సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    మహాసముద్రం దేవకి

    మంచి రచనలు మనుషులకు దగ్గర అవుతాయి మాండలిక కథలు మనసులకు దగ్గర అవుతాయి.
    రచయిత్రి మనసును దాటిన జ్ఞాపకాలు, కాగితాల మీద మాండలిక కథలగా మారి.. ఆ కథలు పాఠకుల మనసును తాకి హృదయాన్ని కదిలిస్తే రచయితకి చెప్పలేని తృప్తి..
    అలాంటి కథలను, ఆ అక్షరాల, కాగితాల నడుమ దాగిన అంతర్లీనాన్ని మరొకరు విశ్లేషిస్తే ఆనందం..
    అదే మరొక రచయిత్రి.. అందులోనూ శీలా సుభద్రా దేవి గారు విశ్లేషిస్తే మహదానందం..
    మాండలికం లో వెలువడిన 1. మా ఒరిగిపల్లి గెవనాలు 2. ఇర్ల చెంగి కథలు అనే నా రెండు కథా సంపుటాలను
    ప్రతి అణువూ పరిశీలించి మనసు పెట్టి అందంగా విశ్లేషించిన ప్రముఖ రచయిత్రి, ఉత్తమ కవయిత్రి, గొప్ప విమర్శకురాలు, అద్భుత చిత్రకారిణి.. శీలా సుభద్రాదేవి గారు, (ప్రముఖ చిత్రకారుడు, సాహితీ వేత్త శీలా వీర్రాజు గారి సతీమణి) రాసిన వ్యాసం. తెలుగులో ఈ అంతర్జాల డైనమిక్ వెబ్ పత్రిక ‘సంచిక’ మాధ్యమంగా మీరు చేసిన ఈ కథల పరిచయానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    Reply
    1. 1.1

      శీలా సుభద్రాదేవి

      మొదటగా ఇర్లచెంగి కథల చదివినప్పుడే ఇర్లచెంగి పట్ల మనసుపడ్డాను.అఃదుకే రెండో పుస్తకం కూడా చదివి విపులంగా రాసాను. చక్కని చక్కని మీకథలకు మరోసారి అభినందనలుదవకిగారూ.వ్యాసాన్ని ప్రచురించిన సంచిక నిర్వాహకులకు ధన్యవాదాలు

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ కంపెల్ల రవిచంద్రన్ గారి వ్యాఖ్య: *శీలా సుభద్రాదేవి గారు ఆచార్య ఎంకె దేవకి గారి కథల మీద చేసిన పరామర్శ చాలా విలువైనది. దేవకి గారు అత్యుత్తమమైన రచయిత్రి. కాలం కడుపు తాళం తీసి తన బాల్యాన్ని ఒబ్బిడిగా రాసి ఆ కథల్ని ఇర్లచెంగి కథలు, మా ఒరిగిపల్లె గెవనాలు అని రెండు కథాసంకలనాలు తెచ్చారు. తన ఊరి వాళ్ల పలుకులనే కథల్లో వాడి, మొత్తం కథలన్నీ ఆ నుడిలోనే రాశారు దేవకి గారు. అందుకే ఆమె కథలు చదవడం మొదలుపెట్టగానే ఆ ప్రాంతంలో, అక్కడి భాషతో తెలియకుండానే మమేకమౌతాం. నేటితరానికి దేవకి గారి కథలు ఒక విలువైన సాంస్కృతిక రచన అని కరాఖండిగా చెప్పుకోవచ్చు! తెలుగు పల్లియలలోని తేటదనమంతా దేవకి గారి కథలలో కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీ పాత్రలే కీలకపాత్రలుగా సాంఘికజీవితమూ, కుటుంబజీవితమూ నడవడాన్ని దేవకి గారి కథల్లో చూస్తాం.సుభద్రాదేవి గారు దేవకి గారి కథాశిల్పాన్ని ఆవిష్కరించిన తీరు నన్ను ముగ్ధుడిని చేసింది. ప్రచురణ కర్తలకు, సుభద్రాదేవి గారికి నా శుభాకాంక్షలు! దన్యవాదాలు!!*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®