సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    ramasundarimsbpnv

    ఈ స్థాయిలో ఇవేళ ఉన్నా గానీ తొలి రోజుల్లో రైటర్ గా నిలదొక్కుకోవడానికి ఎంత శ్రమ పడ్డారో తెలుసుకుని మనసుకి బాధ కలిగింది. వెనకా ముందూ ఆలోచించకుండా ప్రథమ కోపం చూపి ప్యాడ్ విసిరేస్తే అది మనసుకి గాయమే కదా! కానీ విన్న తర్వాత ఆయనకి అర్థమైంది… బెటర్ మెంట్ కోసం ట్రై చేస్తున్నారని!
    బిందువులు… సింధువు… ఉపమానం బాగుంది.
    మీ మనసులో సన్యాసి కొలువు తీరబట్టే ‘నేతి’ దృష్టి అలవడింది. జరిగేదంతా జగన్నాటకంలా చూడడం అలవాటైంది. మానావమానాలకి అతీతంగా పని చేయడమూ జరిగింది.
    SP బాలు నిజంగా వరపుత్రులు. సినిమాకి అందరూ తమ తమ వంతుగా అందించాల్సిన 100 శాతం అందిస్తేనే సినిమా అద్భుతమవుతుంది. మీరన్నట్టు ఆయన స్వరశిల్పియే.
    ఆశ్రమంలో మనకి రుక్మణమ్మ గారు ఉండేవారు కదా..చక్కటి గొంతు. వాళ్ల నాన్నగారి దగ్గర త్యాగరాజ కృతులు నేర్చుకుని ఆశ్రమంలో దేవీ నవరాత్రులప్పుడు పాడేవారు. ఆమె ఇంటికి పక్కిల్లే ఎస్ పీ బీ ది ట. మణీ, మణీ అని పిల్చేవాళ్లం చిన్నప్పుడు అని చెప్తుండేది తను.
    కొన్ని పదాలు తప్పుగా ఉన్నాయి. ‘ఏకామ్రేశ్వర’ అని పడింది. అది ‘ఏకాంబరేశ్వర’ అని అనిపిస్తోంది. ‘విజయ డీలక్స్’ లో ‘డి’ అని పడింది. ‘జీవితం కూడా క్షణాల మాటే’ లో ‘మూటే’ అని ఉంటారని అనిపిస్తోంది.
    రమోలా అంటే శ్రీశ్రీ గారి మరదలు కదా! ఆమె గొంతు చాలా స్పెషల్.
    డాక్టర్ గారు మీకిచ్చే సలహాలన్నీ పాఠకులకందరికీ పనిచేసేవే. చాలా విలువైన మాటలు. తామరాకు మీద నీటి బిందువులా ఉన్నారు ఆయన. చాలా ఆసక్తిదాయకంగా సాగుతోంది మీ ప్రయాణం.
    చండి (రమాసుందరి)

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బలభద్రపాత్రుని రమణి గారి స్పందన: *అద్భుతంగా వుంది ఈ భాగం కూడా.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పల్నాటి రోహిణి గారి స్పందన: *5వ సంచిక చదివాను అండీ. సజీవమైన పాత్రలతో నడిచే మీ ప్రయాణమ్ అద్భుతం అండీ. ఫైల్ బయటకు విసిరినా చిన్నబుచ్చు కోకుండాకిందకు దిగి దాన్ని తీసుకొని కారు ఎక్కి పట్టు వదలకుండా డైరెక్టర్ కి పాడివినిపించి చరణం మార్పించారు అంటే మీ సాహిత్యం మీద మీకున్న నమ్మకం హట్సాఫ్ అండీ 🙏. ఆత్రేయ గారి మంచి హృదయం గురించి వ్రాసిన మీ మంచి హృదయానికి 🙏. గోపాలకృష్ణయ్య గారి లాంటి మహనీయుల గురించి వినే అవకాశం కల్పించే మీకు 🙏ఎన్నో విలువలు ఉదాత్తమైన విలువలతో సాగే మీ జీవిత ప్రయాణం ఆసక్తి గా ఉంది అండి ధన్యవాదములు -రోహిణి. *

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సి,హెచ్. సుశీలమ్మ గారి స్పందన: *భువన్ జీ! ఆనాటి కొందరు పెద్దమనుషులు ప్రథమ కోప మనస్తత్వం కలవారు. కానీ గుణగ్రహణ గ్రహీతలు. అందుకే మొదట కోపం తెచ్చుకున్నా ఆ తర్వాత ఎన్నో ఎన్నో అవకాశాలు ఇచ్చారు వి. మధుసూదనరావు గారు.
    నటుడి హావభావాలు ఊహించుకొని దాదాపు మిమిక్రీ చేసినట్లు పాడేవాడు మన బాలు. కానీ ఆయనకే ఆదర్శం మహమ్మద్ రఫీ ట. షమ్మీకపూర్ ఎలా నటిస్తాడో ముందుగా ఊహించుకొని తను పాడేవాడినని ఆయన చెప్పేవారు. అందుకే షమ్మీ, రఫీ కాంబినేషన్ పాటలన్నీ సూపర్ హిట్స్.
    “బిందువులు బిందువులు కలిసి సింధువైనట్లు కొన్ని వేల ఫిలిం ముక్కలు అతకబడి సినిమాగా మారుతాయి” అని డాక్టర్ గోపాలకృష్ణగారు అనడం సత్యం. దాన్ని జీవితానికి అన్వయించిన మీ లోతైన విశ్లేషణ మరింత బాగుంది. డాక్టర్ గోపాలకృష్ణ గారి ఫోటో పెట్టడం మా అందరికీ చాలా సంతోషం. నేనైతే ఇదే మొదటిసారి చూడడం. ధన్యోస్మి.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీధర్ వాడపల్లిగారి స్పందన: *సినీమావిపై చిగురించిన పదపల్లవం ఈ స్నేహగీతం.
    చిత్రం : ప్రాణ స్నేహితులు (1988)
    సంగీతం : రాజ్-కోటి
    గీతరచయిత : భువనచంద్ర
    నేపధ్య గానం : బాలు
    పల్లవి:
    స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా
    స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా
    కడదాక నీడలాగ నిను వీడిపోదురా
    నీ గుండెలో పూచేటిది
    నీ శ్వాసగ నిలిచేటిది
    ఈ స్నేహమొకటేనురా
    స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా
    చరణం 1 :
    తులతూగే సంపదలున్నా.. స్నేహానికి సరిరావన్న
    పలుకాడే బంధువులున్నా.. నేస్తానికి సరికారన్న
    మాయ మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా
    ఆ స్నేహమే నీ ఆస్తిరా.. నీ గౌరవం నిలిపేనురా
    సందేహమే లేదురా
    స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా
    కడదాక నీడలాగ నిను వీడిపోదురా
    చరణం 2 :
    త్యాగానికి అర్ధం స్నేహం.. లోభానికి లొంగదు నేస్తం
    ప్రాణానికి ప్రాణం స్నేహం.. రక్తానికి రక్తం నేస్తం
    నీది నాదను భేదం లేనిది.. నిర్మలమైనిది స్నేహమురా
    ధ్రువతారలా స్థిరమైనది.. ఈ జగతిలో విలువైనది
    ఈ స్నేహమొకటేనురా
    స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా
    కడదాక నీడలాగ నిను వీడిపోదురా
    నీ గుండెలో పూచేటిది
    నీ శ్వాసగ నిలిచేటిది
    ఈ స్నేహమొకటేనురా

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. చంద్రశేఖర అజాద్ గారి స్పందన: *నేను సినిమాలకు పని చేయాలని చిన్నతనం నుండి కోరుకున్నాను.. తర్వాత నాలుగున్నర దశాబ్దాల కు ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాను..
    పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా చేరాను.. అప్పటి ఓ అనుభవం ఇది..
    హీరో బాలకృష్ణ గారి సినిమా రాణా షూటింగ్ జరుగుతోంది.. పరుచూరి వెంకటేశ్వరరావు గారు దర్శకుడు కోదండరామిరెడ్డి గారితో లోపల వున్నారు.. నేను బయట వున్నాను.. అప్పుడు ఓ ఫైల్ తీసుకుని వస్తున్న వ్యక్తిని మొదటిసారి చూశాను.. వారు వేటూరి గారు.. నమస్కారం పెట్టి కూర్చోమని చెప్పి నన్ను పరిచయం చేసుకున్నాను.. పాటల పల్లవులు తెచ్చాను అన్నారు.. నేను చూడవచ్చా అనగానే చూడు నాయనా అన్నారు దయతో.. ఇరవై అయిదు వరకు వున్నాయి.. రెండు మూడు మాత్రం పాపులర్ పల్లవులు.. మిగతావి అద్భుతంగా వున్నాయి.. తర్వాత అందులో ఓ కమర్షియల్ పల్లవి ని ఎన్నుకున్నారు.. అది వేరే విషయం..
    మనకు గొప్ప కవులు వున్నారు.. అందులో చాలా మందికి సినిమా పాటలు అంటే చిన్న చూపు.. అలాగే తమ కవిత్వంలో ఒక్క పదం మార్చినా భరించలేరు.. సినీ గీత రచయితలు మామూలు కవులను, రచయితలను పట్టించుకోరు అనేది వేరే విషయం.. ఓ పాటకు అన్ని పల్లవులు రాసిన వేటూరి గారి లాంటి వారు కొన్ని వేల పాటలకు ఎన్ని పల్లవులు, చరణాలు రాసి వుంటారు.. ఎన్ని పేజీలు చించేసి వుంటారు ఊహించుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది..
    ఇక్కడి విషయం మన కవులు పాటలు రాయగలరు.. కానీ రాయరు.. అందుకు కారణం తమ రచన మీద మమకారం.. తిరస్కారాన్ని భరించలేరు.. సినిమా రంగం నిర్మమకారాన్ని నేర్పుతుంది.. ఒకటి కాదు అన్నప్పుడు పది రాయగలిగిన వారు అక్కడ నిలబడతారు.. ఏ సాహిత్య ప్రక్రియ అయినా మనం రాసింది వేదం కాదు.. సామాన్య పాఠకులను, మేధావులను దృష్టిలో వుంచుకోవాలి.. నిరంతరం మనల్ని మనం మార్చుకోగలగాలి.. ఇక్కడ ఎవరూ ఫైనల్ కాదు.. ఇది కొత్త తరానికి చెప్పాలి.. నేర్పాలి.. ఆ వినయం వున్న వారి రచనల్లో నమ్రత వుంటుంది..
    ఇదంతా భువన చంద్ర గారి ప్రయాణం గురించి చదువుతున్నప్పుడు అనిపించిన భావాలు.. ఓ విజయం వెనుక ఎంత శ్రమ, ఎన్ని వైఫల్యాలు, ఎంత ఒత్తిడి వుంటుందో తెలుస్తుంది వారి అనుభవాల నుండి.. ఎంతోమంది గీత రచయితల అవసరం వుంది.. ఇవన్నీ తట్టుకుని ముందుకు అడుగులు వేసేవారు రేపటిని స్వాగతిస్తారు..
    భువన చంద్ర గారికి అభివందనాలతో, పి. చంద్రశేఖర అజాద్.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాధిక మంగిపూడి గారి స్పందన: * హాయ్ బాబాయి గారు, మొదటి నాలుగు భాగాలు చదివేశా. ఓపెనింగ్ బాగుంది. ఫ్లో బాగుంది. గబగబా చదివించేలా. మనసు పొరలు లాగే ఉంది. మధ్యలో ఆలం అరా తదితర పాత సినిమాల డీటెల్స్ బాక్సులో ఇవ్వడం బాగుంది. *

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: * భువన చంద్ర గారూ నమస్తే. చాలా బాగుంది.
    ఈరోజుకీ మీరు చూపించే ప్రేమ సహనం ఓర్పు పట్టుదల ఏకాగ్రత కార్యదీక్ష అభినందనీయం. ఈ తరం వారికి మీ ఈ రచన ఆదర్శనీయం.
    డాక్టర్ గారు లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు.ఆయనసాగత్యం మిమ్మల్ని మరింత
    వివేకాన్ని పెంచింది.
    జీవితంలో ఎన్నో తెలుసుకోవలసినవి ఉన్నాయి కానీ జీవితం జీవించే సమయం చాలా తక్కువ. మీ రచన, మీ అనుభవాలు చాలా ఆలోచించేలా అర్థం చేసుకునేలా ఉన్నాయి.
    మీరు వ్రాయటం వెంటనే మీ గొంతుతో పాడి వినిపించండం మీరు త్వరగా అభివృద్ధి లోకి రావడానికి కారణం అని నా భావన. దన్యవాదాలు.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యామిని దేవి గారి స్పందన: *ఎప్పటిలా ఆసక్తికరంగా ఆకట్టుకునే విధంగా ఉంది అనేక విశేషాలు మా ముందు ఉంచారు ధన్యవాదాలు.
    జీవితం క్షణాల మూట అన్నప్పుడు కంటిలో చెమ్మ తెలిసింది చివరి వరకు ఎన్నో విశేషాలు తెలుపుతున్నారు ఎంతో ఒత్తిడి ఎన్నో తిరస్కారాలు ఎన్నో పురస్కారాలు అన్నిటినీ సమంగా చూడగలిగారు అంతా ఆసక్తిగా ఇష్టంగా సినీ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన సక్సెస్ సినిమాల్లో పాటలు అందించినా తామరాకు మీద నీటి బొట్టులా ఏదీ అంటించుకోనటు వంటి సంస్కారం గొప్పదనం మీది ఇవాళ స్నేహితుల రోజు సందర్భంగా స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనే మీ పాటను తలచుకోని వాళ్ళు ఉండరేమో!
    ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో సినిమాల్లో పాటలు మీ నుంచి వెలువడాలని ఆకాంక్షిస్తున్నాను శుభాకాంక్షలు గురువర్యా💐 నమస్సులు🙏*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ ఎం.ఎల్ నరసింహ గారి స్పందన: *
    “సినిమాల్లోకి రాకముందు వేలాది పుస్తకాలు చదివా. ఆ పుస్తకాల కంటే ఈ సజీవ పుస్తకాలే ఎక్కువ జ్ఞానాన్నిస్తాయనిపించేది. అనిపించడం కాదు, అదే నిజం కూడా. భగవంతుడి సృష్టి ఎంత గొప్పదంటే, ఏ ఒక్కొర్నీ మరో వ్యక్తిలా సృష్టించలేదు. ఎవరి ప్రత్యేకత వారిదే. ఎవరి ఆలోచనా పద్దతి వారిదే, ఎవరి వ్యక్తిత్వం వారిదే!”
    Absolute truth sir!
    “కోపానికీ, ద్వేషానికీ, మదానికీ మిగతా అన్నింటికీ, అంటే ప్రేమకీ, స్నేహానికీ, అభిమానానికీ కూడా ‘రీజన్సు’ ఉంటాయి. ‘అసూయ’కి మాత్రం ‘రీజన్’ వుండదు.”
    Wonderful words!

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉమాభారతి గారి స్పందన: *భువనచంద్రగారు.. ఐదవ భాగం.. చిక్కగా చక్కగా ఉంది సార్.. పాటలు.. విషయాలు కాసేపు అలా ఉంచితే.. మీరు జీవితం గురించి.. అసలు ఇది నేనేనా.. అనిపిస్తుంది అన్నారు.. చాలా బాగుంది.. మీరు, మీ క్రియేటివిటీ — గ్రేట్ అండీ.. ఆత్మవిశ్వాసం.. ఎవరేమన్నా ఎలా ఉన్నా.. మీలో అంత humilty, మీలోని ఆ ప్రతిభ బయటికి రావడం.. నలుగురు ఆ ప్రతిభని గుర్తించి ఆస్వాదించాలన్న తపన తప్ప .. అది అవుతుంది అన్న నమ్మకం ముందు.. మిగతావన్నీ doesnt మాటర్.. అన్న తత్వం .. నాకు నచ్చింది.. అదే ఇంతటి సక్సెస్ నిచ్చింది.. 🌺👏 *

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోటేటి మోహన్ గారి స్పందన:*అద్భుతం మాస్టారూ.. చాలా చక్కగా.. ఆసక్తికరంగా.. స్పూర్తిమంతంగా సాగుతోంది మీ ప్రయాణం. విజయబాపినీడు గారు మిమ్మల్ని ఎంతో ఆదరించారు. చివరివరకు తన సినిమాలలో మీకు పాటలు ఇస్తూనే వున్నారు.. మీరు కూడా దానిని నిలబెట్టుకుని, ఆయన సినిమాలకు అద్భుతమైన హిట్ పాటలు రాశారు. గొప్ప స్నేహబంధం మీ ఇద్దరిదీ. ఇక డాక్టర్ గోపాలకృష్ణ గారు మీకు ఫ్రెండ్.. ఫిలాసాఫర్ అండ్ గైడ్.. మంచి సలహాలు ఇచ్చి దిక్సూచిలా నిలిచారు మీకు. ఇవన్నీ నాకు మీరు మద్రాసులో మీ ఇంట్లో చెప్పేవారు. ఆయా విషయాలు ఎక్కడా దాపరికాలు లేకుండా చాలా నిజాయితీగా రాస్తున్నారు. అభినందనలు భువనచంద్ర గారూ.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®