సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    యామినీ దేవి

    ఒక్కో పాట వెనక చరిత్ర చెప్తుంటే చదవడానికి భలే ఉంది గురువర్య. పాట వ్రాయడానికి మీకున్న తపన అంకితభావం ఎవరికో మార్గదర్శనం. ఏ పాట కాపాటే అన్నట్టు.
    చివరి రెండు పాటలు నాకు చాలా బాగా గుర్తున్నాయి. మీరంటే నాకెంతో ఇష్టం పాట సరదాగా పాడుకునే వాళ్ళం. ముద్దుల్ కావలెనా మురిపాల్ కావలెనా పాట కూడా అంతే అదో సరదా.
    ఎన్నో జ్ఞాపకాలని ఒకే చోట పోగుచేసి మా కోసం ఇస్తున్నారు. ధన్యవాదాలు మీకు

    Reply
    1. 1.1

      Bhuvanachandra Raju

      హృదయపూర్వక ధన్యవాదాలు యామినీజీ థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫస్ట్ మీరే

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సిహెచ్ సుశీలమ్మ గారి స్పందన: *భువన్ జీ! ఇన్నిన్ని విశేషాలు మీకింకా గుర్తుండటం, మాకిలా పంచటం, ఆ పాత పాటల్ని, సినిమాలని జ్ఞప్తి కి తెచ్చుకుని ఆనందించడం మాకో వరంలా ఉంది.. నాటి తరం వారికి.
    సిట్యుయేషన్, ట్యూన్ వినిన గంటల్లోనే – ఒకోసారి నిముషాల్లోనే పల్లవి, తర్వాత చరణాలు వ్రాసేయడం మీ (ఒక్కరి) ప్రత్యేకత.
    “రాసి నిర్మాతలను, వినిపించి ప్రేక్షకులను నవ్వించటం” సంతోషపెట్టడం మీ మరో ప్రత్యేకత.
    ఈవారం మీ అమూల్యమైన ఒక స్పందన ఆలోచింపజేసింది, ఒకానొక “నోస్టాలజి” లో పడేసింది.
    నిర్మాత దర్శకులు, సంగీత దర్శకులు, ఆ సమయానికి అనుకోకుండా వచ్చిన (సుబ్బిరామిరెడ్డి గారు వంటి) అతిథులు మధ్య మీరు ట్యూన్ విని, వెంటనే రాసి వినిపించటం, వారందరూ సంతోషంతో కామెంట్స్, నవ్వులు, సందడి, పండుగ వాతావరణం.. ఈనాడు లేదని మీరు చెప్పారు. సినీ ప్రపంచంలోనే కాదు, సమాజం మొత్తం “అరచేతిలో ఇమిడిపోయే” పరికరమే ప్రపంచమై పోయింది. పాత కాలంలో పాల వారు, కూరగాయల గంపలతో వచ్చేవారు, బేరసారాలు, కష్టనష్టాలు, కబుర్లు, మానవ సంబంధాలు ఉన్న కాలం అది.
    ఇప్పుడు మాల్స్. మనం మౌనంగా మనకు కావలసిన వస్తువులు తీసుకుంటాం, ట్రైనింగ్ పొందిన సిబ్బంది రోబోల్లా కంప్యూటర్ పై బిల్ ఇస్తారు. మనం కార్డ్ తో చెల్లిస్తాం.
    అంతా మౌనం. అంతా బిజీ. మనుషులం కాక మరబొమ్మల్లా మారుతున్న ఈ కాలంలో మృగ్యమై పోయిన “మానవ సంబంధాలు” వెదకడం అనవసరం.
    మీరు పాటలు, పాటల నేపథ్యంతో పాటు సామాజిక కోణాలనూ స్పృశించడం వల్ల ఈ రచన కేవలం “సరదా” కాదు, జీవితాల చిత్రణ.
    హేట్సాఫ్ టు యూ.*

    Reply
    1. 2.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది భువనచంద్ర గారి స్పందన: *హృదయపూర్వక ధన్యవాదాలు సుశీల గారు. మీరు ఏ స్పందన పంపినా, దానికి చక్కగా పూర్వపరాలు రాసి పంపుతారు. నాటి పరిస్థితులను నేటి పరిస్థితులను చక్కగా బేరీజు చేసి విశ్లేషిస్తారు. అందుకే మీ అభిప్రాయాన్ని అందుకోవటం నాకు ఒక అద్భుతమైన స్ఫూర్తి, ఒక విధంగా వరం. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కృతజ్ఞతలు.*

      Reply
  3. 3

    ramasundarimsbpnv

    ఈ పాట రాజేంద్ర ప్రసాద్ పాడడం కూడా బాగుంది. అప్పట్లో హీరోగా చేసినపుడు మనిషి, వ్యక్తిత్వం కాస్త బాగానే అనిపించేవి…కొన్ని సార్లు ఎక్స్ట్రా అనిపించినా. (స్టేజ్ మీద ఇప్పుడైతే మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన వైఖరి…ఏం మాట్లాడుతున్నాడో తెలియదు.)

    డిస్కార్డ్ చేసిన ట్యూన్ అనుకోనవసరం లేదని క్రియేటివ్ మైండ్స్ కే తెలుస్తుంది. ఏదైనా రాయగలిగిన సత్తా, ఛాలెంజ్ తీసుకోగలిగిన నైజం ఉండే మీలాంటివాళ్లకి ఏ సిట్యూయేషన్ ఇచ్చినా అద్భుతంగా రాస్తారు. ఇదేలే తరతరాల చరితం…రా రా సరసకు రా రా … ఎంత హిట్ సాంగ్స్..కదా. మీరు రాసిన పాటలన్నింటికీ ముందు ఎంత ఆలోచించి ఉంటారో కదా. ఆ సందర్భాలన్నీ వినడం ఎంతో ఆసక్తిగా ఉంది. బాపినీడు గారు మీమీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం…కొత్త కొత్త డైరెక్టర్స్ తో పని చేస్తూ మాయానగరంలో మీ స్థానాన్ని పదిలపరుచుకోవడం చాలా పెద్ద ఛాలెంజ్. మీలో ఉన్న సైనికుడికి కొత్త కొత్త పరిస్థితుల్ని తట్టుకుంటూ సమస్యల్ని ఎలా పరిష్కరించాలో తెలుసు. ఆ బేస్ మీకు ముందు పడి ఆ తర్వాత ఈ వాతావరణంలోకి రావడం కూడా చాలా మంచే జరిగింది. ముందు ముందు ఇంకెన్నో ఆసక్తికర సందర్భాలు రాయబోతున్నారని తెలుసు. ఎదురుచూస్తున్నాను.
    చండి. (రమాసుందరి)

    Reply
    1. 3.1

      Bhuvanachandra Raju

      థాంక్యూ చండీ థాంక్యూ వెరీ వెరీ మచ్ ప్రతిభాగం మీ స్పందన నాకు ఎంతో స్ఫూర్తిని ఆనందాన్ని నాకు కలిగిస్తూ ఉంది… థాంక్యూ వెరీ వెరీ నైస్

      Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *చాలా మంచి పని చేశారు సార్. మీ అనుభవాలు అనుభూతులను పంచుకునే అవకాశం వచ్చింది. చదువుతున్నంతసేపూ. మీతో పాటు నా మనసు కూడా ఆరోజు ల్లోకి వెళ్ళి ఆ ఆనందం మీ మాటల్లో స్పష్టంగా కనిపించింది. అభినందనలు అండి. చాలా సంతోషం అనిపించింది నాకు ఈ ప్రయాణం.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొఫెసర్ నరసయ్య గారి స్పందన: *మీరు సరస్వతి పుత్రులు.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మంగళ కందూర్ గారి స్పందన: *నమస్తే. ఈ వారం విశేషాలు కూడ ఎప్పటి లాగానే గబ గబ చదివే లాగ వున్నాయి. ఇవేళే చదివేశాను. ఆదివారం అయినా ఏ టివి కార్యక్రమాలు మీ రచన ముందు నిలువ లేదు. అందుకే టివి కట్టేసి హాయిగా మీ రచన చదివి ఆనందం పొందాను. ధన్యవాదాలు.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ ఎం.ఎల్. నరసింహం గారి స్పందన: *కొన్ని ట్యూన్స్ బాగుంటాయి కానీ అవి విన్నప్పుడు బాగున్నంతగా అవి లిరిక్స్ ని తొడుక్కోలేవు. గొప్ప పద ప్రయోగం సార్. మాకు యోగం వుంది కాబట్టే యింత మంచి అనుభవాలు చదవగలుగుతున్నాం.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రణవానంద్ గారి స్పందన: సూపర్ గురువు గారూ 👌💐🙏💐👌 *

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి పల్నాటి గారి స్పందన: *శ్రీభువనచంద్ర గారికి నమస్సులు. 40 సంవత్సరాల మీ సినీ జీవితంలో జరిగిన ప్రతి సంగతి ఎంతో సజీవంగా అందిస్తున్నారు అండీ. చదువుతుంటే ఆ కాలంలోకి నేను సైతం ప్రయాణం చేస్తూ ఆనందిస్తునాను. ఎన్నో వేల పాటలు వ్రాసినా ప్రతి పాట వెనుక వున్న సిట్యుయేషన్, చుట్టూ వున్న పరిస్థితి, మనుషులు, సందడి కళ్ళకు కట్టినట్లు వ్రాస్తున్నారు. ట్యూనింగ్ -పల్లవి -చరణం అంటే బొత్తిగా తెలియని నా లాంటి వాళ్ళకు కూడా ఓ పాట తెర మీదకు రావాలంటే వెనకాల ఎంత శ్రమ ఉంటుందో ఎన్ని దశలు ఎంత నెట్‌వర్క్ ఉంటుందో అర్థం అవుతోంది. ప్రతి పాటకు మీరు పడిన శ్రమ మీదీక్షకు శత కోటి వందనాలు తెలుపుతూ -రోహిణి 🙏🌹

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుజాత గారి స్పందన: *ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలు గుర్తు చేసుకుని ఒకొక్క పూసని దండలా గుచ్చినట్టు వివరించి రాస్తున్నావు బాబాయ్, చాలా బాగుంది.*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. మాధురి ఇంగువ దారి స్పందన: *మొన్ననే మా మిత్రమండలి సభ్యులతో “విద్యా సాగర్ గారికి తెలుగులో రావలసినంత గుర్తింపు అవకాశాలు రాలేదు” అని తెలుగుశ్రోతలను ఘాటుగానే తిట్టుకున్నా sir..
    ఈ వారం ఎపిసోడ్ కూడా చాలా ఎనర్జిటిక్ గా ఉంది 😀🙏. *

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉమా భారతి గారి స్పందన: *నమస్తే భువనచంద్ర గారు, ఎలా ఉన్నారు? 12 వ భాగం చదివాను.. ఇప్పుడా రోజులేవీ. gmail, whatsapp, money transfers అన్నీ easy. టైమ్ సేవింగ్. అప్పట్లో అలా ఉంటే ఇంకా వందరెట్లు productive గా సాగిపోయేదేమో.. అన్ని వృత్తులలో.. మీ ఫోటోలు, పాటలు.. ఈమధ్య విని ఎంజాయ్ చేసినవే.. అద్భుతంగా కొన్నైతే.. థాంక్స్ ఆండీ షేర్ చేస్తున్నందుకు.. 🙏 *

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®