సంచికలో తాజాగా

Related Articles

20 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: *మాటలు లేవు – VS Bharathi.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. నళిని గారి వ్యాఖ్య: మనసు కరిగిందా… కళ్ళల్లో తడి అదేనేమో. – Nalini Pyaraka.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాతా అనూరాధ గారి వ్యాఖ్య: *ముగింపు చాలా బావుంది అండి. టైటిల్ కి సరిగ్గా సరిపొయింది. – Anuradha Tata.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అభిజ్ఞ గారి వ్యాఖ్య:* ఆనంద్ – మాలతి.. “ఎంత చేరువో అంత దూరము “.. పర్ఫెక్ట్ టైటిల్. తను తనలోని split personality వల్ల నాశనం చేసుకున్న జీవితాన్ని , చివరి క్షణం లో వచ్చిన మార్పుతో తన లైఫ్ ను accept చేసి ఇంకా ఐదివరకులాగా ఒంటరిగా ఉండిపోకుండ గుళ్ళకి , పెరెంటాలకి, షాపింగ్లకి, వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం.. జానును ఆనంద్ దగ్గరికి పంపాలనుకోవడం..చాలా చక్కగా అనిపించాయి.. కళ్ళలో నీళ్ళు తిరిగాయి చదువుతున్నంతసేపూ.
    జాహ్నవి.. starting నుంచి జాహ్నవి maturity నన్ను అబ్బురపరుస్తూనే ఉన్నది.. ఒక వైపు తల్లి .. మరోవైపు దూరమైన తండ్రి ప్రేమ కోసం చేసిన ప్రయాణం.. తల్లి , తండ్రి, పిన్ని దగ్గర తనకు ఎదురైనా situations ను ఎంత చక్కగా హ్యాండిల్ చేసిందో అస్సలు.. చివరికి మాలతి తండ్రి దగ్గరికి వెళ్ళమన్న కూడా .. మీరు ఇద్దరు ఒంటరి అవుతారు .. ఆ మాటల్లో ఎంత భాధ్యత.. ఏ ఎపిసోడ్ కి ఆ ఎపిసోడ్ లో అబ్బురపరిచిన పాత్ర జాహ్నవి ది.. మొత్తానికి మాలతి ,ఆనంద్ ,ఊర్మిళ మరియు జాహ్నవి .. మానసిక పరిస్థితి కి లోబడి ఆనంద్ ను వదిలి వెళ్ళిన మాలతి.. ఎవరు లేకుండా ఆ దేవుడే దిక్కు అనుకునే సమయం లో ఆనంద్ కి దగ్గర అయిన ఊర్మిళ .. ఏమి చేసినా మాలతి లో మార్పు లేక ఇక ఏమి చేయాలేని స్థితి లో ఆనంద్.. తల్లి తండ్రి ప్రేమకు ఆరాటపడే జాహ్నవి.. వీరి ఆవేదనను చాల చక్కగా చిత్రీకరించారు.. చాల ఆసక్తికరంగా , సస్పెన్స్ లతో , ట్విస్ట్ లతో .. చాలా చక్కగా సాగింది ఈ ఎంత చేరువో అంత దూరము.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎన్. వేణుగోపాల్ గారి వ్యాఖ్య: *కథ, చాలా బాగుంది. మాలతి, ఊర్మిళ పాత్రల సంర్షణ కనిపిస్తుంది కానీ, అందుకు సమానం అయిన సంఘర్షణ ఆనంద్‌ది. ముగింపు కూడా బాగుంది.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వసుమతి గారి వ్యాఖ్య: ముగింపు బాగుంది – వసుమతి.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దేవులపల్లి వైదేహి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది అక్కా కథ. ప్రతివారం ఆసక్తికరమైన కథనంతో హృదయానికి హత్తుకునే సన్నివేశాలతో ట్విస్ట్ లతో చివరకు ముగింపు టైటిల్ కి సరిపోయేలా ఉంది💐💐👏❤️.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వల్లూరి పార్థసారథి గారి వ్యాఖ్య: *శారదా మేడమ్ నమస్తే, కధ ఈ నాటి పరిస్థితులకు అనుగుణంగా ఉంది! ముఖ్యంగా మాలతి వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయానికి రావడం చక్కని సందేశం! అలాగే జాహ్నవిని కూడా పరిణతి చెందిన అమ్మాయిలా చిత్రీకరించడం బాగుందండి! అది అవసరం కూడా! ముఖ్యంగా విడాకులు తీసుకున్న జంటలు, వారి పిల్లలకు ఈ కథ ఒక కరదీపిక! మీకు హార్దిక అభివందనాలు!*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎ. ప్రత్యూష గారి వ్యాఖ్య: *కథను గమనిస్తే జాహ్నవి తండ్రిని చేరుకోవాలి అన్న ఆరాటంతో పరుగు తీసి ఎక్కడి నుండి ఎక్కడికో మలుపులు తిరిగి ఉన్న చోటునే వచ్చి ఆగింది కథ. అంతే. కథనం నడిపిన తీరు ఆద్యంతం ఆసక్తికరమై, భావోద్వేగాలు పంచుతూ దూరాలు, చేరువలు సహజం అన్న భావన కలిగించింది. – ప్రత్యూష ఎ.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాధవి చకిలం గారి వ్యాఖ్య: *అందరి మనస్సులకు ఊరట కల్గింది. కథ ప్రశాంతంగా ముగిసింది శారద 👌👌👍మంచి మంచి మలుపులతో. – మాధవి చకిలం.*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి. భార్గవి గారి వ్యాఖ్య: *టైటిల్ సరిగా సరిపోయింది. చదవటం పూర్తయాక ఏం చెప్పటానికి ఇంక మాటలు లేవు. అంతే, అలా ఉండిపోయాను.- జి. భార్గవి, మిరియాలగూడ.*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి తలపూరు గారి వ్యాఖ్య: *చాలా బాగుంది శారదగారు. మాలతి చాల హుందాగా ప్రవర్తించినది. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కొక్కరి మీద ఒక్కొ అభిప్రాయాలు కల్పిస్తు సస్పెన్స్‌తో కధను నడిపిస్తు మంచి ముగింపు ఇచ్చారు. ఇందులో ఎవరినీ తప్పు పట్టలేము.
    శారదగారు మంచి భాషాపటిమతో, అర్థవంతమైన పదప్రయోగలతో, సమాజానికి ఒక స్ఫూర్తి, నీతి ఇచ్చిన మీ నుంచి మరెన్నో కథలు ఆశిస్తున్నా.*

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Ramadevi garu: *Nice,this confidence I want to see in all humans.Irrespective of the situations one has to face everything boldly.Jahnavi can spend time with her mom and dad.Regarding education she can choose accordingly.*

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *మాలతి పాత్ర సానుభూతితో మొదలై, ఆ తర్వాత మనకు ఒక్కొక్క ఘట్టం తెలుస్తూ ఉండేసరికి, ఒకలాంటి బింకము, మొండితనము, అవి దాటిన తర్వాత ఆమె చరిత్ర బయటకు వచ్చేసరికి, అది కాస్తా ఆమె పట్ల ఆమె భయాలు పట్ల అవగాహన గా మారింది. ౙాలి కలిగింౘటమే కాక, ఇటువంటి వారందఱికీ ప్రతినిధిగా కనిపించింది. ముగింపు దశకు వచ్చేసరికి, ఆమె పాత్రలో హుందాతనం కనిపించింది.
    అంటే తప్పు చేయటానికీ, లేదా సరిదిద్దుకోవటానికీ, ఇంకో అవకాశం మనకు లేదు అనుకున్నప్పుడు, మనిషికి తన అనుచిత ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం కనపడింది. ఇది నిజ జీవితంలో అందరి విషయంలోనూ జరగకపోవచ్చు. కానీ, ఇక్కడ మాత్రం అలాగే చూపించడం ఒక మంచి పాఠం. ఏదో కేవలం ఒక కథ రాస్తున్నాను అనుకోకుండా, రచయిత్రి సమాజంలో ఒక మంచి మార్పుకు తపన పడుతూ శ్రీకారం చుట్టారు. సంతోషంగా ఉంది.
    అయితే, అన్ని చోట్లా, ఊర్మిళ లాంటి మంచి వ్యక్తులు ఉండకపోవచ్చు, ఆనంద్ అంత సహనశీలులు ఉండకపోవచ్చు, జాహ్నవి అంత పరిణతి కలిగిన సంతానము కలుగకపోవచ్చు, శృతి కీర్తి వంటి సన్నిహితులు దొరకకపోవచ్చు. అన్నిటికీ మించి మృత్యువు కూడా ఈ విధంగా భయపెట్టకపోవచ్చు.
    అందుకే తల్లి బిడ్డను వాన నుంచి ఆకలి నుంచి ఇతర రుగ్మతల నుంచి కాపాడుకున్నంత పదిలంగా ప్రతి స్త్రీ, తన సంసారాన్ని కాపాడుకోవాలి.
    ఇక్కడ జాగ్రత్తగా స్త్రీలకే ఆపాదించడం ఎందుకంటే, సాంకేతికంగా ఆ సహనం ఆ పట్టుదల ఆ తపన స్త్రీలకే ఉంటాయి అని కొన్ని రుజువులు ఉండబట్టి.
    దీని అర్థం పురుషుడు విర్రవీగవచ్చు అని కాదు.
    కానీ సంసారం నాశనం చేసుకుంటే అది జీవితాన్ని కూడా నాశనం చేయవచ్చు అన్న జాగరూకత ముఖ్యం.*

    Reply
  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్విని గారి వ్యాఖ్య: *నవల లో అన్నీ పాత్రలు, సన్నివేశాలు చక్కగా ఆవిష్కరించారమ్మా.. జాహ్నవికి అన్యాయం జరుగోద్దని, తప్పంతా మాలతి పాత్ర పైనే పడొద్దని కోరుకున్నాను. నేను అనుకున్నట్టుగానే కథ ముగిసింది సంతోషం😍. అలాగే జరిగిన విషయంలో తమ తమ పొరపాట్ల గురించి మాలతి, ఊర్మిళ పాత్రలు ఆలోచించుకొని మనసులో ఒకరి గురించి ఒకరు క్షమాపణలు చెప్పుకున్నారు. కానీ ఇక్కడే నాకో లోపం కనిపించింది అదేమిటంటే ఆనంద్ పాత్ర. మాలతి సైకాలజీ ప్రాబ్లం వలన అలా ప్రవర్తించిందని తెలిశాక కూడా అతను తన పొరపాటు కూడా ఉందని గ్రహించినట్టు చూపించలేదు విషయం తెలియగానే అయ్యో అవునా… మాలతి నువ్వు మొండిగా ప్రవర్తిస్తున్నావనే అనుకున్నా కానీ, నువ్వు బాలింతవు.. బిడ్డను పోగొట్టుకొని ఉన్నావు.. నీకు postpartum డిప్రెషన్ ఏమైనా వచ్చిందేమోననే కోణంలో ఆలోచించలేకపోయాను..ఇంత చదువుకొని కూడా..నన్ను క్షమించు అని మనసులో అనుకున్నట్టు కానీ, మాలతికి చెప్పినట్టుగా కానీ చూపించలేదు. అలా చూపించాల్సింది అమ్మా… ఎందుకంటే అమ్మా… రచయితలు చెప్పిన మాటలు తప్పకుండా పాఠకుల్లో ఆలోచనలు రేకెత్తిస్తాయి. ఈ కథలో అందరు ఉండి కూడా మాలతి తను మొండిది, ఎవరీ మాట వినదు అనే ముద్ర వేయించుకొని చుట్టూ బంధాలు ఉండి కూడా ఒంటరి అయి ఎలా మధనపడిందో… నిజజీవితంలో కూడా చాలామంది తమ సైకాలజీ ప్రాబ్లెమ్స్ తమకీ అర్థం కాక, చుట్టూ ఉన్నవాళ్ళూ అర్థం చేసుకోక ఒంటరిగా జరిగిపోయి ఇబ్బంది పడుతున్నవారు ఎంతోమంది ఉన్నారు… సైకాలజిస్టుని కలవాలని వాళ్ళకు తెలియడమూ లేదు… తీసుకెళ్లాలని ప్రక్కన వాళ్ళకి తెలియడమూ లేదు. అందుకే ఆనంద్ పాత్రతో క్షమాపణ చెప్పించి ఒక సందేశంలాగా చూపించాల్సిందని అనిపించింది…
    ఇదొక సద్విమర్శ లాగే తీసుకుంటారని ఆశిస్తున్నాను అమ్మా..🙏*

    Reply
  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రావుల వసంతమయి గారి వ్యాఖ్య: *ముగింపు చాలా బావున్నది అండి.*

    Reply
  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తడకమళ్ళ రాంచందర్ రావు గారి వ్యాఖ్య: *శారదా! నవల సూపర్. చక్కని ముగింపుతో పేరుకు తగ్గ విధంగా ముగిసింది. పాత్రల నడక, వ్యక్తిత్వ విలక్షణత, సంఘటనల సమాహారం, భావ శబలత, ఆలోచనాలోచనం, దేనికవే ప్రస్ఫుటంగా పాదుకున్నాయి. అభినందనలు. తడకమళ్ళ రాంచందర్ రావు.*

    Reply
  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సీతంరాజు సంధ్య గారి వ్యాఖ్య: * నాకు కథలో కొన్ని పాయింట్స్ నచ్చాయి. ఇవి చాలా మంది గమనించరు. మాలతి అన్నమ్మ కూడా మంచిదేనా అనుకుంటే, అన్నమ్మ మాలతి సవతి తల్లి కనుక పిల్లాడిని ఏదో చేస్తుందేమోనని భయ పడుతుంది. కానీ మాలతి పిల్లాడి గాయానికి కట్టు కట్టి, తన కోపం పిల్లల మీద లేదు అని, తన ఉనికి ఊర్మిళకు
    నిరూపించేందుకే ఆమె ప్రవర్తన అలా ఉండేదని ఇక్కడ రైటర్ అన్యాపదేశంగా నిరూపించడం బాగుంది. మాలతి పాత్రను నేటి తెలుగు సీరియల్స్ లో లేడీ విలన్ పాత్రలా మార్చనందుకు సంతోషంగా ఉంది. ఆడదానిలో అమ్మ ఉండకుండా ఎక్కడ పోద్ది అని అన్నమ్మతో అనిపించి, పాత్రల విలువలు పెంచారు. – సీతంరాజు సంధ్య*

    Reply
  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ఇది టి. అంజనీ కుమార్ గారి వ్యాఖ్య: * ఊర్మిళ పాత్ర సూపర్బ్ అండి. మొదటి నుండి ఒకే పద్ధతి లో ఉంది, ఊర్మిళ క్యారెక్టర్. ఆనంద్ జీవితం లో కి వచ్చి కూడా మాలతి అంటే భయమే. భయం కూడా కాదేమో గొప్ప సంస్కారం. ముగింపు బాగుంది. – టి. అంజనీ కుమార్ *

    Reply
  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మణి తిప్ప గారి వ్యాఖ్య: *చాలా బాగుందమ్మా. నచ్చింది. మార్పు చెందిన మాలతిలో పరిణతి బాగుంది. ఈసారి ఆమె దీనిని శిక్ష అనుకోలేదు.
    రైలులో మాలతి మాటలు కన్నీరు తెప్పిస్తే, బట్టలు సర్దుతూన్నప్పటి మాటలు మనసును కడిగి వేశాయి.
    డైవర్సీలందఱూ ఈ కథ ౘదివితే బాగుణ్ణు. మనసును తేలిక పరిచే ముగింపు నిచ్చారు.- మణి తిప్ప*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!