సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి గారి వ్యాఖ్య:
    *చదివానమ్మా. జాహ్నవి అన్నీ ఉత్తరాలు వ్రాసినా ఆనంద్ కి కూతురుకి రిప్లై ఇవ్వాలనిపించకపోవడం, తనను చూడాలనుకోకపోవడం, తండ్రిని కల్పించమని ఓ కూతురు వేరే వ్యక్తికి లెటర్ వ్రాయడం ఇవన్నీ మనసుకి బాధ కలిగించాయి కానీ గతమేంటో, ఆ స్థితి కలిగించిన పరిస్థితులు ఇంకా తెలియవు కాబట్టి ఆ గతం, పరిస్థితులు తెలుసుకోవడానికి next ఎపిసోడ్స్ కోసం ఎదురు చూస్తుంటానమ్మా 🙂 *

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య:
    *చాలా చాలా బావుంది ,ఇంత చిన్నపిల్ల జాహ్నవి లో పరిణతి ఆశ్చర్యం కలుగుతుంది. జాను నా ఫేవరెట్ అయిపోయింది.🩷*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి తలుపూరు గారి వ్యాఖ్య:
    *జాహ్నవి లోని పరిణతి పట్టుదల చూస్తే ముచ్చటేస్తున్నది. పెద్దవాళ్ళ ఈగో పిల్లల మీద ఎంత ప్రభావం చూపెడుతుంది. మాలతి ఆవేశం చూస్తుంటే తనది కూడ కొంచం తప్పుందేమో అని చిన్న అనుమానం.ఊర్మిళ పాత్ర ఎలాంటిదో వేచి చూడాలి.భాష మీద మీపట్టు బాగుంది.బాగా రాస్తున్నారు.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అభిజ్ఞ గారి వ్యాఖ్య:
    *నిద్ర మాత్రలు వేసుకుని హాస్పిటల్ పాలైన మాలతి గురించి చదువుతుంటే చాలా బాధేసింది.. కూతురు ఎక్కడ దూరమైపోతుందో అన్న ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం .. తన మనోభావాల్ని ఎప్పుడూ బయటకి వ్యక్తపరచని జాహ్నవి వాళ్ళ అమ్మ కోసం అలా ఏడవటం చూసి కళ్లు చెమ్మగిల్లాయి.. కథలోకి పిన్ని వెర్షన్ వచ్చేసింది.. ఇప్పుడు ఆమె ఆయా ఉత్తరాలకు ఎలా స్పందిస్తుందో అని చాలా ఆసక్తికరంగా ఉంది.. తరువాతి భాగం చదవాలని చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గిరిజ పీసపాటి గారి వ్యాఖ్య: *మనసు దిగులుగా ఉంటే నిద్రమాత్రలకు కూడా నిద్ర రాదు. ఆ విషయం నాకు అనుభవపూర్వకంగా తెలుసక్కా! పాపం మాలతి నిద్రదేవి వడిలో సేద తీరాలనుకుని మృత్యుదేవతను ఆహ్వానించింది. ప్రమాదం తప్పిందనే అనుకుంటున్నాను. జానూ రాసిన ఉత్తరం ఊర్మిళలో ఎటువంటి మార్పు తెస్తుందో చూడాలి. చాలా సస్పెన్స్ లో పెట్టారు మమ్మల్ని. Waiting for next Sunday. చాలా బాగా రాస్తున్నారు సోదరీ.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి ప్రసన్న గారి వ్యాఖ్య: * బాగుంది అక్క. ఊర్మిళ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సాయి భవాని గారి వ్యాఖ్య: *”నాన్నకు, అమ్మకు ఎవరికీ తను పట్టదా?” “వాళ్ళ ఇగోస్ వాళ్ళకి ముఖ్యం”, “జాహ్నవి ఎవరికీ ముఖ్యం కాదా” ఈ లైన్స్ చదువుతుంటే చాలా బాధేసింది. పెద్దవాళ్ళ కోపాలకి, పంతాలకి నలిగిపోయే ఇలాంటి చిన్నారులు ఎంతమందో…*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హేమ నళిని ప్యారక గారి వ్యాఖ్య: *పాపం మాలతి ప్రమాదాన్ని ఊహించలేదు.. జాహ్నవి ఎంతో matured గా ఈ పరిస్థితిని ఎదుర్కుంటోంది.బహుశా ఊర్మిళ జవాబు ఇస్తుందేమో.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కృష్ణ వాసంతిక గారి వ్యాఖ్య: *మాలతి లాగానే నాకు కూడా, ‘ఆమె’ కి ఉత్తరం రాయటం నచ్చలేదు శారద గారూ.‌ అది తల్లిని అవమానపరచటమే ఆనిపించింది. అసలు అంత ప్రెమగా పెంచిన తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా తండ్రికోసం వెంపర్లాడటమే తల్లికి బాధ అనుకుంటే, ‌ఆమెకి రాయటం మరింత బాధ పెట్టటమే అనిపించిందండీ.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *
    కళ్ళు కన్నీటి కాల్వలు… రూపకాలంకారం…
    భాష‌పైన మీ పట్టూ, భావం పట్ల మీ స్పష్టతా భలే ప్రస్ఫుటించాయి. Excellent Ammaa 👌🏻.
    ద్రిగ్గుళ్ళారు. తెలుగు మీ వంటి వారి వలననే బ్రతుకుతోంది.
    Thanks for this Ammaa.
    ఇక కథ లోని అంశాలు ౘూస్తే,
    మాలతి పాపం ‘ప్రమాదం కావాలీ’ అని అలాగ చేయలేదు.
    ప్రపంచం నుంచీ, కష్టాల నుంచీ దూరంగా ఉండాలి అని ఆరాటం. అంతే. కాకపోతే, అదే జీవితం అనీ, కాదంటే మృత్యువు అనే మౌలికమైన విషయాన్ని ఆమె బాధలు ఆమెను విస్మరింప చేశాయి.
    జాహ్నవిది ఆరాటం, ఈమెది ఆవేదన, పెద్దాయనది ఆందోళన, ఆలోచనా.
    ౘూద్దాం ఇటుపై ఎటు వెళుతుందో కథ!
    కానీ ఊర్మిళ గొడవ చేస్తుందేమో! అపార్థం చేసుకుని!*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!