కోటిలింగాలను రాజధానిగా చేసుకొనిపాలించిన శాతవాహనుల రాజ్యం నుండికాకతీయ సామ్రాజ్యమైన ఓరుగల్లు వరకుఅలుపులేని, మరువలేని ప్రయాణంగర్భిణిలా నీళ్ళతో నిండిన గోదావరినిరాయపట్నం వంతెనపై నుండి వీక్షించడమొకఅపూర్వ, అద్భుతమైన దృశ్యావరణమదిఅనిర్వచనీయమైన అనుభూతిని ఆస్వాదిస్తూకనువిందుగా ముందుకు సాగడమొఖ సాహసమే..!
ప్రాంతాలను అనుసంధానం చేసే మార్గమే కావచ్చువేల సంవత్సరాలుగా వారధిగా నిలిచే ఉన్నదిప్రజల మధ్యన బంధుత్వాన్ని కాపాడుతూనే ఉందికొందరు కాలినడకన, మరి కొందరు కార్లు, బైకులపైఇంకొందరు ఇతర వాహనాల్లో వెళ్ళుతుంటారుబడుగు జీవుల బతుకు జీవన పోరాటానికిరహదారెప్పుడు చేదోడు వాదోడుగానే నిలిచింది.!
వెల్గటూరు, ధర్మారం, మల్లాపూర్ ,చొప్పదండికరీంనగర్, హుజురాబాద్, ఎల్కతుర్తి ఊరేదైనాఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికిఏదో ఒక అవసరం నిమిత్తం వెళ్లక తప్పదు కదాఆదిమానవుడు ఆహారం వేటకై కదిలిన నాడేఈ నేల మీద మొదటి ప్రయాణం మొదలైందిచలనమే మానవ నాగరికతకు మూలంఅనేక ఆవిష్కరణలకు దారి దీపమైనదిబతకడానికి ఊతమైన ఆలోచనలుమనిషిని మహా జ్ఞానిని చేశాయి..!
సూర్యుడు అస్తమిస్తున్న సమయంలోబంగారు వర్ణంలో శోభిల్లుతున్నవరి ధాన్యం కుప్పలుఅందరి ఆకలిని తీర్చే అన్నం రాశులువ్యవసాయ మంటేనే ఆహారాన్ని పండించే కళవైపరీత్యాలను తట్టుకొని అందే ఫలసాయంమోకాలు లోతు బురదలో పల్లె ఆడపడుచులువాకిలి ముందు ముగ్గుల చుక్కలు వేసినట్లుగామడుల్లో వరి నారును నాటిన చిత్రాలనుఎన్ని మార్లు చూసిన తనివి తీరేవి కావు కదా..!
నేలతల్లి పై ఆకుపచ్చని కంబలిని పరిచినట్లుగాఎదిగిన మొక్కలను అల్లారుముద్దుగా చూసుకొనిమురిసిన రైతు కుటుంబాలు అనేకంపంట పండించడమంటే సులువైన పనేమి కాదుతుఫాన్లను తట్టుకోవాలి,ఎండలను తట్టుకోవాలినాశనం చేసే పురుగులను అంతం చేసే మందులనుఎప్పటికప్పుడు సరైన మోతాదులో వాడుతుండాలిచంటి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకొన్నఆ కృషీవరుల సేద్యం అన్నింటికంటే గొప్పదేరైతు ఇంటిలో సిరులు కురిసినప్పుడే కదాసంతోషాల ఏరువాక కు హారతిని పట్టేది…!
వరి ధాన్యం ఆరబోతకు కల్లాలు కాన రాకరహదారికి ఇరువైపులా ఆర పెడుతున్నారుమద్దతు ధర కోసం నిరీక్షిస్తూ, ఉద్యమిస్తూనిలువ చేసుకోవడానికి చోటు లేకనష్టమైనా సరేనని అమ్ముకుంటున్న తీరుకుకలత చెందుతూ కన్నీళ్లను దిగమింగుకుంటాంఇంకెన్ని దశాబ్దాలు గడవాలని నిరీక్షణరైతే రాజని నినదించిన ఈ దేశంలోరైతు మోములో చిరునవ్వులు చూడడానికి..!
ఊరు పేరు తో సంబంధం లేదురైతు కుటుంబాల ఇక్కట్లన్ని ఒకటేఓటు బ్యాంకని చూడకుండామానవీయమైన ప్రణాళికలను రచించాలిగ్రామీణ భారతంలో అభివృద్ధి చిగుళ్లనుచూడాలని తపన పడుతున్న పౌరులారారైతుల దగ్గరికి నడవండి, చెప్పిన ధరలకు కొనండికార్పోరేట్ వ్యాపార యజమానుల వ్యూహాల నుండిసన్నకారు రైతు కుటుంబాలను రక్షించుకోవాలంటేఇకపై పల్లెలకు తరలక తప్పదుకాడిని మోయక తప్పదు..!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™