అర్థం చేసుకుంటే
అందరం సేఫ్…
అలసత్వం చూపిస్తే
అంతా గల్లంతే…!
అతిగా చెబితే….
భయపెడుతున్నారంటారు,
అంతంత మాత్రం చెబితే,
ముందుచూపు
లేదంటారు…
ప్రభుత్వం,
ప్రకటనలు చేస్తే,
వేళాకోళంగా
తీసుకుంటారు.
మిడి.. మిడి.. జ్ఞానం
వేదాంతులు చేప్పే,
వదంతులకు మాత్రం,
వినయంగా…
విలువనిస్తారు!
ప్రస్తుతానికి-
మందులు మాకులులేని
కరోనా వైరస్ అంటువ్యాధిని,
అరికట్టడానికి
ఉన్నది ఒకటే మార్గం!
మనిషికీ మనిషికీ
భౌతిక దూరం ఆవశ్యం,
పిల్లలు వృద్ధులు
ఇంటికి అంకితం కావడం,
ఆరోగ్యకరం…!
సామాజిక బాధ్యతలకు
ప్రాధాన్యతనిచ్చి,
తీసుకోవాల్సిన జాగ్రత్తలను,
పటిష్టంగా పాటించగలగడమే,
మన ముందున్న కర్తవ్యం!
చిన్న.. చిన్న.. అసౌకర్యాలకు,
మంచి మనసుతో
సహకరించడం మన విధి!!

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
42 Comments
డా.కె.ఎల్.వి.ప్రసాద్
నా..కవిత ను
ప్రచురించిన యాజమాన్యం కి
ముఖ్యంగా
మురళీ కృష్ణ గారికి,
సోమశంకర్ గారికి
ధన్యవాదాలు.
Rajendra Prasad
చక్కగా విపులంగా చెప్పారు. మన విద్యా వ్యవస్థలో నైతిక విలువలు, సామాజిక భాద్యతలు నేర్పించే పాఠ్యాంశాలు, వ్యవస్థ ఉండాలి.
రాజేంద్ర ప్రసాద్ – శ్రేయోభలాషి
Sagar Reddy
అందరి కర్తవ్యం బాగ భోదించారు సర్. మీకు ధన్యవాదములు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
ధన్యవాదాలు మీకు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Hello sir
Chala bagundi!
___Mohan Rao
Ex.principal
CKM..COLLEGE
WARANGAL_U
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మోహనరావు గారు
ధన్యవాదాలు మీకు
Dr శంకర్ లాల్
సామాజిక బాధ్యతలు తీసుకోవలసిన జాగ్రత్తలు చక్కగా పొందుపరిచారు మిత్రమా
డా.కె.ఎల్.వి.ప్రసాద్
బ్రదర్
మీ స్పందన కు
హృదయ పూర్వక ధన్యవాదములు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సింపుల్ గా మార్గదర్శకంగా వుంది కవిత….!
______SVLNశర్మ.
హైదరాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
శర్మ గారు
ధన్యవాదాలు
మీకక
గన్నమరాజు గిరిజామనోహరబాబు
నేటి విపత్కర పరిస్థితి లో ప్రభుత్వ చర్యల విషయం లో గుడ్డిగ విమర్శించే సూడోమేధావుల తత్త్వం బయట పెట్టారు …
డా.కె.ఎల్.వి.ప్రసాద్
గురువు గారు
ధన్యవాదాలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Yes, you r right sir.
__mrs.padma.ponnada
Rtd.Teacher
Narasapur
W.G.Dt
డా.కె.ఎల్.వి.ప్రసాద్
పద్మ గారూ
ధన్యవాదాలు మీకు
లక్ష్మీ పద్మజ దుగ్గరాజు
డాక్టర్ గారూ అద్భుతమైన సందేశాత్మక కవితను అందించారు,, చాలా చాలా బాగుందండీ,, అభినందనలు sir,,
డా.కె.ఎల్.వి.ప్రసాద్
లక్ష్మి గారు
ధన్యవాదాలు మీకు
Sambasiva Rao Thota
Dr.Prasad Garu!
మీ కవిత ద్వారా ఈ సమయంలో మన సమాజానికి కావలసిన మంచి సందేశాన్ని అందించారు !!!
డా.కె.ఎల్.వి.ప్రసాద్
రావు గారూ
ధన్యవాదాలు మీకు.
Sarasi
ఇదే మన తక్షణ కర్తవ్యం. మన కోసం మనం. మన జనం కోసం మనం. కర్తవ్యం బోధనకు ధన్యవాదాలు సార్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సరసి గారు
ధన్యవాదాలు మీకు.
D.Nagajyothi
సందేశాత్మక కవిత సర్
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మంచి సందేశాన్ని simple పదాల్లో తెలిపారు

___Naga jyothi sekhar
Writer
Kakinada
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
జ్యోతి గారు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Yes sir
This is needed for our own survival
__Dr.N.Harika
Dental surgeon
Karimnagar
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
డా.హారిక.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
[01/05, 11:01] Dr.Nagulu@my teacher Hyderabad: Very nice
[01/05, 12:42] Dr.Nagulu@my teacher Hyderabad: These days are not comfortable
____Dr.v.Nagulu.ph.D
Rtd.controller of examinations
Osmania university
Hyderabad
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you sir.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చిన్న చిన్న పదాలతో గొప్ప అర్దం నిబిడీకృతమై ఉంది… దానిని తరిమి కొట్టటం మన చేతిలో ఉందని సులభంగా చెప్పారు
___రమేష్ బెనర్జీ
హైదరాబాద్
Jhansi koppisetty
Need of the hour Sir





మంచి సందేశాత్మక కవిత
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ఝాన్సీ గారికి
ధన్యవాదాలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
రమేష్ గారు
మీ స్పందన కు
ధన్యవాదాలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
రమేష్ గారు.
Sam Chintha
కరొనా అణువుని, దాని గుణగణాలను, పర్యవసానాలను సింపుల్ గా బొధపరచినందుకు మీకు ధన్యవాదములు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
శ్యాం
ధన్యవాదాలు నీకు
గుండె బోయిన శ్రీనివాస్
జాగ్రత్తగా ఉంటే ఉంటాము అనే సారాంశాన్ని చెప్పారు బాగుంది సార్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
శ్రీనివాస్
ధన్యవాదాలు మీకు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ఏది చెప్పినా సందేశాత్మకంగా స్ఫూర్తి దాయకంగా హృదయానికి అద్దుకునేలా అద్భుతంగా వ్రాయడం మీకు వెన్నతో పెట్టిన విద్య సార్ కరోనా కర్తవ్యాన్ని చక్కని మీ కవిత రూపంగా మాకందించారు హృదయపూర్వక అభినందనలు మీకు














_____అఫ్సర్ వలీషా
కవయిత్రి/రచయిత్రి
ద్వారపూడి
తూర్పుగోదావరి జిల్లా
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అఫ్సర్ వలీషా గారు
ధన్యవాదాలు మీకు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చదివినం సర్.
మీ కవిత సహజంగానే సరళంగా బాగుంది.
…_____రామా చంద్ర మౌళి
కవి/రచయిత *
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మౌలి గారు
ధన్యవాదాలు మీకు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
పండిత పామరులకు అర్ధమయ్యే రీతిలో సరళంగా చక్కగా ఉంది
___పల్లె నాగేశ్వరరావు
ఆకాశవాణి
వరంగల్ _9
డా.కె.ఎల్.వి.ప్రసాద్
నాగేశ్వరరావు గారు
మీ స్పందన కు
హృదయ పూర్వక ధన్యవాదములు.