అరే కరోనా /జరా సునోనా నోరు మూసుకుని/ ఉధర్ ఖడోనా. నీ అమ్మమ్మలు/ నీ అబ్బబ్బలు ఎందరెందరో /తోకలు ముడిచార్. కలరా కూచి/ ప్లేగు పెద్దమ్మా T.B.తాత /డెంగ్యూ బావ స్వైన్ ఫ్లూ అన్న,చికెన్ గున్యా ఉప్పెనలాగా /మీద దూకినా బెంబెలెత్తక /బ్రతికే వున్నాం. నువ్వెంతా నీ /బతుకెంతా నాణ్యత లేనీ /చైనా మేడువి. నువ్వే౦చేస్తావ్/ఏమి పొడుస్తావ్? మిగతా వైరస్ /భూతాల్లాగే నీ లైఫూ ఓ /త్రై మాసికమే. ఆ తరవాతా/టీకాలొస్తై టేబ్లేట్లోస్తై/నిన్ను తరుముతై. ఇంతదానికే /ఉలిక్కిపడితే ఇంతకాలమూ /ఎలాగవున్నాం నిన్నుమించిన /వన్నెలాడులను ఎంతోమందిని /ఎపుడో కన్నాం. నీతోపాటు /వారు అందరూ వచ్చీపోయే /ప్రయాణీకులే. మీ అందర్నీ /మించిన వాళ్ళని చూపిస్తా నువు /చూస్తావా. దమ్ముంటే /ఎదురొస్తావా యుగాలనించీ /జనాలనెత్తిన నాట్యం చేసే /మతాన్ని చూడు మనుషులచంపే /కులాన్ని చూడు పేదాగొప్పల /తేడా చూడు రాజకీయాల /రొచ్చునుచూడు క్షణ క్షణానికి /వామన మూర్తయ్ పెరుగుతున్న /అవినీతిని చూడు. విపరీతంగా /విచ్చలవిడిగా పెరుగుతున్న /కాలుష్యం చూడు
తరిగి పోతున్న /సమతను చూడు తమకులపోల్లకే పీటలువేసే సాటిలేని ధృతరాష్ట్రుల చూడు. మానవత్వాన్ని /మట్టిలొకలిపే ఆకలి చావుల /నృత్యం చూడు. రైతన్నల /ఆక్రందన చూడు. బడాబాబులకి /గొడుగులుపట్టే బేంక్ లోన్ల /బండారం చూడు . పధకాలేస్తూ/పొట్టలు పెంచే ప్రభుత్వాల /నైపుణ్యం చూడు. ఉచితంకోసం/బిచ్చగాళ్ళుగా క్యూలో నిలిచే /ప్రజల్ని చూడు. వేలఏళ్ళుగా /పాతుకుపోయిన లంచమనే /మహమ్మారిని చూడు. ఇన్నిదెయ్యాలు /చుట్టూవున్నా బ్రతికే వున్నాం /బ్రతికే వుంటాం. నిన్నగాక/మొన్నొచ్చినగుంటవి నువ్వేం చేస్తావ్ /ఏంచెయ్య గలవ్? పళ్ళు నూరకే /పిల్ల పిశాచీ చెయ్యి వెయ్యకే /చైనా బూచీ వచ్చిన చోటుకె /వెళ్ళకపోతే అన్నీమానీ /నిన్నే తింటాం. వైను గ్లాసులో /నిన్నేపోసీ మంచు ముక్కతో /కలిపి మింగుతాం మా ముందరనీ/కుప్పిగంతులా మా ఎదటేనీ / విన్యాసాలా వచ్చిన దారినె/వెనక్కి పో నీ పుట్టింటికి/పరుగిడిపో
భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు” అనే పుస్తకాలు వెలువరించారు.
భువన్ జీ.. మీ శైలిలో.. కరోనా ఉధర్ ఖడోనా.. అంటూ కరోనాను అదిలించారు.. భయపడేది లేదంటూ.. బెదిరించారు. ధన్యవాదములు.
కరోనా విష కన్యను తరిమి కొట్టే మీ యత్నం ‘భువన’ మోహనం !
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™