పరి, ఆర్యన్ ఉదయం అమ్మమ్మతో తోటలో తిరిగి తోటపని నేర్చుకున్నాక తాత జగన్ తన స్నేహితుడు రవి మామిడి తోటకు వెళుతుంటే “మాకు బోర్ కొడుతున్నది, మేము వస్తాం” అని బయలుదేరారు.
దారి పొడుగునా పరి తన స్కూల్ సంగతులు చెబుతుంటే ఆర్యన్ మధ్యమధ్యలో “హే! పరి! యూ స్టాప్. లెట్ మీ టాక్ టు తాత” అని గొడవ పడితే సర్దిచెప్పి ఆర్యన్ కబుర్లు వింటూ రవి తాత మామిడి తోట చేరారు.
అప్పటికే వీరి రాకకోసం ఎదురుచూస్తున్న రవి ఎదురొచ్చి “రారా జగన్! అరె, ఆర్యన్, పరి మీరు వచ్చారా? గుడ్. గుడ్” అన్నారు
“రవి తాత మాకు నీ మాంగో గార్డెన్ చూపిస్తావా? ప్లీజ్! ప్లీజ్!”
“అన్ని ప్లీజ్లు వద్దులే. రండి చూపిస్తాను.”
“హే! మాంగో గార్డెన్! ఐ వాన్ట్ మాంగో!” అని ముందుకు పరుగెత్తింది పరి.
“పరి! పరిగెట్టవద్దు. స్లో” అని జగన్ హెచ్చరిస్తే పిల్లలు ఆగి తాతలతో నడవసాగారు.
“ముందుగా మీరు తాజా కొబ్బరి నీళ్లు తాగండి. తాటి ముంజలు తినండి. తరువాత మాంగో గార్డెన్ టూర్‌కి వెల్దాము. ఒకే?”
“ఒకే!”
పరి, ఆర్యన్ కొబ్బరి చెట్ల దగ్గరికి వెళ్లి కొబ్బరి నీళ్లు తాగి లేత కొబ్బరి తిన్నారు.
“సో సాఫ్ట్, స్వీట్ కదా? కొబ్బరి” అంది పరి.
“అవును. ఐ వాన్ట్ సమ్ మోర్” అన్నాడు ఆర్యన్.
రవి తాత ఇంకొన్ని కొబ్బరి నీళ్లు ఇప్పించాడు.
“ఆర్యన్ మీ ముంబైలో మీరు సాధారణంగా బైటకి వెళ్తే ఏమి తాగుతారు?” అని అడిగారు రవి తాత.
“ఊఁ.. కోలా డ్రింక్స్, స్ప్రైట్, ఫ్రూటీ” అన్నారు పిల్లలు.
“అలాగా. మీకు తెలుసా ఆ డ్రింక్స్‌లో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఎక్కువగా తాగితే హెల్త్‌కి మంచికాదు.”
“అవునా? మరి మీరిచ్చిన కోకోనట్ వాటర్?” అన్నాడు ఆర్యన్.
“హెల్త్‌కి చాలా మంచివి. నో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్. చిన్న బేబీస్‌కి కూడా మంచివి. చాలా నీరసంగా ఉన్న, ఫివర్ ఉన్న ఎలాంటి వాటికైనా ఈ వాటర్ ఒకే. ప్రకృతి ఇచ్చిన గిఫ్ట్ మనకి” అన్నారు రవి.
తాతలు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే పిల్లలు కొబ్బరి కాయలు చెట్టు మీద నుండి దించుతుంటే వింతగా చూస్తున్నారు.
కొట్టిసేపటి తరువాత రవి, జగన్‌లు పిల్లలని తీసుకుని మాంగో గార్డెన్ చూపించటానికి వెళ్లారు. పనివాళ్ళు చెట్టుమీదే పండిన మామిడి పండ్లను కోసి బుట్టలో గడ్డిపరిచి పెడుతున్నారు. అదిచూసి ఆర్యన్, పరి
“మ్యాంగోస్” అని అరుస్తూ వెళ్లి బుట్టలో మామిడి పండ్లు తీసుకుని వాసన చూసారు.
“ఊఁ.. యమ్మీ! యమ్మీ! స్వీట్ స్మెల్! హా !” అని ఆనందపడ్డారు.
“పరీ! ఈ బుట్టలో మాంగోస్ అన్ని నీకే” అన్నారు రవి.
“అన్నీ పరికేనా? నాకు వద్దా?” అని ఏడుపు మొఖం పెట్టాడు ఆర్యన్.
“సారీ! ఇద్దరికీ.”
ఇంకొంచెం ముందుకు వెళ్లబోతుంటే “సార్! అటు పిల్లలు వద్దు” అన్నాడు పనివాడు స్వామి.
“ఎందుకు వద్దు?” అన్నాడు ఆర్యన్.
“ఓహ్! సారీ! అక్కడ తేనెపట్టు నుండి తేనె తీస్తున్నారు. కుడితే కష్టం” అన్నారు రవి.
“రవి తాతా… మేము దూరం నుండి తేనె తియ్యటం చూస్తాము. ప్లీజ్!”
“ఓకే! దూరం నుండే…”
దూరంగా పనివాళ్ళు ముసుగు వేసుకుని, చేతికి తొడుగులు వేసుకుని జాగ్రత్తగా తేనెపట్టు డబ్బాల నుండి తేనె పట్టు ట్రే లు తీసి తేనెని వేరు చేస్తున్నారు. తేనెటీగలు రివ్వుమని తిరుగుతున్నాయి.
పిల్లలు దూరం నుండే భయంగా చూస్తున్నారు.
“ఒకే రండి. ఇంటికి వెళ్ళాలి” అన్నారు జగన్. రవి తాత ఇచ్చిన మామిడి పళ్ళ బుట్టతో ఇంటికి వచ్చారు.
“అమ్మమ్మా! అమ్మమ్మా! అమ్మమ్మా!”
“ఏమిటా అరుపులు?” అంది అమ్మమ్మ అంబిక.
“అమ్మమ్మా! మాకు తేనెటీగలు గురించి చెప్పాలి. ఇప్పుడే మేము తోటలో తేనె తియ్యటం చూసాం. స్కేరీ!”
“అలాగే! ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి. లంచ్ తర్వాత ఫ్రీ అవుతాను. అప్పుడు తేనెటీగ స్టోరీ చెబుతా.”
“ఓకే! అమ్మమ్మా!” అని అన్నారే కానీ ఎప్పుడు తేనెటీగ గురించి వింటామా అని ఎదురుచూస్తున్నారు. ఆ టైం రానేవచ్చింది. అమ్మమ్మ దగ్గర కూర్చున్నారు ఇద్దరూ.
“తేనెటీగల గురించి మీకేం తెలుసు?” అడిగింది అంబిక.
“అమ్మమ్మా! అవి చెట్టుమీద పెద్ద సంచి లాగా చేసి దాంట్లో హానీ నింపుతాయి. కుడితే చాలా డెంజర్ అంది అమ్మ” అన్నాడు ఆర్యన్.
“అమ్మ రోజూ నైట్ మిల్క్‌లో తేనె వేసి ఇస్తుంది. మంచి నిద్రవస్తుంది అని” అంది పరి.
“పర్లేదు చాలానే తెలుసు మీకు. వినండి” అని స్టోరీ మొదలుపెట్టింది అమ్మమ్మ.
***
అదొక పెద్ద అడవి. చాలా రకాల పూలమొక్కలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఎన్నో తేనెపట్టులే. పెద్దవి చిన్నవి. తేనెటీగలు వేల సంవత్సరాలుగా భూమి మీద ఉన్నాయిట. మనిషి తినగలిగే ఆహారం ఫుడ్ తయారు చెయ్యగలిగిన కీటకం తేనెటీగ మాత్రమే. వీటిలో రాణి తేనెటీగ, తేనెని వేదికి తెచ్చే లక్షల పనిటీగలు ఉంటాయి. ఇవికూడా మన పర్యావరణానికి మంచి స్నేహితులు. ఇవి కూడా పోలినేషన్కి హెల్ప్ చేస్తాయి. తేనెలో ఆరోగ్యానికి అవసరమైన అన్ని విటమిన్స్, ఎంజైమ్స్, మెదడుకి అవసరమైన శక్తి, వ్యాధినిరోధక శక్తి లాంటి మంచి గుణాలున్నాయి.
తేనెటీగకు 6 కాళ్ళు, 2 కళ్ళు, రెక్కలు.. తేనె నింపటానికి పొట్టకింద సంచి, వాసన పసిగట్టే శక్తి, అనేక వైపులా చూసి తేనెని పసిగట్టే కళ్ళు. ఉన్నాయి. ఎంత దూరం నుండైనా వందల రకాల పూలలో తేనెపట్టిన పూలను వాసనపట్టి తేగలదు. వీటి రెక్కలు బలమైన స్ట్రోక్స్‌తో గంటకు 6-15 మైళ్ళు ప్రయాణించగలవు. కేజీ తేనె కోసం తేనెటీగలు భూమిని 3సార్లు చుట్టివచ్చినంత దూరం తిరుగుతాయి.
తేనెటీగ కాలనీలో 20-60 వేల తేనెటీగలు ఒక రాణి తేనెటీగా వుంటాయి. రాణి తేనెటీగ 5 ఏళ్ళు బ్రతికితే ఇతర తేనెటీగలు కొద్దీ వారాలు, నెలలు బ్రతుకుతాయి. వీటిలో రెండు తీవ్ర జాతులున్నాయి. 1. ఆఫ్రికన్ బీ 2 బంబులే బీ.
అనేక వేల పూల మకరందమే తేనె. పురాతన కాలం నుండి తేనెని ఆరోగ్యం కోసం వాడేవారు. మంచి నిద్రకి వేడి పాలతో, వ్యాధినిరోధానికి,బరువుతగ్గటానికి, హెల్దీ స్కిన్ కోసం, కాలిన గాయాలకు, దెబ్బలకి ఎన్నింటికో వాడతారు. కానీ మనుషులు చేస్తున్న తప్పులకి పాపం హానీ బీ కి కష్టం వస్తోంది. అడవులు పెరగాలన్నా, ఫలదీకరణం, కొత్త మొక్కలు పెరగాలన్నా హానీ బీలు తీసుకువెళ్లే పూల పుప్పొడి వెదజల్లటం అవసరం.
కానీ మన అవసరాలకోసం అడవులు నరికి సైజ్ తగ్గించటం, వాటికి సరిపడినంత పూల పుప్పొడి దొరక్క, మనము వెదజల్లుతున్న క్రిమి సంహారక మందులు, పెస్టిసైడ్స్, పెరుగుతున్న వేడి, ఎండాకాలం, తగ్గుతున్న వానలు, గాలిలో పోల్యూషన్ లాంటి కష్టం వచ్చి తేనె తీసుకురావటం తగిపోతున్నది. అంతే కాదు తేనెటీగలు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నాయిట” అని ముగించింది అమ్మమ్మ.
పరి, ఆర్యన్ దిగులు ముఖాలతో “పాపం హానీ బీస్!” అన్నారు
“అమ్మమ్మా తేనెటీగలు, మనం హ్యాపీగా ఉండాలంటే ఏమి చెయ్యాలి?” అడిగారు.
ఒక్క నిముషం ఆలోచించిన అంబిక “మనం అందరం లోకల్ మొక్కలు నాటి అడవులు పెంచాలి. మన చుట్టుపక్కల కెమికల్స్ వాడటం తగ్గించాలి. పర్యావరణ అంటే ప్రేమగా ఉండాలి” అంది.
“అన్నా హానీ బీ ఎలా ఉంటుందో తెలుసా?” అని పరి అడిగితే ఏదో ఆలోచిస్తున్న ఆర్యన్ బదులివ్వలేదు.
అది చూసి అంబిక ‘ఈ మాత్రం ఆలోచన చాలు తేనెటీగలను కాపాడటానికి’ అనుకుంది.
డి. చాముండేశ్వరి రిటైర్డ్ సోషల్ స్టడీస్, తెలుగు ఉపాధ్యాయిని. దశాబ్దాల పాటు హైస్కూలు విద్యార్థులకు పాఠాలు బోధించారు. యాత్రలు, గార్డెనింగ్, కథారచనలో అభిరుచి. బహుముఖీన వ్యక్తిత్వం గల రచయిత్రి ఇటీవల బాలల కథలు వ్రాసి, వాటికి బొమ్మలు గీశారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఆచార్యదేవోభవ-17
నియో రిచ్-1
దివ్యాంగ్ నికేతన్
సంచిక – పదప్రహేళిక జూన్ 2024
కశ్మీర రాజతరంగిణి-72
అలనాటి అపురూపాలు- 179
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారికి రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారం
అలనాటి అపురూపాలు-96
డార్క్ లైట్
రుచి – The Temptation
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®