రైలుకథలు
దేశభక్తికథలు
తెలుగుకథల్లో గాంధీమహాత్ముడు
క్రీడాకథ
కులం కథ
రామకథాసుధ
సంచిక-సాహితీ ప్రచురణలు సంయుక్తంగా రూపొందించే కథల సంకలనం ఈ దీపావళికి తెలుగు సాహిత్య ప్రపంచానికి, తెలుగు కథాప్రేమికులకి అందుతుంది.
ఇంతవరకూ, విభిన్నమూ, విశిష్టమూ, అద్వితీయమైన కథా సంకలనాలను రూపొందించిన సంచిక-సాహితీ ప్రచురణలు ఈ దీపావళికి ‘భారతసైన్యం కథలు’, కథా సంకలనాన్ని రూపొందించాలని నిశ్చయించింది.
ఇంతవరకూ తెలుగు కథల్లో భారతీయ సైనికులు విలన్లు. దేశంపై సాయుధ పోరాటాన్ని జరిపేవారు వీరులు, అమరులు. మన సైనికుల అకృత్యాలు చూసి మేధావుల దేశభక్తి పాలు విరిగినట్టు విరిగిపోతుంది. ఇలాంటి కథలే ఉత్తమ కథలుగా, గొప్ప కథలుగా ప్రచారం జరిగింది. స్థిరపరచటం సంభవించింది.
అయితే, నిజం వేరు!!!
సైనికులు సరిహద్దువద్ద ప్రాణాలు పణంగా పెట్టి, రాత్రింబవళ్ళు కాపాడకపోతే, మేధావులు లేరు, స్వేచ్చ స్వతంత్రాలు లేవు. హక్కులు లేవు. రక్షణ లేదు.
దేశ రక్షణ కోసం, మనం ఇళ్ళల్లో హాయిగా, భద్రంగా వుండటం కోసం సర్వం త్యాగం చేసే సైనికుల కథల గొప్పతనం ప్రదర్శించే కాల్పనిక కథలకు ఆహ్వానం.
సైనిక కథలంటే, సైన్యంలోని అన్ని విభాగాలుగా అర్ధంచేసుకోవాలి. కథలు కొత్తగా రాసి పంపినా, గతంలో రాసినవయినా, గతంలో ప్రచురితమయినవైనా, మీకు తెలిసిన ఇతరుల రచనలనైనా పంపవచ్చు. నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా సృజించిన కథలు కావచ్చు. కాల్పనిక కథలయినా ఫరవాలేదు. భారత సైన్యం ఔన్నత్యం, త్యాగశీలత్వం, ఉత్తమత్వాలను ప్రదర్శించే కథలకు ప్రాధాన్యం!!!
సృజనాత్మక ప్రతిభకు, రచనా నైపుణ్యానికి తప్ప ఇతర ఏ ఆంశాలకూ ప్రాధాన్యం ఇవ్వకుండా రచనకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే అత్యుత్తమ స్థాయి కథల సంకలనంలో స్థానం సంపాదించుకునేందుకు ఉద్యుక్తులవండి..
ఉన్నత ప్రామాణికాల కథల సంకలనం తయారీలో మీ వంతు చేయూతను మీ రచన ద్వారా అందించండి.
కథను టైప్ చేసి పంపితే సంతోషం. చేతి రాతతో పంపేవారు కథను చివరి తేదీ వరకూ ఆగకుండా కాస్త ముందుగానే పంపటం వాంఛనీయం!
కథ నిడివి పరిమితి లేదు. అయితే కథ నవల స్థాయి చేరకపోతే మంచిది.
కొత్త కథలను సంచికలో ప్రచురిస్తాము. అయితే, సంకలనంలో ప్రచురణకి ఎంపిక మాత్రం సంపాదకులు నిర్ణయించిన ప్రామాణికాల పరిథిలో ఒదిగితే మాత్రమే!!!!!
కథలు పంపవలసిన చివరి తేదీ– 30/09/2024.
మెయిల్ ద్వారా కథలు పంపాల్సిన చిరునామా—– sanchikastorycompilation@gmail.com
వాట్సప్ ద్వారా అయితే—–9849617392
by post ( పోస్ట్ ద్వారా అయితే)
(గమనికః పోస్ట్ ద్వారా పంపేవారు విధిగా కథ కాపీ తమ దగ్గర వుంచుకోవాలి).
plot no 32, h.no 8-48
raghuram nagar colony. aditya hospital lane
dammaiguda, hyderabad-83
మంచి ప్రయత్నం. శీర్షిక విలువైనది. శుభాకాంక్షలు. ——–డా కె.ఎల్.వి.ప్రసాద్
The Real Person!
ఈ పుస్తకం ఒక అద్భుతం… చాలా సందర్భాలలో మనం మనకి కనిపిస్తూనే ఉంటాం . ఎవరికి వారే యమునా తీరే అని ఫేవలో అనుకుంటాం కానీ యమునా తీరం చేరితే మాత్రం అందరం ఒకటే ఎవరికి వాడు కాదు. భాషలు వేరైనా భావాలు ఒకటే మనుషులు వేరైనా ఉద్వేగాలు ఒకటే పుస్తకాన్ని చదువుతూనే అంతరంగంలో గురుదత్త నిజస్వరూపాన్ని మనం దర్శించగలం ఒక అత్యద్భుత పుస్తకాన్ని మాకు ఇచ్చిన జ్యోతి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో ఆశీస్సులతో….. భువనచంద్ర
అభినందనలు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మరుగునపడ్డ మాణిక్యాలు – 65: ఇజాజత్
గాలాపాగోస్ దీవుల్లో మా పర్యటన
లక్ష్యం
సద్గురువు వైశిష్ట్యం
సందిగ్ధత
నా కాశ్మీర్ యాత్రానుభవాలు
జ్ఞాపకాల పందిరి-93
మానవాళి శ్రేయస్సే లక్ష్యంగా శాస్త్రజ్ఞుల నిరంతర కృషి
విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-19
విశ్వనాథ వారి ‘కిన్నెరసాని పాటలు’-2
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®