‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.
పాఠకులకు విశిష్టమైన, విభిన్నమైన రచనలు అందించేందుకు ‘సంచిక’ చేస్తున్న నిరంతర కృషి కొనసాగుతోంది.
దీపావళి సందర్భంగా ‘సంచిక’ – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీని విజయవంతం చేసిన రచయితలందరికి పేరు పేరునా ధన్యవాదాలు. బహుమతులకి ఎంపికైన కథలు, సాధారణ ప్రచురణకు ఎంపికైన కథల జాబితా ప్రకటించాము. విజేతలకు ప్రైజ్ మనీ పంపేశాము. ఈ కథలను త్వరలో ‘సంచిక’లో ప్రచురిస్తాము.
కథల పోటీలు విజయవంతమైన నేపథ్యంలో, ‘సంచిక’ – డా. అమృతలత, సాహితీ ప్రచురణల సహకారంతో మరో పోటీని త్వరలో ప్రకటించనుంది. పద్యకావ్యాలకు, వచనకావ్యాలకు సంబంధించిన ఈ పోటీ వివరాలు త్వరలో వెల్లడిస్తాము.
‘సంచిక’ ప్రచురించి, సంకలనం చేయదలచిన ‘సైనిక కథలు’ పుస్తకం పని మొదలయింది. కొత్తగా రాసిన కథలు, ఇప్పటికే ప్రచురితమైన సైనిక కథలు అందాయి. ఎంపిక ప్రక్రియ ప్రారంభమయింది. వీలైనంత తొందరలో ఈ సంకలనంలోని కథల జాబితాను ప్రకటిస్తాము.
‘సంచిక’లో ప్రచురితమయ్యే రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదిక లవుతున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నెల రెండో వారం నుంచి ‘సంచిక’ వారపత్రికలో శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన నవల ‘శ్రీమద్రమారమణ’ ధారావాహికంగా ప్రచురితమవనుంది. డల్లాస్ లోని సిరికోన సంస్థ నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా నిర్వహించిన పోటీలలో (2023) బహుమతి పొందిన ఈ నవల పాఠకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నాము.
త్వరలోనే ఒక హిస్టారికల్ ఫిక్షన్‌ను ధారావాహికంగా ప్రచురించనున్నాము. వివరాలు అతి త్వరలో.
పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
ఆంగ్ల విభాగంలో ఈ నెల – ముగ్గురు కవుల మూడు కవితలను అందిస్తున్నాము.
ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 నవంబర్ 2024 సంచిక.
సంభాషణం
ధారావాహిక:
కాలమ్స్:
పరిశోధనా గ్రంథం:
గళ్ళ నుడికట్టు:
వ్యాసాలు:
కథలు:
కవితలు:
పుస్తకాలు:
బాలసంచిక:
అవీ ఇవీ:
English Section:
~
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.
The Real Person!
ప్రతిఫలాపేక్ష రహితంగా సంచిక సంపాదక మండలి చేసే సాహితీ సేవ విలువకట్టలేనిది…అభినందనలు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కశ్మీర రాజతరంగిణి-43
పులకించిన మది
ఆకాశవాణి పరిమళాలు-22
మానస సంచరరే-41: అమ్మ అం’తరంగం’!
ఎంతెంత దూరం
ఆఖరి ఉత్తరం
అజ్ఞాత పాత్రలా -2
కాజాల్లాంటి బాజాలు-94: ఎదురుచూపులు
‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -25
పూర్వ సంస్కార వాసనలే మలి జన్మకు కారణభూతం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®