సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    RAMANARAO

    కొదై…కథ…అద్భుతమైన ఆవిష్కరణ. తెలుగు పాండిత్యం లో దిట్టమైన అవగాహన లేకపోవడం వల్ల చాలా పదాల అర్థము తెలియలేదు. కాని, సారాంశం, ప్రేమ, విరహం, స్వామికి తనను తాను అర్పించ నిర్ణయం…అర్థమయ్యింది. మరిన్ని అద్భుత రచనలు చేయాలని ఆకాంక్ష.

    Reply
    1. 1.1

      Naresh Nunna

      రమణా…
      థ్యాంక్యూ.

      Reply
  2. 2

    చల్లా రామ ఫణి

    అద్భుతం నీ శైలి నరేష్. నీ కల్పనాచాతుర్యం అనుపమానం. పోలిస్తే నీకు కోపమొస్తుందేమో! ముదిగొండ శివప్రసాద్ గారు గుర్తొచ్చారు. అయ్యవారిలా నీవు, చూడికుడుత నాంచారిలా మా చెల్లెలు ఇద్దరూ దిష్టి తగిలేలా ఉన్నారు. అమ్మాయికి పెళ్లి కుదిరినందుకు అభినందనలు.👏👏👏🤗❤

    Reply
    1. 2.1

      Naresh Nunna

      ఫణి గారూ…
      ఈ పోలిక వల్ల కోపం నాకు కాదు, పండితులు, ప్రసిద్ధ చారిత్రక నవల రచనలో మేటి- ముదిగొండ వారికి, వారి అభిమానులకీ కదా!
      మీ ప్రేమకి ధన్యవాదాలు.

      Reply
  3. 3

    Padmapadmapv

    అభివందనాలు,అభినందనలు..❤️🙏sir! ఇంత కన్న రాయడానికి, . . వాక్యాలు దొరకడం లేదు!

    Reply
    1. 3.1

      Naresh Nunna

      అల్పంలో అనల్పాన్ని స్ఫురిస్తారు పద్మగారూ! మీరు ఇంకా రాయవల్సిన పనేమిటి? Thank you very much.

      Reply
  4. 4

    సురేశ్ కొలిచాల

    కవిత్వమో వచనమో తెలియని మీ వచనం యథావిధిగా చాలా బాగుంది నరేష్ (నరేశ్ అని రాయాలని అనిపించినా, మీ పేరును మీరు రాసేవిధంలోనే రాయడమే గౌరవమని అలాగే రాస్తున్నాను).

    చిన్న విషయం: కొదై అని ఎందుకు రాస్తున్నారు? తమిళంలో అయితే கோதை — కోదై (కో- దీర్ఘము ఉందని గమనించగలరు) అని రాస్తారు. లేదా తెలుగులో చక్కగా గోదా అని రాసుకోవచ్చుగదా?

    Reply
    1. 4.1

      Naresh Nunna

      చాలా చోట్ల కొదై అని, దాని అర్థం పూలచెండు అని ఉందండీ. గోదా – కొదై వేర్వేరు అర్థాలుగానే చూశాను కొన్ని తెలుగు టెస్ట్స్ లో. తమిళం తెలిసిన మీ వంటి మిత్రుల్ని ముందుగానే సంప్రదించవల్సింది. థ్యాంక్యూ సురేష్ గారూ..

      Reply
  5. 5

    శ్రీదేవి

    నరేశ్ గారు వినూత్న దృక్కోణంలో ఒక ప్రణయ ఘట్టాన్ని అద్భుతంగా
    ఆవిష్కరించారు.

    మానవ మాత్రులతో నా పెళ్లి ప్రసక్తి వస్తే ఇక నాకు మరణమే అన్నది ఆండాళ్. అందుకేనేమో ప్రేక్షకుడిగా మిగిలిపోవలసిన ఆరాధకుడు అర్చకుడైనాడు.

    ఆ తల్లి అతడిని అలా దగ్గరకు తీసింది
    అతడి మనోరథం యధేచ్చగా పరుగులు తీయటం ఆపి ఉన్నతపథాల వైపు పయనించేటట్లు తమ పాదాల చెంత కట్టడి చేసింది. అప్పుడే కదా ఆ యువకుడికి ఆమె మనోరథం స్పష్టంగా అంతుపట్టేది…ఆమె
    ‘ అష్టాక్షరీ మంత్రరాజస్థిత మనోరథ ‘.

    మనోహరమైన వర్ణనలతో కళ్ళకు చిత్తరువులు కట్టారు. ఏ నాటి గోదా కళ్యాణం.. ఎంతటి తీవ్రమైన భగవద్ ప్రేమ. పక్కనే అమాయకమైన మానవ హృదయ నివేదన.

    పెద్దలు చెప్పినట్లు రసవాదం స్వాధీనమైనవారు చేపట్టినదంతా బంగారమే. అదే విధంగా ఆండాళ్ తల్లి నీడతో పొత్తు కలవారెవరైనా పరమ భాగవతులే. మీ కథ చెప్పిన ప్రేమికుడికి ఆమె నిరంతర సాన్నిధ్యం కన్నా సంతోషం ఏముంటుంది.

    ధనుర్మాసం ముగిసిందని బాధ పడుతుంటే మీ అందమైన కథ ఆనందం కలిగించింది. నన్ను కూడా తలుచుకుని నేను కూడా చదవాలని కోరుకున్నారు. ధన్యాస్మి.

    ఆ తులసీ వన్ సుందరి కృపాదృష్టి మీపై సదా నిలిచి ఉండాలని కోరుతూ…

    శ్రీదేవీ మురళీధర్

    Reply
    1. 5.1

      Naresh Nunna

      ‘నాగేశయః సుతను పక్షిరథః కథం తే
      జాతః స్వయంవరపతిః పురుషః పురాణః
      ఏవం విధాః సముచితం ప్రణయం భవత్యాః
      సందర్శయంతి పరిహాసగిరః సఖీనామ్’
      పాము మీద పడుకుంటాడు, పక్షి మీద పయనిస్తాడు, వయసైతే చాలా ఎక్కువ ఎప్పుడో పాతకాలం మనిషి. అటువంటి వాడిని ఇంత అందమైనదానివి నువ్వెలా కట్టుకున్నావు- అని గోదాదేవిని చెలులు పరిహాసమాడి ఆటపట్టించారట.
      ** **
      అపర రామానుజుని అవతారం, సాక్షాత్తూ రంగనాయకి చేతే ‘వేదాన్తాచార్య’ బిరుదునందుకున్న మహాపండితుడు, దార్శనికుడు “కవితార్కిక కేసరి ‘, ‘సర్వతంత్ర స్వతంత్ర ‘ వేదాంత దేశికాచార్యుల వారు (వేంకటనాథుడు) వైఖాస వసంతోత్సవంలో పాల్గొనడానికి శ్రీవిల్లిపుత్తూరు వస్తారు. గోదాదేవి ఉత్సవ విగ్రహాన్ని స్వామివారి ఆలయంలో వసంతమంటపం దగ్గరకి ఊరేగింపుగా తీసుకువస్తున్నప్పుడే ఆలయసమీపంలోని నాటకవీధిలో ఎదురవుతారు వేదాంత దేశికుల వారు. గోదాదేవి సుందర విగ్రహాన్ని చూడగానే పరవశులైన దేశికుల వారి నోటి వెంట ఆశువుగా శ్లోకాలు మొదలవుతాయి. గోదా ఊరేగింపు వసంత మంటపం చేరేసరికి 29 శ్లోకాల ‘గోదాస్తుతి’- ఆశుకావ్యం సిద్ధమైపోతుంది. అందులో 13వ శ్లోకమే- ‘నాగేశయః సుతను! పక్షిరథః’.
      శ్రీరంగనాథుడిని ఇలా నిందాస్తుతి చేసిన వేదాంత దేశికుల వారు కూడా నన్ను ఆవహించి ఉన్నారు, నేను ఈ ‘దిగంతం’ కథ రాసినప్పుడు.
      “శ్రీమాన్వేంకటనాథార్య కవితార్కిక కేసరి
      వేదాంతాచార్యవర్యోమే సన్నిధత్తాం సదాహృది”
      … అని వారిని సదాహృదయంలో నిలుపుకొని, వారి మీద గ్రంథం రచించిన భాగవతోత్తములు, ‘ఆండాళ్ అవతార వైభవం’ కూడా రచించిన విద్వన్మణి, కథారచయిత్రి- నాకు పరమఆరాధ్యులు అయిన మీరు
      ఈ విధంగా నన్ను ప్రశంసించడం కంటే నా కథకి సార్థకత ఏముంది!

      Reply
  6. 6

    మణి వడ్లమాని

    నరేశ్
    గోదాదేవి ని కళ్ళకి కట్టినట్లు నీకు మాత్రమే సొంతమైన వాక్యాల తో అద్భుతంగా చూపించావు./ వ్రాసావు.

    Reply
    1. 6.1

      Naresh Nunna

      థ్యాంక్యూ మణి గారూ…

      Reply
  7. 7

    prabhu

    ఎంత చక్కగా రాశారు ! ఓహ్ , ఎన్నేళ్ల తరవాత తేట తేట తెలుగు చదివాను.
    మీ రచనలు మరిన్ని చదవాలన్న ఆకాంక్ష తో

    Reply
    1. 7.1

      Naresh Nunna

      మీ ప్రశంసని ఇలానే దక్కించుకోవాలంటే, నా రాతలు మీకు కంటబడకుండా జాగ్రత్త పడాలి. అయినా, ఫేసుబుక్కు అనే మొగసాలకెక్కిన నేను దాచేయాలని చూసినా, దాగేది ఉండదు కాబట్టి, నేనే నా లింకు ఇస్తున్నాను ప్రభు గారూ… వీలైతే, నా పోస్టులు చూడండి.
      https://www.facebook.com/naresh.nunna/
      ఇంకా కుదిరితే, నా e-పుస్తకాలు కొన్ని తిరగేయండి:
      https://kinige.com/tag/Naresh+Nunna

      Reply
  8. 8

    కల్లూరి భాస్కరం

    ఆద్యంతం రసవత్తరం. శ్రీపాద, దేవులపల్లి, మల్లాది లాంటి రచయితలు గుర్తొచ్చారు చదువుతుంటే. మీ భాష, భావం, శైలీ, శిల్పం అన్నీ మంచి పాకానపడుతున్నాయి. శుభం భూయాత్!

    Reply
    1. 8.1

      Naresh Nunna

      కల్లూరి గారూ, మీ అంతటి వారి నుంచి అంత పెద్ద ప్రశంస. ధన్యవాదాలు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!