[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]


1. లోతు
కొలవలేని
గుండె లోతు కోసం
ఎన్ని టేపులు వృధా చేస్తావు..
నీ గుండె లోతు పెంచుకో
~
2. గాయం
గాయం తగిలే వరకూ
బాధ్యతా రాహిత్యపు
కళ్ళకి
గాఢంగా పెనవేసుకున్న
బాధ్యత విలువ కానరాదు
~
3. శుద్ధి
మాలిన్యాల్ని
ప్రవాహం ఒడ్డుకు నెట్టేసినట్లు
ధ్యాన గంగలో మునిగి
మనోమాలిన్యాలను
శుద్ధి చేసుకోవాలి!
~
4. ముగింపు
ప్రతి పనికి, ప్రతి ఆటకూ
ప్రతి కవితకూ..
ఓ ముగింపు ఉంటుంది
ప్రతి ముగింపు
ఓ మలుపుకు
నాంది పలుకుతుంది
ముగిసే ఈ రూపానికి
ప్రతిరూపమూ ఉంటుంది
ముగించడమంటే
మళ్ళీ మొదలుకావడమే.
(సమాప్తం)