సంచికలో తాజాగా

Related Articles

21 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వివేకానంద రెడ్డి గారి స్పందన: *దర్శకు’రాళ్ళు’ గా విజయం సాధించినవారు భానుమతి, విజయనిర్మల గారలు మాత్రమే కాగా సావిత్రిగారిది పూర్తి అపజయమే. తరువాతి కాలంలో జయ, నందినీరెడ్డి గార్లు ప్రతిభావంతులే అయినా, వారికి తగ్గ స్థాయిలో నిలదొక్కుకోలేక పోయారు.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బ్నిం గారి స్పందన: *అద్భుతం పరుగే.. పరుగు.. విజయాలపై పడ్డ ప్రతి అడుగు.. పరుగో పరుగు. అదృష్టం మీదే కాదు.. సినిమా రంగానిదీను.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాసుందరి గారి స్పందన:* సినీ జీవన ప్రస్థానంలో క్రియేటివిటీ ఎంత వేగంగా పనిచేస్తే అంత వేళ్లూనుకుంటామన్న సత్యం మీకు బోధపడింది. నిజమే, పని చేస్తూనే ఉండాలి. చేసే పని బాగా చేయాలనే అంకితభావం ఉండాలి. త్వరగా పూర్తిచేయాలనే కొంచెం టెన్షన్ తోనూ పనిచేయాలి. పని చేసే సూత్రం అదే. లెజండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు, మహా గాయనీమణులు లతా మంగేష్కర్, సుశీల, జానకి వంటి వారితో కలిసి పనిచేసే సౌభాగ్యం ఎంత మందికి వస్తుంది మీ వంటి అంకితభావం ఉన్నవారికి తప్ప! శ్రీ బాపినీడు గారి సలహా ఎంత చక్కనిది! దాన్ని మీరు ఇప్పటికీ పాటిస్తున్నారంటే, ఆణిముత్యాల్ని మూటగట్టుకునే వైఖరి మీలో ఉండడమే కదా! బాలు గారు కూడా ఎప్పుడు ఏ పాట పాడినా అదే తన తొలిపాట అన్నట్టు పాడేవాడినని చెప్పారు. పనిలో ఈ సిన్సియారిటీ, చక్కదనం ఉంటేనే ఆ వ్యక్తులకీ అంత గౌరవం అందుతుంది. సినిమాలలో అవకాశాలు వస్తాయనే భరోసాతో బాటు ఇప్పుడు వేరే చోట్ల అవకాశాలు కూడా రావడం, వాటిని అందిపుచ్చుకుని మీరు మరింత ప్రభంజనం సృష్టించే ప్రయత్నంలో ఉండడం..ఇదంతా చదువుతుంటే సినిమా అనేది డైరెక్టర్, అసిస్టెంట్స్, రైటర్స్, ఇలా ఎంతమంది మనసుల్లోంచి ఎంత అందంగా జాలువారుతుందా అనిపిస్తోంది. వాసూరావు గారితో బాలు గారు చాలా మ్యూజికల్ నైట్స్ చేస్తుండేవారట. ‘క్రియేటివ్ జీనియస్ ల కలయికే సినిమా.’ థాంక్యూ ఫర్ ది మెస్మరైజింగ్ ఎపిసోడ్! – చండి (రమాసుందరి)*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమా శాండిల్య గారి స్పందన: *మీ కలిదిండి జయమ్మ కబుర్లు, సుశీలమ్మతో మొదటి పాట పూర్తవగానే ఆమెతో ప్రయాణం… బాలుగారు, సుశీలగారు పాటపాడితే మీ ఆనందం, విజయబాపినీడు గారి వలన మీరు షార్ప్ గా పాటరాయటం – అన్నీ కబుర్లూ సూపరో సూపర్!❤️ మరిచాను పులగం కూడా బావుందండోయ్.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి శైలజ గారి స్పందన: *This is like your biography. మండే వేసవి ఎండల్లో చల్లని కుండలో ఉన్న స్వచ్చమైన నీరు, ఇంకా లేలేత కోనసీమ కొబ్బరి తింటున్నట్లుగా ఉంది. పేరుకి మిలట్రీ వాడు కానీ పసితనపు అమాయకత- పని అంటే చచ్చే సిన్సియారిటీ. ఎ వెరీ రేర్ కాంబినేషన్. మొత్తానికి మనసును ఆకట్టుకునేలాగా ప్రతి లైన్ వ్రాయడం మీకే చెల్లింది కవిగారు. మమ్మల్ని మళ్ళీ ఆ క్షణాల్లోకి తీసుకెళ్తున్నదుకు మనసారా ధన్యవాదాలు!! ఆల్ ద బెస్ట్.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్కారం అండి. మీరు వ్రాసిన జీవితం ఓ ప్రయాణం – వారం వారం ఎదురు చూస్తూ చదవటం జరిగింది. మీ అనుభవంలో ఓ చిత్రంగా అనిపించింది. కలలు కనడం చాలా మందికి అలవాటు కానీ మీరు కన్న కలలని సాకారం చేసుకోవడం కోసం మీ కృషిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి. మీలోని నైపుణ్యం నిబద్ధతతో ముందుకు సాగటం. సినిమా కుటుంబానికి చెందిన నేను ముందుకు సాగే
    ప్రతి అడుగు తేలిక గాను, మీ క్రమశిక్షణ పట్టుదల మరియు అంకితభావం కృషి నిబద్ధత కలిసి మీలో దైవత్వం తోడుగా ఉంది. కాబట్టి ఈరోజు ఇంత మంచి గొప్ప రచనలు చేయడం ద్వారా అందరి దృష్టిని మనసుల్ని గెలుచుకున్నారు. *

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సిహెచ్ సుశీలమ్మ గారి స్పందన: *భువన్ జీ, మీ రెండో సినిమా, మీరు రాసిన పాటను మొదటిసారి పాడిన పి. సుశీల గారి ఆహ్వానం పై ఆమె కారులో ఆమెతో ప్రయాణించిన మీరెంత అదృష్టవంతులు, మీ కలం పదును ఎంత బలం! మొదటిసారి విజయ బాపినీడు గారిని అవకాశం మీరు అడిగారు.‌ కానీ ఆ తర్వాత మీరు ఎవరినీ అడగక పోవడానికి కారణం ఆ ‘వీణా వరదండ మండితకరా’ అంశ మీ ‘కర మధ్య’మున ఉండడమే అనిపిస్తోంది.

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నరేంద్ర చంద్ర గారి స్పందన: *చాలా interesting గా ఉంది బాబాయి.. మొత్తం చదివాను 👏👏👏👏 *

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. చంద్రశేఖర ఆజాద్ గారి స్పందన: *భువన చంద్ర అన్నగారి జీవితం ఓ ప్రయాణం నాలుగో భాగం చదివాను.. నిన్నటి విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి.. అవి ఇంతకుముందు చెప్పనివి.. ఇలాంటి ఆత్మ కథనాల వల్ల అందరికీ తెలుస్తాయి.. ప్రయాణం అంటే అది నల్లేరు మీద నడక కాదు – ఎవరి జీవితంలోనయినా.. తొలి రోజుల్లో సంఘర్షణ శిల నుండి శిల్పంగా మారుస్తుంది.. పాట అంటే మాటలు కాదు.. ఓ కోణంలో ఈ మాట అంటున్నాను.. అన్నగారి ప్రయాణం ఇంకొన్ని భాగాలు అయ్యాక పాటల గురించి కవిత్వం గురించి రెండు మాటలు నేనూ చెబుతాను.. – చంద్రశేఖర అజాద్.పి.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆల్ ఇండియా రేడియో గౌరీ గారి స్పందన: *చదివేశాను ట్రైన్లో వెళుతూ. 💃🏻💃🏻💃🏻 All India Radio లో మీరు వినిపంచిన కవితలు కథలు గురించి కూడా ప్రస్థావించండి సార్. Of course ఇప్పుడిప్పుడే కదా మీ ప్రయాణం మొదలైంది. *

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎమ్మెల్ నరసింహం గారి స్పందన: *ఇలా వారం వారం కాకుండా ఒకేసారి చదివితే బాగుంటుందనిపిస్తోంది సార్. మీ అంతటిప్రజ్ఙాశాలితో పోలిక కాదుగానీ, “మంచో చెడో గానీ, నాకో అలవాటుంది. ఏ పనీ లేనప్పుడు కలలు గంటూ కలలోనే గడిపేస్తా. పని వస్తే మాత్రం వెంటనే పని మొదలెడతా. ఒక్క క్షణం కూడా వేస్టు చెయ్యను. మరో చిత్రం ఏమంటే, అనుకున్న పని పూర్తయ్యేదాక మరి దేని మీదా ధ్యాస వుండదు. పని అయ్యేదాకా మనసులోని టెన్షనూ తగ్గదు.”
    “ఆ తరువాత ఆయనే అన్నారు “పత్రిక పని చూడాలంటే మాములుగా కుదరదండీ. లాస్ట్ మినిట్లో పిచ్చ టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్ వస్తేనే గబగబా పని పూర్తి అవుతుంది.” అని. సో, టెన్షన్లో పని చేయడం అలా ఆయన దగ్గరే నాకు అలవాటైంది.” ఈ వాక్యాలు ☝️నాకూ పూర్తిగా వర్తిస్తాయి.”
    డాక్టర్ ఆలూరి విజయలక్ష్మిగారు మా వనిత పత్రికకి ఫీచర్ రాశేవారు. ఆమె మద్రాసు (అప్పటికింకా చెన్నై కాలేదు) వచ్చారు. మైలాపూరు నుండి ఆవిడని చందమామ బిల్డింగ్సుకి కారులో తీసుకు వస్తూ ట్రాఫిక్ లో చిక్కుకు పోయాము. పత్రిక చివరి ఫారమ్ ప్రెస్ కి పంపాలి. ఆవిడేదో మాట్లాడుతున్నారు కానీ నామైండ్ అక్కడలేదు. “ఏవిటీ టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ ఆరోగ్యానికి మంచిదికాదు” అన్నారు డాక్టరుగా. నేనన్నాను: “పత్రికలో టెన్షన్ తప్పదండి. నాకు అలా అలవాటైపోయింది.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారి స్పందన:* ఇవ్వాళ తీరుబడిగా జీవితం ఒక ప్రయాణం తీరుబడీగా చదివాను. ఒక్కసారిగా మనందరి చెట్టుకింద జీవితం గిర్రున తిరిగినట్లు అనిపించింది. ఎంత అదృష్టవంతులం మనం?! ఎంత స్నేహం, ప్రేమ, అభిమానము, వాత్సల్యం కలబోసిన వాతావరణంలో, డాక్టర్ గోపాల కృష్ణ గారి సాన్నిధ్యములో గడిపాము.?! ఎంత బాగా రాస్తున్నారు అన్న మాట మీకు కాంప్లిమెంట్ కాదు. ఆశీర్వచనం 🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ గోటేటి మోహన్ గారి స్పందన: *మీ జీవిత ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతోంది మాస్టారూ.. అవన్నీ చదువుతుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. పాండీబజారులోని మన మేన్షన్ లో మన పరిచయాలు కూడా కళ్లముందు కదలాడుతున్నాయి. మీరు అలా.. గలగలా.. మాట్లాడుతుంటే.. మేమంతా.. చెవులప్పగించి.. వింటూ వుండేవాళ్ళం. విజయబాపినీడు గారు ఎంతో సౌమ్యులు. వడపళని, ధనలక్ష్మి కాలనీలోని వారింటిలో నేను కూడా కలిసేవాడిని. ఇక కలిదిండి జయ గురించి రాశారు. జయ-రాజు మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్ .. వారిద్దరూ గొప్ప స్నేహితులు.. మొత్తానికి మీ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగుతోంది.. అభినందనలు మాస్టారూ.*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది SP వసంత లక్ష్మి గారి స్పందన:*నమస్తే! కులాసా అని తలుస్తాను. సంచిక లో మీ సినీ ప్రయాణం యెంతబాగా enjoy చేస్తున్నామో! జలంధర గారు పంపితే చదివాను.*

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సినీ డైరెక్టర్ ఎన్ శివ నాగేశ్వరరావు గారి స్పందన: *చాలా బాగా కళ్ళకు
    కట్టారు. బాపినీడు గారికి వ్యసనం నచ్చిన మనిషికి సాయం చేయడం.. మధుసూదనరావు గారిని మెప్పించారంటే ఇక తిరుగులేనట్టే.*

    1. 15.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది భువనచంద్ర గారి స్పందన:*భయ్యా గుండె నిండా ధన్యవాదాలు మీ స్పందనకి ఎంతో శక్తి వచ్చింది నాకు. చాలా చాలా చాలా చాలా చాలా ధన్యవాదాలు నమస్సులు.*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ ఎంఎల్ నరసింహం గారి వ్యాఖ్య:* అన్నట్లు మీరు కలిదిండి జయ గురించి మీ రచనలో ప్రస్తావించారు. జయ రాసిన తొలి కథ ఆంధ్రజ్యోతిలో ఐనా మొదటి బహుమతి మొదట యిచ్చింది మాత్రం నేను ఉపసంపాదకుడిగా పనిచేసిన వనిత పత్రికే. 10వతరగతి విద్యార్ధులకి పెట్టిన కథలపోటీలో జయకి ఆ బహుమతి యిచ్చాము. ఆప్పటికి మాకామె ఎవరో తెలియదు. వడపళనిలోనే వుంటున్నా అందరిలానే పోస్టులో పోటీకి కథ పంపింది. బహుమతి ఎంపిక తర్వాత ఆఫీసుకి పిలిచినప్పటి పరిచయం కడదాకా కొనసాగింది. ఎంత ఎదిగినా మాపట్ల (me and B. K. Easwar) ఆ తొలినాళ్ల గౌరవమే.

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పల్నాటి రోహిణి గారి స్పందన: *శ్రీ భువనచంద్ర గారికి నమస్కారములు మీ ‘జీవితం ఓ ప్రయాణం’ చాలా ఆసక్తి దాయకముగా మనోరంజకముగా ఉంది అండీ. ఎంతోమంది మనుభావులగురించి చదవడం మా అదృష్టం అండీ. విజయంగార్డెన్స్ లో మీరు నడుస్తూ పులకరించి పోతూ మీరు వ్రాసిన మాటలు “ఎంతోమంది మహానుభావులు తిరిగిన చోటు, వారి పాదముద్రలతో భూమి పులకరించిన చోటు “. నిజంగా విలువలు అంటే ఇవే కదా 🙏.ఇంత ఎత్తుకు ఎదిగి పేరు సంపాదించాక తొలిరోజులలో పడ్డ కష్టాలు తిన్న కిచిడి, గుర్తుచేసుకొని నలుగురికి చెప్పటం ఎవరూ చేయనిపని.”పని వున్నపుడు పనితో పని,అయిపోయాక కలలు కనడం “బంగారం పండించే అలవాటు పొల్యూషన్ లేకుండా. మీలా ఇప్పటి యువత ఉంటే బంగారు భారతదేశం అయిపోతుంది. మీ ఓపెన్మైండ్ కు హ్యాట్సాఫ్ అండీ. ఇప్పటి యువతకు తెలియని ఎన్నో విలువలతో మీ ప్రయాణం బాగుంది అండీ ధన్యవాదములు 🙏-రోహిణి.*

  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి ఉమా భారతి గారి స్పందన: *నమస్తే భువనచంద్ర గారు, నేను కూడా మగవాడిగా పుట్టుండుంటే, ఎంతో ఫ్రీడం ఉండేది కదా అనుకుంటా.. నేను కూడా అప్పట్లో వెళ్ళి.. అలా అందరినీ కలిసి పట్టుదలతో నా కళని, కలని సాధించుగలిగేదాన్ని. ఆ context లో jealousyగా ఫీల్ అయ్యాను అన్నాను. పోతే, ఈసారి సెగ్మెంట్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది.. మీ తపన, అంకితభావం, మీ ప్రతిభే మీకు రెక్కలనిస్తుంది అన్న నమ్మకం.. వంటివన్నీ ఎవరికి ఉంటాయి చెప్పండి.. నేను కూడా ఒకింత మీలా ఆలోచిస్తానేమో అనిపిస్తుంది. ధారావాహికలో ఇక ఇప్పటినుంది మీ career takes off అన్నమాట. 🙏 *

  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వాడవల్లి శ్రీధర్ గారి స్పందన:*నమస్కారం. వెన్నంటి ప్రోత్సహించి విజయాన్ని బాపినీడలా మీతో ఉన్న వ్యక్తి విజయ బాపినీడుగారు. ఇద్దరమ్మల పేరు కలిసి భువన చంద్ర గా మారి సినీ వినీలాకాశంలో ఎన్నో గీత మయూఖాలను ప్రసరింపజేసింది. జాలాది జొన్నవిత్తుల తెన్నెటి హేమలత జలంధర గారు మిమ్మల్ని ఆదరించి ప్రోత్సహించిన తీరు పరిస్థిలకు అనుకూలంగా మిమ్మల్ని మీరు మలచుకొన్న విధానం అనువాదగీతాలు మీకు మీరు వ్రాసుకోవడం వల్ల ట్యూన్‍కి రాయడం, త్వరగా వ్రాయటం మిమ్మలిని ఓ ప్రత్యేక స్థానంలో నిలబెట్టినాయి. రిటైర్‌మెంట్ బెనిఫిట్ తాకకుండా తెచ్చిన 15 వేలు ఖర్చు పెట్టిన తీరు మీ నుంచి ఆప్పులు తీసుకున్న వైనం జీవిత ఆర్థిక పాఠం ఏక బికిన చదివాను మూడూ భాగాలు. మీ విషయాలు ఎన్నో ఇంటర్వూల ద్వారా విన్నా ఈ సంచికలో చదవటం ఓ కొత్త అనుభూతి.
    వినమ్ర నమస్సులతో..
    జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగని.. గుండెలో ప్రేమ గీతం నిండుగా మ్రోగనీ దారిలో మమతలే పువ్వులై కురియనీ తారలన్నీ తళుకాడువేళ ఎన్నెన్నో కళలు.. కదలాడవా.. గుండెలో గీమై నిండుగా మ్రోగవా మనసైన వాని కనుచూపులో.. సరికొత్త అందం చిగురించితే.. ఓ గర్వ రేఖ కనుగీటితే.. ఆ రేఖ భువనచంద్ర లేఖిని నుంచి జాలువారిన గీతం.*

  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విశ్వర్షి వాసిలి వసంత కుమార్ గారి స్పందన: *ఆ చెట్టూ.. ఆ మందుల సూట్ కేసూ.. ఆ తెల్లటి జులపాల గోపాలకృష్ణా.. తీక్షణంగా చూసే ఆ చూపు.. మందస్మితానికి మారుపేరు.. ఆ గోపాలకృష్ణుడికి నేను వసంతకుమార్ ని కాను ఎప్పుడూ విజయకుమార్ నే.. అలాగే పిలిచేవారు.
    కలిసి ఎన్ని వందల టీ లు తాగామో.. హమీదియాలో కానీ, చుట్టుపక్కలనున్న టీ బంకుల్లో కానీ..
    భువనచంద్ర గారూ, అద్భుతమైన ఫోటోని జ్ఞాపకంగా ఇచ్చారు.. ఈ ఒక్క జ్ఞాపకంతో కొన్ని వందల జ్ఞాపకాలు ముసురుకున్నాయి..

Leave a Reply

All rights reserved - Sanchika®