ఆన్షికి… ఆత్మీయంగా..తాత!!
చిన్న పిల్లలు ఏమి ఇష్టపడతారు? సాధారణంగా రకరకాల బొమ్మలు ఇష్టపడతారు. లేకుంటే ప్రీతిపాత్రమైన తినుబండారాలు ఇష్టపడతారు. చాకోలెట్లు, కేకులు, ఐస్ క్రీమ్ వగైరాలను ఇష్టపడతారు. బంధువులు చూడడానికి వస్తే, పిల్లలకోసం ఇటువంటివే బహుమతులుగా తెస్తారు. లేకుంటే బట్టలు తెస్తారు. అలాకాకుండా అప్పటికప్పుడు వాళ్లకిష్టమైనదేదో కావాలని మారాము చేస్తారు. ఇందులో కొన్ని తాత్కాలికమైనవి. క్షణాల్లోనో,నిముషాల్లోనో వాటి పని అయిపోతుంది. తర్వాత పిల్లలు వాటి గురించి మరచిపోతారు కూడా. కొన్ని బొమ్మలూ – ఆటవస్తువులూ కొద్దీ కాలం పిల్లలకు ఆటల్లో విందును అందిస్తాయి. అవి కూడా పిల్లలు ఎదిగే కొద్దీ మారిపోయి కొత్త ఐటమ్స్ రంగంలోకి దిగుతాయి. పుట్టిన రోజుకు కొందరు బంగారం వస్తువులు, మరికొందరు వెండి ఆభరణాలు, ఇంకొందరు పిల్లలకు నిత్యజీవితంలో ఉపయోగపడే వస్తువులు బహుమతులుగా ఇస్తుంటారు. ఇలా రకరకాలుగా బహుమతులు ఇచ్చే సంప్రదాయం కాలం మారుతున్నకొద్దీ రకరకాలుగా రూపాంతరం చెందుతూ ఏదో ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో, తిరుగు సారె.. మాదిరిగా ‘రిటర్న్ గిఫ్ట్’ సంప్రదాయం కూడా మొదలైంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, పేదరికంలో మగ్గుతున్నవాళ్ళు కూడా,ఇలాంటి సంప్రదాయాలకు ఆకర్షితులవుతున్నారు.
సరే ఎవరి ఇష్టం వారిది. సమాజంలో తమ తమ హోదాలను ప్రదర్శించుకునే విషయంలో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టలేము.
నా విషయానికి వస్తే, పిల్లలకు నేను ఎప్పుడూ బొమ్మలు కొనింది లేదు, ఖరీదైన బహుమతులు ఇచ్చింది లేదు, పిల్లలు ఖచ్చితంగా ఎప్పుడూ నన్ను అడిగిందీ లేదు. మా ఇద్దరికీ తగ్గట్టుగానే, పిల్లలు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని, మాకు సహకరిస్తూ, మా బాట లోనే పెరిగి పెద్దవాళ్ళు అయినారు. అయితే పిల్లల పిల్లలు విషయానికొస్తే, చిత్రం, చిత్రంగా మారిపోతుంది. దానికి మేము కూడా అతీతులం కాదు. ఇప్పటికి మాకున్న ఒక్కగానొక్క మనవరాలు (కూతురి కూతురు) ఆన్షి సహాజంగా ప్రత్యేకమే! బట్టలూ -బంగారం -వెండీ మామూలే! వీటితో పాటు వీటికి భిన్నంగా ఏదైనా చేయాలనీ, అది కూడా మొదటి పుట్టిన రోజుకు చేయాలని నాకు ఆలోచన వచ్చింది. నేను తీసుకునే కొన్ని నిర్ణయాలకు తిరుగుండదు. పైగా మనవరాలు ఆన్షి విషయంలో ప్రశ్నించే అవకాశం కుటుంబంలో ఎవరికీ లేదు. ఆన్షి పుట్టిన తేదీ జనవరి -24, కనుక మనవరాలి మొదటి పుట్టిన రోజుకు సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. వెంటనే ఆన్షి పుట్టినప్పటినుండి సంవత్సరకాలం ఫోటోల వేటలో పడ్డాను.






అవి చాలా మట్టుకు మొబైల్‌తో తీసినవే! అప్పుడప్పుడూ నేను రాసిన కవితలు కొన్ని సేకరించాను. ఆశీస్సులు అందిస్తున్నట్టుగా కొంతమంది మిత్రులు (శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి, రేణుక. సుసర్ల, లక్ష్మీ పద్మజ, డా. ఎన్.వి.ఎన్. చారి మొ..) కవితలు రాసి ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా చేర్చాను. అది ఒక పుస్తకం రూపానికి వచ్చింది. సెంటినరీ బాప్టిస్ట్ చర్చి పెద్దలు పాస్టర్ నిరంజన్ బాబు, పాస్టర్ గాబ్రియేల్ (గుంటూరు), చిన్నాన్న కుసుమ వెంకటరత్నం గారూ ఆశీర్వచనాలు అందించారు. మిత్రులు – గురుతుల్యులు పుస్తకాన్ని సమీక్షిస్తూ ముందుమాట రాశారు. పుస్తక ముఖ చిత్రాన్ని ప్రియ మిత్రులు ‘సరసి’ గారు వేసి ఇచ్చారు. అంకితం మనవరాలు ఆన్షికే ఇచ్చాను. సకాలంలో అందమైన పుస్తకంగా శ్రీ దీప్తి ప్రింటర్స్ కృష్ణ గారు పూర్తి కలర్లో ముద్రించి ఇచ్చారు. మనవరాలిని ‘పండు’ ముద్దు పేరుతో పిలుస్తాను గనుక, పండు అర్థం వచ్చేలా పుస్తకానికి ‘పనస తొనలు’ అని పేరు పెట్టాను. సకాలంలోనే పుస్తకం తయారయింది. ఆన్షి పుటిన రోజున కుటుంబ సభ్యుల మధ్య ఆవిష్కరించాలని నిర్ణయించాను. సమాచారం అంతా కుటుంబ సంబంధమైనది కనుక దానికి వెల నిర్ణయించలేదు. అమూల్యం అని పెట్టేసాను.


2018 జనవరి -24 న, ఆన్షి పుట్టిన రోజు ‘హోటల్ మోక్ష్’ (సికింద్రాబాద్ జూబిలీ బస్ స్టాండు దగ్గర)లో ఘనంగా జరిగింది. బంధుమిత్రులు చాలా మంది మిత్రులు హాజరైనారు. నా సహాధ్యాయి ప్రొఫెసర్ హరనాథ్ బాబు, ప్రియ మిత్రులు తోట సాంబశివ రావు గారూ కుటుంబ సమేతంగా, సోదరుడు గుజ్జు. రాజు (జిల్లా ట్రెజరీ అధికారి -వరంగల్) రావడం ఆనందమని పించింది. ప్రధాన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత, ‘పనసతొనలు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది సోదరుడు రాజు చేతుల మీదుగా, పుస్తక ఆవిష్కరణ – అంకితోత్సవం జరిగిన తర్వాత, వచ్చిన అతిథులందరికీ పుస్తకం బహుకరించడం జరిగింది.
ఈ ఆనందోత్సవంలో, నా పుత్ర రత్నం రాహుల్ ఉండడం ప్రత్యేకతను సంతరించుకుంది. తరువాత ఇలాంటి బహుమతి ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. తెలుగుభాష పట్ల ఉత్సాహం తగ్గి పరిస్థితుల ప్రభావం వల్ల నా మనవరాలు ఆంగ్ల భాషకు అంకితం అయినా, తన చిన్నతనంలో తనకోసం తాత రాసిన పుస్తకాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని అయినా తెలుగు భాష నేర్చుకుంటుంది అన్నది నా ఆశ. నా ఆశలో స్వార్థం వున్నా తన అభివృద్ధికి ఆటంకం రాని స్థాయిలో తెలుగును తెలుసుకుంటుంది అన్నదే నా నమ్మకం.
ఇక నా తదుపరి పుస్తకం కేవలం మానవరాలికోసమే చిన్న.. చిన్న కవితలకు ఆన్షి ఫోటోలు జోడించి పుస్తకం వేసాను. ఈ పుస్తకం పురుడు పోసుకోవడానికి వెనుక కొంత చరిత్ర వుంది. నేను ‘మొలక’ అనే అంతర్జాల చిన్న పిల్లల పత్రికకు ప్రతిరోజూ చిన్నపిల్లలకు అనుకూలంగా చిన్న చిన్న కవితలు రాస్తూండేవాడిని. ఈ పత్రిక సంపాదకులు, గతంలో ‘వార్త’ దినపత్రికలో పనిచేసిన సహృదయులు శ్రీ వేదాంత సూరి గారు. ఆయన వార్త – ఆదివారం అనుబంధంలో చిన్న పిల్లలకు సంబందించిన ‘మొగ్గ’ పేజీ చూసేవారు. ఆయన మొలక అంతర్జాల చిన్నపిల్లల పత్రికలో రాయమని ప్రొత్సాహించారు. అంతమాత్రమే కాదు, ఒకరోజు నాకు ఫోన్ చేసి మీరు తప్పకుండా ఈ కవితలు మీ మనవరాలి కోసం పుస్తకం వేయాలని ప్రోత్సహించారు. నాకు కూడా ఆయన సలహా నచ్చింది. 2020 సంవత్సరం, ఆన్షి పుట్టినరోజుకి బహుమతి ఇవ్వాలని మనసులోనే అనుకుని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. వేదాంత సూరిగారు, స్వప్న అనే బుక్ డిజైనర్ (హైదరాబాద్) పరిచయం చేశారు. ఆవిడకు స్క్రిప్ట్ పంపించాను. ఆవిడ పుస్తకాలంకారణ నాకు నచ్చింది. ఓ.కె. చేసేసాను. ముఖ చిత్రం కోసం మిత్రులు ‘సరసి’ గారిని అడిగాను. అయన చాలా బిజీగా వుంటారు. అయినా నాకోసం ఆయన బొమ్మ వేసి పంపారు. ముందుమాట గౌరవ పూర్వకంగా వేదాంత సూరిగారిని రాయమన్నాను. ఆత్మీయ వచనాలు మిత్రమణి, నవలా రచయిత్రి శ్రీమతి ఝాన్సీ. కొప్పిశెట్టి రాశారు. పుస్తకాన్ని నా పుత్ర రత్నం, ఆన్షి -మేనమామ, రాహుల్ కానేటి (బోస్టన్ -అమెరికా)కి అంకితం చేసాను. స్వప్న గారు పుస్తకాన్ని చాలా బాగా తీసుకొచ్చారు.








పుస్తకం లోకల్‌గా శ్రీ దీప్తిలో అచ్చువేయించాను. మనవరాలు పుట్టిన రోజువరకూ ఈ పుస్తకం వేసిన విషయం ఎవరికీ తెలియకుండా రహస్యంగా వుంచాను. కరోనా కారణంగా, పుస్తకావిష్కరణ కోసం ప్రత్యేకంగా కార్యక్రమం ఏమీ తలపెట్టలేదు. సఫిల్ గూడా (సికింద్రాబాద్) ఇంట్లో 24, జనవరి 2021న, బంధువులందరము కలసి పుస్తకం ఆవిష్కరించాము. దీనిని చాలామంది మెచ్చుకున్నారు, సమీక్షలు రాశారు. నేను అడగకుండానే సమీక్షలు రాసి ఇచ్చిన, సహృదయులు శ్రీ నక్కా సుధాకర్ (ఆకాశవాణి -హైదరాబాద్)గారికీ, ప్రముఖ రచయిత్రి, సమీక్షకురాలు, విమర్శకురాలు, ఉపన్యాసకురాలు డా. సి. హెచ్. సుశీల గారికీ ఎంతగానో రుణపడివుంటాను నేను. ఈ పుస్తకానికి ‘చిలక పలుకులు’ అని నామకరణం చేసాను. దానికి సరిపడా సరసిగారి బొమ్మ మంచి ఆకర్షణీయమైంది.


నా మనమరాలు కోసం నేను ఆత్మీయంగా రూపొందించిన బహుమతులు నాకు ఎంతో తృప్తిని కలిగించాయని గట్టిగా చెప్పగలను. ఇలా ఇంకా భవిష్యత్తులో ఏమైనా చేయగలనేమో చెప్పలేను. కానీ.. ఆన్షి మంచి ఎదుగుదలను, కనులారా చూసే అదృష్టాన్ని మాత్రం నిత్యం కోరుకుంటాను. తెలుగు భాషలో మంచి పట్టు సాధిస్తుందని తప్పక నమ్ముతాను.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
49 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి
ఇతర సాంకేతిక నిపుణుల కు
హృదయపూర్వక ధన్యవాదాలు.
Dr.Harika
Good morning sir,
You have given a gift for life time, not just for the occasion for Aanshi.
She grows by cherishing all the memories and the knowledge that you are providing for her, for sure.
That’s a blessing for her to be a grand daughter of you.
And finally your idea of gifting in such a way was surely memorable sir.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కొత్త ప్రయోగం. మనవరాలికి ఎప్పటికీ గుర్తుండే బహుమతి. మీరు సాహిత్య పిపాసి. కాబట్టి, ఆ బంగారుకు ఆ వాసన అంటుకోవాలని, ఆ పరిమళాలు మీరు ఆఘ్రాణిoచాలని కోరుకుంటున్నాను….
—–మారుతీ కిరణ్
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కిరణ్ గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Dr.Harika
Good morning sir,
You have given a gift for life time, not just for the occasion for Aanshi.
She grows by cherishing all the memories and the knowledge that you are providing for her, for sure.
That’s a blessing for her to be a grand daughter of you.
And finally your idea of gifting such a way was surely memorable.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Dr.Harika
Thank you so much.
Shyam
బహుమతుల విషయంలో చిన్న పిల్లల మనస్తత్వం చాలా బాగా విశదీకరించి చెప్పారు రచయిత. మనుమరాలు తో కలిగిన అనుభవంతోరాసి ఉండవచ్చు. లేదా చిన్న పిల్లల మనస్తత్వాన్ని బాగా గమనించి రాసి ఉండవచ్చు
పిల్లల కోరికలు చాలావరకు కొద్ది సమయానికే పరిమితం ఆ తర్వాత వాటిని మరిచిపోతారు. ఎంత విలువైన బహుమతి అయినా సరే వాటిని పిల్లలు కొద్దిరోజులు లేదా కొద్ది సమయం మాత్రమే ఆనందిస్తారు ఆ తర్వాత మర్చిపోతారు. రచయితగా మీకు ఉన్న అవగాహన, పరిశీలనాశక్తి, మళ్లీ ఆ విషయాలన్నీ అక్షర రూపంలో పెట్టడం చాలా అమోఘం. కాలక్రమేణా ఆ పుస్తకం విలువ మీ మనవరాలికి చాలా చాలా పెరిగిపోతుంది . ఆ పుస్తకం ఆమె జీవితంలో అమూల్యమైనది గా మారిపోతుంది అనటం లో అతిశయోక్తి లేదు . మీరు చేసిన ఈ పని గొప్పతనం వెంటనే తెలియకపోయినా
తర్వాత దీని యొక్క విలువ అర్థమైంది. మీ మనవరాలు జీవితంలో ఇది ఒక చెరగని ముద్ర గా తీపి జ్ఞాపకంగాఉండిపోతుంది. మీరు ఒక చిన్ననాటి తీయటి జ్ఞాపకంగా తీయటి గుర్తుగా చెరగని ముద్ర గా ఉండి పోతారు. ఒక తాతయ్య గా మీరు చేసిన పని చాలా విలక్షణంగా ఉంది. ఒక డాక్టర్ ఒక కవి ఒక రచయిత ఎన్ని కోణాలు మీలో?
డా కె.ఎల్.వి.ప్రసాద్
శ్యామ్
నీ స్పందన కు ధన్యవాదాలు.
sagar
గుర్తుంచుకునే అమూల్య బహుమతులు ఆన్షి కి ఇవ్వడం మీ సంతోషమే కాదు సర్ . భావితరాలకు ఇచ్చే మంచి సందేశం. ఆన్షికి నా ఆశీస్సులు మరియు మీకు ధన్యవాదములు. నాకు చిలకపలుకులు పుస్తకం చదివే అదృష్టంకలిగించండి. ధన్యవాదములు
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
నీ స్పందన కు ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
అందరికీ భిన్నంగా ఆలోచిస్తూ, తెలుగు భాషకు పట్టంకట్టిన తీరు అమోఘం.. మీ వినూత్న ఆలోచనా సరళికి, భావితరాలకు స్ఫూర్తిదాయకం..అభినందనలు
—–జి.శ్రీనివాస్ చారి
కాజీపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Good one
–Ravulapati
Sitarama rao
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you sir.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చాల మంచి విషయం ఇతరులు ఆచరించవలసిన విషయం అభినందనలు సార్
——-నిధి (బ్రహ్మ చారి)
హనంకొండ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నిధి గారు
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
54వ సంచిక చదివినాను. మనుమరాలినకొసం మీ ఆరాటం సబబుగా వుంది ఈసంచికలొ వ్యాఖ్ణానించటానికి ఏముంది చాలా బాగుంది
—రామ శాస్త్రి
హనంకొండ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారు
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
డాక్టర్ గారు నమస్కారం

చిరంజీవి అన్శి మొదటి పుట్టినరోజు సందర్భంగా మీరు ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం మరియు పుట్టిన రోజు వేడుకలను నేను మా శ్రీమతి హోటల్ కు వచ్చి ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది. మీరు ఇప్పుడు పంపించిన ఈ శీర్షికను చదువుతుంటే ఆ కార్యక్రమం అంతా నా కళ్ళ ముందు ఇప్పుడే చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
చిరంజీవి ముద్దు పేరు’ పండు’ అనే పదానికి పరిపూర్ణత చేకూరినట్లు మొదటి పుట్టిన రోజుబహుమతిగా విడుదల చేసిన “పనస తొనలు” అనే నామకరణము చక్కగా అబ్బింది. అలాగే రెండవ పుట్టిన రోజు నాటికి ఆ పనస పండులోని తొనల మాధుర్యాన్ని గుర్తుచేస్తూ చిరంజీవి మాట్లాడే ముద్దు ముద్దు మాటలు “చిలక పలుకుల”రూపంలో బహు చక్కగా వివరించారు.
ధన్యవాదాలు
——బి.ఎన్. కృష్ణా రెడ్డి
సఫిల్ గూడ
సికింద్రాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
రెడ్డి గారూ
ధన్యవాదాలు సర్ మీకు.
Sambasivarao Thota
Prasad Garu!
Mee manumaraali modati puttina roju function ki vatchaanu..
Aa rojantha naakinkaa Baagaa gurthundi..
Maree mukhyamgaa Pusthakam ankitha mivvadam..
Great Gesture Andi..
Meeku Abhinandanalu
డా కె.ఎల్.వి.ప్రసాద్
రావు గారూ
ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
డా.ప్రసాద్ గారికి నమస్కారం
మీరు ఒక విశిష్టమైన వ్యక్తి
మీ ఆలోచనలు వైవిధ్య భరితంగా ఉంటాయి.
మనుమరాలికి అమూల్యమైన బహుమతులు అందజేసి ఆ చిన్నారి జీవిత కాలంగుర్తుండేలా ఆజరామరంగా ఉండే
బహుమతికి రూపకల్పనకు కావలిసిన మీ వూహా శక్తిని పొగడడానికి నా వద్ద అంత భాష లేదు
మీకు శుభాకాంక్షలు
చిన్నారికి నా ఆశీస్సులు
—-డాక్టర్. సోమ మాధవరావు
హనంకొండ
డా కె.ఎల్.వి.ప్రసాద్
డాక్టర్ గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
It’s really a great gift. Chi. Aanshi is very lucky to have such a wonderful grandfather. She will definitely remember this gift for her life.
Please convert the book from physical form digital form so that the life of the book would be infinite and would be memory for generations.
—-Surya narayana rao
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you somuch sir.
రాపాక అశోక్ కుమార్
తాతగారు కవి, రచయిత. ఇక మనుమ రాలికి తెలుగు భాషకు కొదువేముంది. తప్ప ని సరిగా తాతగారికి పోటీగా తెలుగు భాషపై పట్టు సాధిస్తుంది.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అశోక్
నీ స్పందన కు ధన్యవాదాలు.
Jhansi koppisetty
అపురూపమైన మనుమరాలికి అరుదైన తాతగారు ఇచ్చే ఆజన్మాంతం గుర్తుంచుకునే కానుకలు
….
…


Very unique gifts for an adorable baby
రెండు కానుకల్లోనూ నా కలం సిరాలొలకటం నా అదృష్టంగా భావిస్తున్నాను
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఝాన్సీ గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Ch SN Murthy
Bhinnamga alochinche meeru mee manumaraliki vibhinnamina bahumati andinchi ame ki meeru nirantaram gurtunde vidhanga mee kavitalato sahityabhilashaku kuda ankurarpana chesaru. Mee aalochana adbhutam
డా కె.ఎల్.వి.ప్రసాద్
మూర్తి గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
మొహమ్మద్. అఫ్సర వలీషా
ఎప్పుడు ఏ బహుమతి ఇవ్వనని చెప్పిన మీరు కనీ వినీ ఎరుగని ఇంత మంచి ప్రేమ పూరిత బహుమతి నివ్వడం అటు మీ పిల్లల ఆనందానికి అటు ఆన్షీ పెద్దయ్యాక చూసుకుని పడే సంభ్రమాశ్చర్యానికి కొలమానాలుండవు సార్ ఏదైనా మీ స్ఫూర్తి మా కందరికీ ఆదర్శం ఇంత మంచి తాతయ్య లభించటం ఆన్షీ అదృష్టం



మీరు మా గురువు కావడం జన్మ జన్మల సుకృతం 


మంచి స్ఫూర్తి దాయక ఆదర్శ పూరిత సందేశాత్మక వ్యాసానికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు 










డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
నీ సహృదయ స్పందన కు ధన్యవాదాలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీనాటి మీ జ్ఞాపకం స్వయంగా మీ నోటితో అత్యంత ఉత్సహంగా చెబుతున్న అనుభూతినిచ్చింది చదువుతుంటే.అసలు కన్నా వడ్డీ అనే నానుడి ఎంత నిజమో మీ ఆన్షిపై మీరు కురిపిస్తున్న ప్రేమ జల్లు చూస్తుంటే తెలుస్తున్నది.తనెంతో అదృష్ట వంతురాలు.ఇంత చక్కటి రికార్డెడ్ బహుమతులు ఇవ్వగల తాతయ్యలను కల్గి ఉండడం.తను ఎదిగిన తర్వాత మీరిచ్చిన అపూర్వ బహుమతుల్ని చూసుకొని ఎంత మురిసిపోతుందో ఇప్పుడే మా స్పర్శకు వస్తున్నది.మీరు ఇచ్చిన గిఫ్ట్ చాలా చాలా నూతనంగా, చాలా ఆనందాన్ని ఇచ్చే జీవిత కాలపు గిఫ్ట్.పనస తోనల్ని,చిలక పలుకుల్నీ ఆస్వాదించే అవకాశం నాకు దొరకడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది.తెలుగు పట్ల,మనవరాలిప్ పట్ల మీ అవాజ్య ప్రేమను తెలిపే పుస్తకాలు అవి.ఒక టీచర్ గా పిల్లలకు ఉపయోగపడే బాలగేయాలు ఆన్షి మూలంగా అందరికీ అందుబాటులోకి రావడం ఎంతో ఉపయుక్తమైన అంశం.నన్ను ఏంతో ఉత్తేజంలో ముంచాయి ఈ మీ పుస్తకాలు. ఈ రోజు ఆ మధుర జ్ఞాపకాన్ని మా అందరితో పంచుకున్నందుకు చాలా సంతోషం సర్

——డి.నాగజ్యోతీ శేఖర్
కాకినాడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా…
చాలా బాగా రాసారు.
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ మనవరాలు కోసం మీ రచనలు, బాగుంది సర్. మీ రచనల తో పాటు ఆ పుస్తకాల మీద బొమ్మలు కూడా చాలా బాగా ఉంటాయి.

—–డా.డి.సత్యనారాయణ
హైదరాబాదు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యోస్మి
డాక్టర్ గారూ.
Naccaw Sudhacaraw Rau
Good morning Dr ji, the episode carried so much of message and memory and gratitude.
You spoke on child psychology, the toyless brought up of your children, the items of children birthday gifts, recent trends, your gracious concern to keep your granddaughter chi Aanshi aka Pandu to be rooted to mother tongue, the unexpected and unthought of gift to your granddaughter in the form of Panasathonalu booklet, and the participants from Dr o Nageswara Rao to pastor Gabriel to your America settled son Rahul ‘s presence, foreword s , cover design by Cartoonist Sarasi, your gracious acknowledgement of the friends, colleagues support and the second book Chilaka Palukulu foreworded by Mrs Jhansi Koppisetti and title by Dr ch Sushila and the inspiration of Sri Vedantha soori…are totally interesting and beautiful.
Your gracious concern for mother tongue is noteworthy.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Sudhakar garu
Thank you somuch.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Meeku unna prema pustakam
Dwara Meeru padina kastam
Adi matallo cheppalemu. Chivariki phalitham brahmandam.
—–డి.చంద్రశేఖర్
హైదరాబాదు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
శేఖర్.
Bhujanga rao
జ్ఞాపకల పందిరి 54 ఇపుడే చదివాము.ముఖ్యంగా ఆడపిల్లలు మెత్తగా ఉండే పాప బొమ్మలతో బాగా ఆడుతారు.వాటికి అన్నం పెడుతున్నామని, పాలు తాగిస్తున్నానని,పడుకోబెడుతున్నానని ఏమేమో చెబుతుంటారు.పిల్లల కోరికలు కొంతమేరకె పరిమితం.మీ చి!!మనుమరాలు మొదటి పుట్టినరోజు బహుమతిగా పనసతొనలు, చిలుకపలుకులు పుస్తక రూపంలో మీ కుటుంబసమేతంగా, మరియు బంధు మిత్రుల సమక్షంలో పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోవడం, మీ భిన్నమైన ఆలోచనా విధానం బాగుంది.మాకందరికి స్ఫూర్తిదాయకం.మంచి విషయాలు అందరూ ఆచరించాలి,ఆచరించగలగాలి.ధన్యవాదములు డాక్టరు గారు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
రావు గారూ
ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మనుమలకు మనుమరాళ్ళ పేరు
మీద కవితలు ఫొటోలతో పుస్తకాలు
ప్రచురించి బహుమతులుగా ఇవ్వడం
మంచిపని. జీవితంలో వారు పెరగిన
తరువాత గొప్ప అనుభూతి పొందు
తారు .కరీంనగర్ లో వేణుశ్రీ ,డింగరి
నరహరి ఆచార్య మనుమలపై శతకాలు వ్రాసినారు. నేనుకూడా
మనుమరాలా అని2౦14లో శతకం
వ్రాయపూనుకొని కొన్ని వ్రాసాను.
బాలసాహిత్యశాఖగా అవిప్రసిద్ధి
పొందుతాయి.వేదాంతసూరి కరీంనగర్ వాడే. నాకూమంచిమిత్రుడు
సహృదయుడు.వాత్సల్యం ప్రేమగా
మారి ,ప్రియమైనకవిత వర్షించినపుడు
దానికి శాశ్వతగుర్తింపు లభిస్తుంది
మంచి బహుమతులిచ్చారు.సంతోషం
——-వజ్జల రంగా చార్య
అమెరికా.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఒక మంచి రచయిత … మంచి తాతయ్య గా మారారు సార్
అభినందనలు సార్
———-ప్రకాశరావు
చెన్నై.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
Dr. O. Nageswara Rao
Pandu ki Happy Birthday
Blessings. May God bless you Anshi. On the occasion of Anshi birthday ki grand father Drklv s Surprising gifts are really history in the world n its for ever. Hearty
congratulations to klv for your novel Idea.
much to klv include my photograph.
Its an extremely Exemplary to the society also. I have tasted panasathonalu very Sweety n tasty., Chilakapalukulu soo nice to read n listen.
Thank you sooo
Thanking you sir Sudhakar garu
All India Radio for remembering my name in his comment.
My special thanks to
Sri Vedantham suri garu,he encouraged me also for book ‘ Dentist uncle ‘printing.
Wish you n your family all the best n happy n healthy life.
May God bless you all.
Once again thank you for very good Article.