సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి గారి వ్యాఖ్య: *మాలతి వస్తుంది ఏమవుతుందో…*.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గార్య్ వ్యాఖ్య: *మాలతి మనసు స్థిమితం లేదు ఏదేదో ఊహించుకొని బాధపడుతోంది… ఊర్మిళ ఫ్రాక్చరై హాస్పిటల్ లో ఉన్న సమయంలో మాలతి హైదరాబాద్ వస్తోంది…
    జానూని ముక్కు మొహం తెలియకపోయినా తనే బాత్ రూంలో షాంపూ పోసిందని అంటున్నారని జానూ బాధ. ఈ పరిస్థితుల్లో మాలతి వచ్చి ఏం గొడవ చేస్తుందో ఏమో!ఆనంద్ ఎలా రియాక్ట్ అవుతాడో.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. హేమ నళిని గారి వ్యాఖ్య: *అమ్మో మాలతి ఏం గొడవ చేస్తుందో…ఊర్మిళ ఆరోగ్యం కూడా బాగాలేదు.. మధ్యలో జాను పరిస్థితి ఏమిటో.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మణి తిప్పా గారు వ్యాఖ్య: *అమ్మో, మాలతి బయలుదేరింది. ఊర్మిళ హాస్పిటల్‌లో, పాపం పిల్లలు. జాను పరిస్థితి ఏంటో. చూద్దాం… శారద అక్క మనల్ని ఎటు తీసుకుని పోతారో.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అనూరాధ తాతా గారి వ్యాఖ్య: *చాలా బావుంది, పాత్రల చిత్రీకరణ అద్భుతంగా ఉంది. సూపర్ శారద గారు.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పార్థసారథి వల్లూరి గారి వ్యాఖ్య: *ఈ రోజు 14 వ భాగం చదివాను!పాఠకులు కధలో మమేకమై పోతారు! అలాగే మాలతి కున్న భావోద్వేగాల పరిస్థితి లో జానూ ని చూడాలని ప్రయాణం పెట్టుకోవడం పాఠకులకు కొంత ఆదుర్దా! అభివందనాలు మేడమ్ మీ రచనా నైపుణ్యానికి!*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కృష్ణ వాసంతిక గారి వ్యాఖ్య: *ఎంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారంటే శారద గారూ…. మళ్ళీ వారం దాకా ఆగటం కష్టంగా వుందండీ ❤️*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి తలుపులు గారి వ్యాఖ్య: *చదివానండి. ఆలోచన వివేకము లేని వారు చుట్టుపక్కల వారి మాటలు పట్టించుకోని పిచ్చిగ తయారవుతారు. మాలతి యిప్పుడు యేం చేస్తుందో. జాను పరిస్థితి యేంటో.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గిరిజ పీసపాటి గారి వ్యాఖ్య: *ప్రతీ వారం ఒక ఎపిసోడ్ కంటే మరో ఎపిసోడ్ బాగుంది అనేలా ఉందక్కా. మన మాటల్లో నేను యథాలాపంగా టీవీ సీరియల్స్ గురించి అన్న మాటలు ఈవారం ఎపిసోడ్‌లో వస్తుందని మీరు అన్నట్లుగానే వచ్చింది. మాలతి వచ్చాక ఏం జరుగుతుందో త్వరగా తెలుసుకోవాలని ఉంది.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *ఆనంద్…. బిడ్డవట కదా!… అమ్మను రమ్మనక పోయావా… షాంపూ పోసింది… ఉంటారు, సమాజం లో కాదు, ఇలాంటి వాళ్ళు ఇళ్ళల్లోనూ ఉంటారు. మాలతి భయానిక, వంటరి తనానికీ, జానూ తండ్రికి దూరం కావటానికీ ఇలాంటి పని లేని వారి నోళ్ళే కారణం. అది అర్థమై వీరు మఱింత రెచ్చిపోతారే కానీ సిగ్గుతో మారరు.
    నీలం రంగు బెడ్ లైట్ తో… కథలో ఎంత లీనమై పోయినా ఇలా మీరు చేసే వర్ణనలే మా మనసులను మఱో వైపుకు తీసుకు వెళతాయి.
    అవును, ఎవఱో ఒకఱిని అయితే అంటారు, పిన్ని పడితే‌ తననీ, తను పడితే పిన్నినీ. ఇదేమి వినోదమో!
    తమ ఇళ్లలో తమ బిడ్డలకే ఇంత బాధలూ కలిగినా మారరు.
    నేలబారు బుద్ధులకు ఏరియాలతో పని లేదు.
    తమ్ముళ్ల నిదుఱ పాడు చేయకుండా, ఎవఱి తోనూ ఏమీ పంౘుకోకుండా, పాపం ఎలా సర్దుకు పోతోందో పసి బిడ్డ!
    మాలతి లాగా దెబ్బ తిన్న ఆడవాళ్ళకే సీరియల్స్ అవసరం ఎక్కువ. తప్పదు. సీరియల్స్ లో నైనా అంత కన్నా కొత్త కథలు ఏమి వస్తాయి!
    మాలతి మాలతిలా లేదు,‌ మాలతిలో మాలతి లేదు. ఈ ఒక్క మాట ౘాలు.
    మస్తిష్క పొరలు. కలలై, కలతలయి.. మీ ఈ తెనుఁగుకు ౙోహార్లు.
    తల్లి మనసు కదూ! పరులు జానూనన్న మాట తాలూకా బాధ ఇక్కడ ఆమెకు తాకి ఉండవౘ్చును.
    ఊహల పంజరంలో ఆమె బంధీ‌. భలేగా చెప్పారు ఇది.
    రోౙీలా టీచర్లను అభిమానింౘటం వారికై ప్రే చేయటం నాకూ అలవాటే కానీ ఇక్కడ రోౙీ కష్టం చెప్తూ పిల్లల కోసం మంచి పాఠాన్నే జోడించారు, సందర్భానుసారంగా, క్లుప్తంగా అయినా.
    మంచి ౘోట కథ నడకను ఆపారు. ఎదురు ౘూస్తూ…*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!