సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్కారం అండి. ఈ సంచికలో మీరు రాసిన కొన్ని విషయాలు చదువుతూ ఉంటే చిత్రసీమ ఓ సమిష్టి కుటుంబంగా ఉంటుంది అనిపించింది. మీరన్నట్టు అప్పట్లో చాలామంది మనుషుల మనసులు ఆప్యాయంగా మర్యాద మన్ననలు గౌరవంతో కూడి ఉండేవి. మనసుకు తృప్తికరమైన వాతావరణం ☔️ లభించే సమయం ఆ రోజుల్లో చాలా వరకు.
    చాలా బాగుంది మీ అనుభవాలు పంచుకోవటంలో ఓ తృప్తికరమైన సమయం అనిపించింది.
    చాలా ఆనందం అనిపించింది మీకు నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అండి.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డైరెక్టర్ శివ నాగేశ్వరరావు గారి స్పందన: *చాలా మంచి విషయాలు..మంచి మెమరీ మీది 🌺🌹❤️ *

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మోహన్ గోటేటి గారి స్పందన: *సీతారత్నం గారి అబ్బాయి సినిమా ఔట్ డోర్ షూటింగ్ కవరేజీ కోసం మద్రాసు నుంచి మమ్మల్ని నిడదవోలు తీసుకువెళ్లారు. అప్పుడు సినిమాలోని పాటల్ని ఈవీవీ గారు మాకు వినిపించారు. మీ మేఘమా మరువకే పాట విని అందరం క్లాప్స్ కొట్టాం. సూపర్ హిట్ సాంగ్. ఇందులో అప్పటి బాలీవుడ్ ట్రెండ్ అయిన ఝాంకార్ బీట్స్ వాడారు కోటి. మీకు బాగా పేరు తెచ్చిన మంచి మెలోడీ సాంగ్. ఈ ఎపిసోడ్ చదివాక ఆ రోజులు గుర్తొచ్చాయి. అభినందనలు భువన్ జీ..*

    Reply
  4. 4

    ramasundarimsbpnv

    ఏకంగా 25 పల్లవులు రాయడమా…ఒకటి నచ్చకపోతే మరొకటి రాస్తానని చెప్పి మీరు మంచి పని చేశారు. రాఘవేంద్రరావు గారు మీ పాటలన్నీ చాలా పాప్యులర్. సినిమా ఎంతో మంది ప్రతిభని ఉపయోగించుకుని ప్రజల వినోదం కోసం విడుదల చేసే విజువల్ మీడియం. సైనికుడిగా మీరు ఎడారుల్లో ఒంటరిగా గడిపిన సందర్భాలు మీకు మీతో గడిపే సమయాన్నిచ్చాయి. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికీ, కలుసుకోవడానికీ దోహద పడ్డాయి. ఆ ఆధ్యాత్మిక ప్రజ్ఞ పండిన మనసు ఎంతలా తపించిందో గానీ, మళ్ళీ మీకు డాక్టర్ గోపాలకృష్ణ గారు, జలంధర గారు, శైలజ గారు వంటి సాధుమూర్తుల సాంగత్యంతో సినిమా రంగంలోనూ శిఖరస్థాయికి చేరుకున్నారు. మీ పదమే మిమ్మల్ని శిఖరాయమానంగా నిలిపింది. అతీత స్థాయిలో ఉండే మీ మనసు లౌకికంగా ఏ స్థాయిలనైనా అర్థం చేసుకోగలదు. ప్రజలకి అర్థమయ్యేలా చేయగలదు. మీకీ స్థాయి తెప్పించేందుకు సినిమాల్లో రకరకాల సిట్యుయేషన్స్ ఛాలెంజెస్ గా వచ్చాయి. మీకున్న స్పిరిట్ తో ఆ విధంగా పాప్యులర్ అయ్యారు.
    సాహితి గారి గురించి మీరెంత బాగా చెప్పారు. నిష్కల్మషంగా ఉండే మీ మనసు సహజ ప్రజ్ఞ ఉన్న వారందరినీ ప్రశంసిస్తుంది. మనిషిలో ఉండే ప్రజ్ఞాపాటవాలు చటుక్కున పట్టేస్తారు. మనసులో గుర్తుంచుకుంటారు. సమయం వచ్చినపుడు ఇలా మా అందరికీ చెప్తుంటారు.
    మీ నుంచి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకుంటాం.
    చండి (రమాసుందరి)

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®