలపు సినిమా అంతా కళ్ళ ముందు కదిలింది. ఓ హీరో మనో ఫలకం పైకి వచ్చి ఆ సన్నివేశాల్లో రూపుదిద్దుకొని ఒకటే నవ్వు వచ్చింది ఆ డ్రమటైజేషన్‌కి. బావుంది సర్. సినీ రైటర్ అనిపించారు 😊👌👍👍💐💐*

    Reply
    1. 1.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      ధన్యవాదాలు మేడం!
      ఆ సినిమాలు అన్నీ ఇష్టం గా చూసేవాళ్ళం.
      ఏ భారతీయ భాషలోని సినిమా ఐనా అప్పట్లో ఇలానే ఉండేది. :)😀

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి స్పందన: *పాతకాలపు సినిమాలన్నీ కలబోసి చాలా బాగా వండారు. ఆ కాలపు మూస ధోరణి సినిమాల మీద మంచి వ్యంగ్యాత్మక కథనం. బాగుంది. ధన్యవాదాలు.*

    Reply
    1. 2.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      సంతోషం సార్!
      సున్నిత హాస్యం, వ్యంగ్యం తో కథలు జనామోదం ఎక్కువండి. అందుకే ఈ చిరు ప్రయత్నం🙏

      Reply
  3. 3

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    కాలేజీ బుల్లోడు పాత సినిమా బాగుంది కళ్యాణ్ గారూ ..హాస్య, వ్యంగ్య ధోరణిలో భలే నవ్వించారు .ముఖ్యంగా అమ్మ ను హమ్మా అంటం నవ్వు తెప్పించింది ..నేల టికెట్ , 12 రూపాయలు ,ఫైటింగ్ దృశ్యాలు మమ్మల్ని వెనకటి కాలానికి తీసుకెళ్లాయి.రంగుల బొమ్మలు బాగున్నాయి . మంచి సరదా కథ , వాస్తవ కథ అందించారు పాత సినిమా ల మీద వ్యంగ్యాస్త్రాలు విసురుతూ .అభినందనలు ..🙏

    Reply
    1. 3.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      అవునండి! ఆ కాలం లో హావభావాలు, ఇప్పుడు కాస్త చమత్కారం, హాస్యం అందిస్తాయి.
      సినిమాలు చాలా ఆనందాన్ని ఇచ్చేవి. అందుకే సరదా ప్రయోగం.

      Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కొమ్మనాపల్లి గణపతిరావుగారి వ్యాఖ్య: *కథ బాగుంది. పాత మూస సినిమా ల ధోరణిని మళ్ళీ కళ్ళకు కట్టినట్టు వ్రాశావు. రచయితగా ఎదగటానికి నైపుణ్యాన్ని సాధించావు. ఆశీర్వాదాలు. కొమ్మనాపల్లి గణపతిరావు, సినీ & టివి కథా రచయిత.*

    Reply
    1. 4.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      మీ వంటి పెద్దలకు ఈ కథ నచ్చటం, నవ్వులు పూయించటం నా అదృష్టం. ధన్యవాదాలు

      Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కథా రచయిత, కార్టూనిస్ట్ మల్లిక్ గారి వ్యాఖ్య: * బాగుంది కళ్యాణ్ గారూ.. నేను రాసిన సూపర్ హిట్ అను దిక్కుమాలిన కథ స్టయిల్ లో ఉంది 😊

    Reply
    1. 5.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      ధన్యవాదాలు సార్!
      నేనేదో ” దిక్కుమాలిన కథ ” వ్రాశాను అని అనుకుంటుంటే, మీరు రాసిన పొట్ట చెక్కలు అయ్యే అంత అద్భుతమైన ” దిక్కుమాలిన కథ” తో పోల్చి అలా ఉన్నది అన్నారు చూడండి!
      అంతకన్నా భాగ్యం ఏమి కావాలి?!
      నవ్వు కోవాలి అనుకునే వాళ్ళు తప్పక చదవాల్సిన కథ ” మీరు వ్రాసిన ఆ కథ”🙏

      Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి స్పందన; *80ల నాటి సినిమాలన్నీ “సినిమా రీళ్ల” మాదిరి తిరిగాయి ఈ కథ చదువుతుంటే.
    చాలా సరదాగా, హాయిగా నవ్వుకునేలా చక్కగా రాశారు.
    ప్రొడ్యూసర్ తన విలాసవంతమైన /తన కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న రూమ్, కవులను, రచయితలను హీరో నక్షత్రానికి(స్టార్ హీరో) తగినట్లు గా..కథను నానా కంగాళి చేయడం
    అప్పటికి ఇప్పటికీ ఏమి మారలేదు.
    అయితే కథ మారిపోయింది. ఎందుకంటే ఒక కథలో యువకుడు అంటే లిటరల్ గా యువకుడే నటిస్తున్నాడు. తాత వయసు అతడు నటించడం లేదు.
    ఇక ఏనభైల్లో డిగ్రీ పాసయ్యాను అనే “ఐకానిక్ సన్నివేశం” స్థానంలో, ఫలాన యూనివర్సిటీ(ఫారిన్) గోల్డ్ మెడలిస్ట్…వంటివి వచ్చి చేరాయి.
    యువతి యువకులు పార్కుల్లో కలుసుకునే స్థానంలో పబ్ లు క్లబ్ లు వచ్చాయి.
    గతంలో ఐటమ్/క్లబ్ సాన్ చేసేందుకు ప్రత్యేకంగా నాట్య తారలు ఉండేవారు. ఇప్పుడు వారి స్థానాన్ని హీరోయిన్ లు ఆక్రమించారు.
    అయినా.. కూడా ఏమైనా కొత్త కథలు.. మంచి సినిమాలు వస్తున్నాయా అంటే రావడం లేదు.
    స్క్రిప్ట్ లో తప్పొప్పులు చూసి పెట్టండి అని నాకు వచ్చే ప్రతి స్క్రిప్ట్ లో(యూత్ రాసేవే ) అదే లోపాలు..అవే తప్పులు…
    కథ ఎప్పుడూ నేల విడిచి సాము చేయకూడదు అనే ప్రాథమిక సూత్రాన్ని చెత్త బుట్టలో పడేస్తున్నారు.
    అందుకే ప్రేక్షకులు ఈ సినిమాలను తిప్పి కొడుతున్నారు.

    Reply
    1. 6.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      నమస్కారం! చాలా చక్కని విశ్లేషణ. ధన్యవాదాలు.
      నిజమే సమయం లో మార్పు తప్పా, కథలూ , అక్కడి🎥 వ్యవహారం, అంతా అదే. పెద్ద మార్పు లు లేవు. చాలా.. చక్కగా వివరించారు. 🙏
      కథ చదివి మీ కామెంట్ తెలియ చేసినందుకు మరోసారి ధన్యవాదాలు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®