మరక పడ్డ స్నేహం..!!
స్నేహం గురించి చాలామంది చాలా రకాలుగా నిర్వచించారు, ఇంకా అనేక నిర్వచనాలు మనం చూస్తాం/వింటాం కూడా! ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా దానిని నిర్వచించ గల సామర్థ్యం మనకు లేదు. ఎంత చెప్పినా ఇంకా ఏదో తక్కువగానే చెప్పిన భావన మనకు కలుగుతుంటుంది. ఒక్కోసారి కొన్ని నిర్వచనాలు అపహాస్యం పాలవుతుంటాయి. దానికి కారణం స్నేహానికి సరైన నిర్వచనం తెలియకపోవడం, స్నేహం పేరుతో సరైన స్నేహితునితో స్నేహం కుదరకపోవడం. స్నేహం పేరుతో తమ జీవితాన్నే త్యాగం చేసేవారు కొందరైతే, స్నేహాన్ని అడ్డుపెట్టుకుని వంచించే వారూ, మోసం చేసేవారూ మరికొందరు. స్నేహం పేరుతో, స్నేహమంటే ఏమిటో తెలియక,ఘోరంగా మోసపోయి, సుఖంగా సాగవలసిన జీవితాలు ,అర్ధాంతరంగా ముగిసిపోయిన సంఘటనలు కూడా వున్నాయి.
బాల్యంతో కలసి నడిచిన స్నేహాలు, స్నేహం మీద అపారమైన నమ్మకం, గౌరవం ఇరుపక్షాల వున్నస్నేహాలు సజావుగా బ్రతికి బట్టకడతాయేమో గానీ, మిగతావన్నీ జీవిత కాలాన్ని లెక్కగట్ట వీలులేని స్నేహాలే! ఇద్దరు స్నేహితుల స్నేహం చిలువలు పలువులు చేసి ప్రచారం చేసే మూడో రకం వ్యక్తులు వుంటారు. ఆ స్నేహితులు ఆడ – మగ అయితే ఇక చెప్పేదేముంది? గోరంతలు కొండంతలు అయిపోతాయి. పూర్వాపరాలు తెలియకుండానే రకరకాల ఊహాగానాలకు, అనుమానాలు తోడై వారి వారి స్నేహాలను వక్రీకరించి ప్రచారం చేయడం ఇంచు మించు అందరికీ తెలిసిన విషయమే! అందుకే.. విలువైన ఈ స్నేహాన్ని జీవితాంతమూ స్వేచ్ఛగా ఆస్వాదించే అవకాశం వున్నవాళ్లు చాలా అదృష్ట వంతులే అని చెప్పాలి.
ఒక్కోసారి అన్నెంపున్నెం ఎరుగని స్వచ్ఛమైన స్నేహితులపై విరుచుకుపడే అభాండాలు ఎంతో వ్యథను కలిగిస్తాయి. ఇలాంటి సమస్యలు జీవితంలో, చాలా మందికి ఎదురవుతాయి. దానికి నేను కూడా ఏమాత్రమూ అతీతుడిని కాను. ఒక వ్యక్తి లేదా వ్యక్తుల జీవితాలను కొన్ని రకాల అభాండాలు ఎలా ప్రభావితం చేస్తాయో తెలుస్తుంది. పదండి మరి ముందుకు —
నేను 1982లో మహబూబాబాద్ తాలూకా ఆసుపత్రి (ఇప్పుడు జిల్లా ఆసుపత్రి)లో చేరినప్పుడు, నా సహా వైద్య మిత్రులు, డా. జె. సురేందర్ రెడ్డి, డా. వై. ఆర్. అప్పారావు, డా. వకుళాదేవి గార్లు ఉండేవారు. డా. సురేందర్ రెడ్డి గారు ఇంచార్జి డిప్యూటీ సివిల్ సర్జన్‌గా ఉండేవారు. అంటే నాకు బాస్ అన్నమాట. అందరిలోనూ డా. అప్పారావు గారూ, ఆయన శ్రీమతి లక్ష్మీ ఛాయ, నన్ను చాలా బాగా చూసుకునేవారు. లక్ష్మి (మాధవి నిక్ నేమ్) నన్ను అన్నయ్యా.. అని ఎంతో ఆత్మీయంగా పిలిచేది.
ఇక్కడ మాధవి గురించి కొంత చెప్పాలి. ఆ అమ్మాయి అందంగా ఉండేది. దానికితోడు, బాగా మేకప్ వేసుకునేది. అప్పుడు మహబూబాబాద్ పల్లెటూరు వాతావరణంలో,ఈ అమ్మాయి ఆ జనంలో ప్రత్యేకంగా కనపడేది. ఎక్కువగా రెండో ఆట సినిమాకు వెళ్లేవారు. ఆ దంపతులకు ఒక మగపిల్లవాడు, ఇద్దరు ఆడ పిల్లలు ఉండేవారు. ఆడ – మగ అన్న తేడా లేకుండా అందరి కళ్ళూ మాధవిపైనే ఉండేవి. డాక్టర్ గారిని ఆసుపత్రిలో కలవవలసిన మెడికల్ రిప్రజెంటేటివ్‌లు, ప్రత్యేకంగా ఈ అమ్మాయిని చూడడానికని, ఇంటికి వెళ్లి మందుల సాంపిల్స్, మంచి గిఫ్టులు ఇస్తుండేవారు. ఇక నాతో చాలా కలివిడిగా ఉండేవారు ఇద్దరూ. అప్పటికి నేను బ్రహ్మచారిని కనుక, తరచుగా ఆదివారాలు నన్ను భోజనానికి పిలిచేవారు. నాకు భోజనం వండి పెట్టడానికి, ఇంట్లో పనులు చేయడానికి పని మనిషిని కూడా వాళ్ళే మాట్లాడి పెట్టారు. డా. పండరి నాథ్ గారి ఇంట్లో ఉండేవాడిని. తర్వాత 1983లో నాకు పెళ్లి కావడం, నా శ్రీమతి అరుణ మహబూబాబాద్ రావడం జరిగిపోయింది.




డా. అప్పారావు గారి కుటుంబంతో మా స్నేహం ముందుకంటే ఎక్కువ కొనసాగింది. చాలా సంతోషంగా గడిపేవాళ్ళం. కొన్నాళ్ల తర్వాత ఒక విచిత్ర సన్నివేశం జరిగింది. అది చాలా దురదృష్టకరమైన సన్నివేశమే! అప్పుడు ఏమి జరిగిందో ఇప్పటికీ తెలియదు. అదొక వింత అనుభవం. నన్ను ఎంతగానో కలవరపెట్టి మానసిక వ్యథకు గురిచేసిన సంఘటన.
ఒక రోజు అర్ధరాత్రి మా ఇంటికి కబురు వచ్చింది డా. అప్పారావు గారికి ఒంట్లో బాగోలేదని, ఒకసారి రమ్మనీను. డాక్టర్ గారి ఇంటికి నేను అద్దెకుంటున్న ఇల్లు చాలా దగ్గర. హుటాహుటీన బయలుదేరి వెళ్లాను. అప్పటికే మా సీనియర్ డా. సురేందర్ రెడ్డి గారు అక్కడ వున్నారు. అప్పారావు గారికి ఛాతి నొప్పి వచ్చినట్టు, అన్నం సరీగా జీర్ణం కాలేదని మందులు వేశామని చెప్పారు. కాస్త బాగుందని, వెళ్లిపొమ్మని అప్పారావు గారు చెప్పడంతో తిరిగి ఇళ్లకు వచ్చేసాము. మళ్ళీ తెల్లవారు ఝామున కబురు వచ్చింది. నేను వెళ్లేసరికి డా. సురేందర్ రెడ్డి గారు పరీక్ష చేసి అంతా బాగానే ఉన్నట్టు చెప్పారు. ఇద్దరం బయట కూర్చున్నాం. ఇద్దరినీ నిశ్శబ్దం ఆవరించింది. మాట పలుకు లేకుండా కూర్చున్నాం. కాసేపటికి ఇంట్లోనుండి పెద్ద ఏడుపు వినిపించింది. ఇద్దరం పరిగెత్తుకుని లోపలికి వెళ్లాం. సురేందర్ రెడ్డి గారు వెంటనే గుండె పరీక్ష చెసారు. అప్పటికే అప్పారావుగారు చనిపోయారు. ఆయన చనిపోవడానికి కారణం ఏమిటో ఎవరికీ తెలీడం లేదు. కాసేపటికి బయట రకరకాల వదంతులు పుట్టాయి. ఎవరూ దగ్గరకు రావడం లేదు. బయట ఏవేవో వదంతులు ప్రచారం అవుతున్నాయి. డాక్టరు గారిది నెల్లూరు. బాడీ నెల్లూరు తీసుకు వెళ్ళాలి. కానీ.. బాడీ కూడా వెళ్ళడానికి సాహసించడం లేదు. నేను వెళదామంటే, నన్ను వెనక్కి లాగుతున్నారు, నా మిత్రులు శ్రేయోభిలాషులూనూ. బయట ఆయనది సాధారణ చావు కాదని రకరకాల కథనాలు ఊపు అందుకున్నాయి. చివరికి నేను ఇంకొక హోమియో వైద్య మిత్రుడు డా. ఎం. వి. రామారావు శవం కూడా నెల్లూరుకు బయలు దేరి వెళ్ళాము. బాడీని డాక్టర్ గారి కుటుంభానికి అప్పజెప్పి మేమిద్దరమూ వెనక్కి బయలుదేరాము. దారిలో డాక్టర్ మిత్రుడు వాళ్ళిద్దరి సంసారిక జీవితం గురించి రకరకాల కథలు వినిపించాడు. అప్పారావు గారు చనిపోయేవరకు అవి నా దృష్టికి రాలేదు. అవి నమ్మబుద్ధికాలేదు నాకు. కానీ.. మహబూబాదుకు రాగానే పుకార్లు మరీ ఎక్కువగా వినిపించాయి. ఈ విషయాలు తెలియాలని మాధవికి ఒక రిజిస్టర్డ్ ఉత్తరం నెల్లూరుకు రాసి పిచ్చి పని చేసాను. ఇది ఆ అమ్మాయికి కాకుండా వేరే కుటుంబ సభ్యుల చేతిలో పడింది. అది అనుమానాలకు దారితీసింది. పైగా అది ఎవరిమీదో కాదు.. నాపైననే. అది ఎలా తెలిసిందంటే, ఒకరోజు నెల్లూరు నుంచి, అప్పారావు గారి కుటుంబ సభ్యుడొకాయన మహబూబాబాద్ పనిమీద వచ్చి విషయం చెప్పాడు నా మీద కేసు పెడుతున్నారని.


ఆ మాట విని నా గుండె ఝల్లుమంది. విపరీతమైన భయం పట్టుకుంది. సహాయం చేసినందుకు,వ్యవ-హారం ఇలా ఎదురు తిరిగినందుకు చాలా బాధ కలిగింది. వెంటనే ఆసుపత్రికి దగ్గరలో వున్న గురుతుల్యులు, సహృదయులు, లీడింగ్ లాయర్ గోపాల రావు గారి దగ్గరకు వెళ్లి జరిగినదంతా పూస గుచ్చినట్లుగా చెప్పను. ఆయన అంతా శ్రద్దగా విని ఒక పొడి నవ్వు నవ్వి “ఏమీ కాదు.. డాక్టరు గారు.. నోటీసు రానివ్వండి.. నేను చూసుకుంటాను” అని ఎంతో దైర్యం చెప్పి పంపారు. అయినా ప్రతి రోజూ పోస్ట్‌మాన్‌ను చూస్తే భయం పుట్టేది. అదృష్టవశాత్తు తర్వాత అలాంటి కేసు ఏదీ నా దృష్టికి రాలేదు. మాధవికి కాంపెన్సేటరీ గ్రౌండ్స్ క్రింద జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు. చాలా కాలం వరంగల్లులో ఆమె పని చేసినట్టు నాకు తెలుసు కానీ,తర్వాత ఆమె ఏమైందో తెలియదు.
అయితే డా. వై. ఆర్. అప్పారావు గారు ఎన్నటికీ మరచిపోలేని మంచి మనసు గల మహోన్నత వ్యక్తి. మంచి వైద్యుడు. అంతకు మించి ప్రజా వైద్యుడు. ఆయన స్నేహం నా ఉద్యోగ జీవితంలో గొప్ప అనుభవం. అయితే.. ఆయన చనిపోయిన కారణం ఏమిటో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియకపోవడం ఆశ్చర్యకరమే..!!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
44 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక
సంపాదకులకు
ఇతర సాంకేతిక నిపుణుల కు
హృదయపూర్వక ధన్యవాదాలు.
sagar
జీవితంలో మంచి, చెడ్డా, రెండూ ఉంటాయనే దానికి మీ రచన ఒక ఉదంతం సర్ . స్నేహస్పూర్తితో వదంతులను ఆపేద్దామని మీరు చేసిన పని ఎక్కువ గా ఊహించిఉండవచ్చు. మాదవీగార్ల కుటుంబ సభ్యులు. ఏది ఏమైనా అలాంటి మిత్రుడికి అలా మరణంరావడం విచారకరమే. మీకు ఇలాంటి అనుభవాలుకూడ జీవితంలో రాటుతేలేందుకు ఉపయోగపడ్డాయి అనడంలో సందేహంలేదు. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
జీవితంలో మంచి, చెడ్డా, రెండూ ఉంటాయనే దానికి మీ రచన ఒక ఉదంతం సర్ . స్నేహస్పూర్తితో వదంతులను ఆపేద్దామని మీరు చేసిన పని ఎక్కువ గా ఊహించిఉండవచ్చు. మాదవీగార్ల కుటుంబ సభ్యులు. ఏది ఏమైనా అలాంటి మిత్రుడికి అలా మరణంరావడం విచారకరమే. మీకు ఇలాంటి అనుభవాలుకూడ జీవితంలో రాటుతేలేందుకు ఉపయోగపడ్డాయి అనడంలో సందేహంలేదు. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.
———సాగర్ రెడ్డి.
చెన్నై.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఒక్కోసారి మామూలు పరిచయాలను స్నేహితాలను వక్రీకరించి, ఆజ్యం పోసేవాళ్ళుంటారు. మనుషుల నైజాన్ని మనం మార్చలేము. మనకు తెలియకుండానే మన చుట్టూ విషవలయాలు సృష్టిస్తారు..కథనం బాగుంది.
—-జి.శ్రీ నివాసాచారి
కాజీపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ
Shyam
Fear is the key. Bonafide intentions and actions some times leads to disastrous ends. Its more hazardous if a female is involved. Here its more relevant to remember a quote by Oscar wild “Between men and women there is no friendship possible. There is passion, enmity, worship, love, but no friendship.” Though it does not suit to Indian culture but when the situation comes to critical Stage it prevails. But ultimately the truth wins always.
Friends may be good or bad ,but in our life there is no period where friends have no role or importance. If ,had you have mentioned the cause if death of mr apparao ,we could have been more perceptive about the seriousness of the situation explained so eloquently by you. However one has to keep faith in the friendship as you are doing. Well. Keep it up.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
For your wonderful
Response shyam.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఈ 47వఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉన్నది డాక్టర్ గారూ.స్నేహం గురించి మీరు చెప్పిన నిర్వచనాలు పరిెణామాలు సాధారణంగా అందరికీ తెలిసినవే .కాని మీరన్నట్టు స్నేహాన్ని మిస్ యూజ్ చేయడమొ .లేదా అపార్థాలు చేసికొని ఒకరి మీద అభాండాలు వేసి వారి జీవితాలతొ ఆడుకొవడమొ చేసే వాండ్ల తొనే ప్రమాదం. ఐతే అట్లా చేసే వాళ్ళను గుర్తించటమే కష్టం .గుర్తించే సమయానికి ఆలస్యమైపొతుంది. కావలసిన డామేజి ఐతుంది .ఏమైనా ఉత్కంఠ కలిగేటటట్టుగా సాగుతున్నది మీ జ్ఞాపకాలపందిరి .
” ఆరయ వికార కారణములంటిన నిశ్చలతందనర్చు నెవ్వరి హృదయారవిందములు వారలె ధీవరు లెంచిచూడగన్” కలిగిన వికారాలను తట్టుకొని నిలబడగలిగినవాడే ధైర్యంకలవాడనే మాట యాదికి వచ్చింది .
– —-రామశాస్త్రి
డా కె.ఎల్.వి.ప్రసాద్
రామ శాస్త్రి గారు
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చదివాను. స్నేహం గురించి లోతుగా రాసారు. బాగుంది. నాకు స్నేహం గురించిన మధురమైన జ్ఞాపకాలంటూ ఉంటే చాలా తక్కువని చెప్పాలి. చేదు అనుభవాలు..డబ్బు తీసుకుని ఎగ్గొట్టినవే ఎక్కువున్నాయి. మీ write up లో తెలుసుకున్న నీతి ఏమిటంటే communicate చేయడానికి ప్రత్యక్షం గా తప్ప పరోక్షంగా ప్రయత్నించకూడదని.. బాగుంది.నమస్తే.
——వెంపటి కామేశ్వరరావు
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ
Ch S N Murthy
పుకార్లు అపార్ధాలకు దారితీస్తాయి. అపార్ధాలు కొన్ని పరిస్థితుల్లో ఉద్రేకాలకు అనార్ధాలకు దారితీస్తాయి. విపరీత పరిమాణాలు జరుగుతాయి . జరిగిన తరువాత చింతించడం కన్నా పుకార్లు ప్రచారం చెయ్యకుండా ఉండాలి. మనకు తెలియని విషయాలు పరస్పరామ్ చర్చించుకొని అనుమానాలు నివృత్తి చేసుకోవడం అన్ను విధాలా మంచిది
డా కె.ఎల్.వి.ప్రసాద్
మూర్తి గారు
మీ స్పందన కు ధన్యవాదాలండీ
మొహమ్మద్. అఫ్సర వలీషా
స్వచ్ఛమైన స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించడం లోని తృప్తి దాన్ని వక్రంగా తీర్చి దిద్ది అభాండాలు వేస్తే ఆ బాధ వర్ణనాతీతం అందులో మంచికి వెళ్తే చెడు ఎదురైతే గుండెకు తగిలే గాయం మాటల్లో చెప్పలేనిది.మీరు ఎదుర్కొన్న ఆ ఘటన నిజం గా జీవితంలో మర్చిపోలేనిది అది చెడు ఙ్ఞాపకం గా మర్చి పోవటమే మంచిది సార్ .ఎందుకంటే గుర్తు వచ్చిన ప్రతి సారి తగిలిన గాయాన్ని మరింత రేపుతూ ఉంటుంది. మీ మనసు మీ వ్యక్తిత్వం మంచిది కాబట్టి జరిగిన సంఘటన మిమ్మల్ని కలవరపరచి ఉంటుంది .ఏదైనా మీ ఙ్ఞాపకాల పందిరిలో పోగు చేసిన ప్రతి జ్ఞాపకం మాకు ఒక పాఠమే సార్. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు












మీ మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ శెలవు సార్ 


డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందన కు ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
డాక్టర్ గారు నమస్కారం

మీ జ్ఞాపకాల పందిరి నుండి మరొక మధుర ఫలాన్ని అందించినందుకు ధన్యవాదాలు
మనము ఏ తప్పు చేయనప్పుడు దాన్ని పదిమందికి ఏదో ఒక రూపంలో తెలియజేయడం మీ నిజాయితీకి నిదర్శనం .అలాగే మౌనంగా ఉండి పోయి ఉంటే ఆ తప్పు మనమే చేశామేమోఅని సమాజము నమ్ముతుంది. ఆ సంఘటన జరిగిన సమయములో ఉన్న వ్యక్తులు, నింద ఎదుర్కొన్న బాధితురాలు ఇంకా జీవించి ఉండగానే మీరు ధైర్యంగా పదిమందికి తెలియజేసిన విధానము బహు చక్కగా ఉంది.
లేకపోతే నాకు కలిగిన సందేహం. ఆ సంఘటన తరువాత పోలీస్ కేసు, లాయర్ నోటీసు లాంటి సంప్రదింపులు ఏవైనా జరిగాయా అని…
—–బి.ఎన్. కృష్ణా రెడ్డి
సికింద్రాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
లేదు.సర్.
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Good morning Dr gaaru. The episode 47 is as usual has its own positives and problems…
Friendship and fellowship are as any other relations have their own limitations and exploitations.
The sudden death, and the baseless rumours naturally are painful incidents for any one…
Since the rumours don’t have any substance and authenticity… their life expectancy is very short… and disappear as fast as they crop up.
Anyway, these are common problems in any friendship and association…
Life lessons are tests and trials…. they teach us ways of learning . Even volunteering to help was not appreciated. A bad society.
——Nakka.Sudhakar
PEX
ALl India Radio
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you somuch
Sudhakar garu.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కదిలిస్తుంది.
—–శ్రీమతి లీల శ్యామ్
నిజామాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
థాంక్స్ లీల.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Gkp 47 is a tense and suspence like thriller so far the cause for the doctor death is unknown
DR.T V LU
KAZIPET.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you Dr.
Rajendra Prasad
ఈ మీ చేదు అనుభవాన్ని సరైన ఇంట్రడక్షన్ ఇచ్చారు. మన స్నేహం కల్మషం లేనిది అయితే, భగవంతుడు కాపాడుతాడు అన్నది నిరూపితమైంది.
అయినా ఈ అనుభవంతో నైనా మీరు ఆడవాళ్ళతో సన్నిహితంగా ఉండే టప్పుడు, జాగ్రతలు తీసుకో కుండా మీ స్టాఫర్ తో సమస్యలు తెచ్చు కున్నారేంటి? ( పెండ్లి చేసుకోమని గొడవ చేసిందిగా మీ staffer ఒకరు)
ఇకనైనా జాగ్రత్తగా ఉండండి సర్
రాజేంద్ర ప్రసాద్
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
పుకార్లు, అనుమానాలను సృష్టించి పైశాచిక ఆనందం పొందే వారు స్నేహితులలో, బంధువులలోనే ఎక్కువగా ఉంటారు. అది మనమీద అసూయతో అలా పుట్టిస్థారో తెలియదు. అది ఒక మానసిక రుగ్మత అని అనుకుంటా. ఏది ఏమైనా నా జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో. మానసికoగా చాలా కుంగ దీస్థాఇ. తలస్తే చాల భయం వేస్తోంది ఇప్పటికీ.

——ప్రొ.రవి కుమార్
కాజీపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
తమ్ముడూ..
మీ స్పందన కు ధన్యవాదాలు
Sambasivarao Thota
Prasad Garu!
Aa durghatanaku kaaranam yemainappatiki, chivariki mimmalni anumaaninchadam duradrushtakaram!Baadhakaram!!
Mee manchithanam, nijaayithi…
mimmalni kaapaadindi..
Thank God
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
స్నేహం ఎంత అపురూపమైనదో ఈ జగతిలో.అది ఇచ్చే స్థైర్యం,సాంత్వన మరేదీ ఇవ్వలేదు.అటువంటి స్నేహాన్ని పొందిన వారు అదృష్టవంతులు మీరు చెప్పినట్టు.అయితే ఈనాడు మీరు పంచుకున్న జ్ఞాపకం చిన్న విద్యుత్ఘాతంలా తాకింది.నిజాయితీ పరులకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే ఎంతో మానసిక క్షోభ.ఆనాటి మీ బాధ మా కళ్ళకు కట్టింది.నిజంగా అటువంటివి పరీక్షా సమయాలు.మంచికి పోతే చెడు ఎదురవ్వడం జీర్ణించుకోలేము.మీ ఈ అనుభవాన్ని మాకు పంచడం ద్వారా స్నేహం లో కూడా ఆచితూచి ప్రవర్తించాల్సిన సన్నివేశాలూ, సంఘటనలూ ఉంటాయని చెప్పకనే చెప్పారు. మీ మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ…మీకు నమస్సులు



——నాగజ్యోతి శేఖర్
కాకినాడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
నీ స్పందన కు ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
.మీ కథ ఎప్పటిలాగా బాగుంది ఒక మంచి నీతి నీ కూడా చెప్పారు. మంచి తనం తో ఒక పని చేస్తే , దానిని వక్రీకరించి చూడడం సామాన్యం అయిపోయింది. ఇప్పుడు చదవడానికి బాగానే ఉంది. నిజాంగా మీరూ ఆరోజున ఎంత మనోవేదనకు గురి అయ్యిఉంటోరో .
——డా.సత్యనారాయణ
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
Everyone will have different experiences in life with others. In a different way when two people are opposite sex. Good that you came out of problem with out a scratch.
—-Dr.M.Manjula.
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you Dr.Manjula garu.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Gd Mng doctor garu,
Miss understandings will always be there in every one’s life despite good behavior. Your goodness has helped you.
——-Surya narayana rao
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you sir.
Dr. O. Nageswara Rao
Really Very good Gnapakam chaduvuthunte chala crime thriller real story ga vunna , Gunde dhada puttinche vidamga vundi.
Congratulations.
Manchi chesthe chedu eduraindini ‘
Life lo etlanti sangatanalu thalanchukonte ne bayamga ga vunttundi. Rayatam chala kastam
Entha dhairyamga publish chesinanduku HEARTY
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
డాక్టర్. రావ్.
గిరిజామనోహరబాబు
కళ్ళు తెరిపించే కథనం , పుకార్లు షికార్లు చేస్తే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాలో మీరే సాక్ష్యం … ఏమాత్రం సంబంధం లేని విషయం ఎలా మానసికవ్యథకు కారణమైందో , అదెంత భయంకరమో తెలిసింది ..
స్నేహమనే మాటకే అపవాదైన ఘటన ఇది …..అసలు ‘ స్నేహం ‘ అంటే వదలని జిడ్డు అని అర్థం … అందుకే ఉత్తమ స్నేహాల్ని వదులుకోలేం , కానీ జరిగిన సన్నివేశాలు , సందర్భాలూ , స్నేహమనే మాటనే తలపెట్టవద్దన్న రీతిలో బాధించాయి … లోకానికి కొన్ని కొన్ని విషయాల్లో నిజానిజాలు తెలుసుకొని మసలుకోవాలన్న ఆలోచనా , తీరికా , ఓపికా ఉండవు … అటువంటి సందర్భం ఎదురైనప్పుడు ఎంతటివారైనా భయపడటం సహజం , కాకపోతే న్యాయవాది గారి చిరునవ్వు ఈ సమస్య ఎంత తేలికైందో , ఎంత అవాస్తవమో , ఎంత బాధ్యతారాహిత్యమో చెప్పకనేచెప్పింది …తనిచ్చిన నైతిక ధైర్యం గొప్పది … కాకపోతే ఆ విషయం మిమ్మల్ని ఎంత క్షోభ పెట్టిందో దానికి ఈ అక్షరాలే సాక్ష్యాలు ..
స్నేహాల పట్లా అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరిక చేసినట్టైంది …అభినందనలు సర్ !!!
డా కె.ఎల్.వి.ప్రసాద్
గురువుగారు
మీ స్పందన అద్భుతంగా ఉంది.
విషయ అవగాహన లో,విశ్లేషణ లో
మీకు మీరే సాటి.
ధన్యవాదాలు సర్ మీకు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Gd morning sir.. so many troubles you faced sir.. we have to learn so many things from you sir.. thank you sir
——-Dr.Swathi.
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you dr.