సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    ramasundarimsbpnv

    జీవన గమనంలో కొన్ని నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకోవడం అవసరం. డబ్బుని జాగ్రత్తగా ఖర్చుపెట్టడానికి మీరు చేసుకున్న తీర్మానం అలాంటిదే. మెట్లవరస ఎవరికి వారే వేసుకోవాల్సి వస్తుంది, మెట్టు మెట్టుగా ఎవరికి వారే ఎక్కాల్సి వస్తుంది. ఒకరి సిలబస్ ఇంకొకరికి రిఫరెన్స్ అవుతుంది తప్ప అదే సేమ్ సిలబస్ మరొకరికి ఉండదు. కానీ ఒక ప్రముఖ వ్యక్తిగా మీ జీవన గమనాన్ని పరిశీలనగా చదువుతున్న కొద్దీ జీవిత సత్యాలు ఎన్నో బోధ పడుతున్నాయి.
    మీరు రాస్తున్న సందర్భాలన్నీ నెట్ లో దొరుకుతున్నాయి కాబట్టి ముందుగా సాగరసంగమం ‘వేవేల గోపెమ్మల’ పాట ముందు మిశ్రో గారితో ఉన్న సాంబశివరావు గారు ఎవరని చూశాను. నిజమే. ఆయన బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు ‘బడి’ కూడా చూడాలి. బాపినీడు గారి వాత్సల్యం మీకెంతో అండదండలుగా ఉంది.
    గువ్వా గోరింక పాట వెనుక గాథ మీరు చెప్తే, ప్రతి పాట వెనుకా ఒక కవి పడే తపనా, పదం కుదిరే వరకూ ఉండే ఆరాటం, మరో పక్క డెడ్ లైన్స్… ‘ఎన్ని కష్టాలు దాటితేనో గదా ఇంత పేరు’ అనిపిస్తుంది. ఈ పాట ఇప్పుడు కూడా రీమిక్స్ ప్రభంజనంలో మారుమోగుతోంది.
    శ్రీమతి జలంధర గారు రాసిన ‘పున్నాగపూలు’ లో కూడా డాక్టర్ గారి గురించి బాగా చెప్పారు. ఆమె చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఎందరో మహానుభావుల్ని పరిచయం చేస్తున్నారు. అమ్మకి ఆ ఇంట్లోనే అంతులేని జ్ఞాపకాలు… అమ్మతో మీ జ్ఞాపకాల చెమరింపు.. ఆ ఆర్తి…మరిచిపోలేము.
    ఎన్నో జీవిత మర్మాలు… విశ్వ రహస్యాలు… తెలుసుకుంటున్నాను.
    ధన్యవాదాలు అన్నా…
    చండి (రమాసుందరి)

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీదేవి రమేష్ గారి స్పందన: నమస్కారం గురువుగారు. ఖైదీ నెంబర్ 786 లో మీరు రాసిన గువ్వా గోరింకతో పాట ప్రస్థానం అంతా విన్నాను చదివాను. ఎంత బాగుందో మీరు పడ్డ తపన అర్థమయింది. ఆ క్షణంలో మీరు ఎంత టెన్షన్ పడ్డారో అర్థం అయింది. నిజమే ఒక పాట బయటికి రావడానికి కారణం అయినటువంటి వ్యక్తులను గుర్తు చేసుకోవడం మీ సంస్కారం. ఆ రోజు వేటూరి వారు మీ పాటకు రాజముద్ర వేశారని రాశారు నిజంగా ఎంత బాగుందో ఆ పాట. నాకు చాలా ఇష్టమైన పాటలలో అదొకటి. అలాగే స్నేహానికన్నా మిన్న పాట కూడా. మీ పాటలన్నీ బాగుంటాయి. పచ్చని చిలుకల తోడుంటే ఆ పాట కూడా అలా చాలా ఉన్నా కూడా సడన్‌గా.. అంటే ఈ గువ్వా గోరింకతో చాలా ఇష్టం అలాగే స్నేహానికన్నా మిన్న అన్ని పాటలు ఆణిముత్యాలు. అయితే చాలా బాగుంది. సిరీస్ చదువుతున్నాను నేను ఇప్పుడు. రమేష్ గారు కూడా విన్నారు ఇది ఇద్దరం కలిసి నేను చదివాను పైకి ఆయన విన్నారు. ఎంత బాగుందో ఎంత బాగా రాశారు చాలా తన అనుభవాలన్నీ మనకు తెలిసాయి గోపాలకృష్ణ గురువుగారు జాలాది గారు వేటూరి గారి గురించి అసలు ముఖ్యంగా బాపినీడు గారు మీరు ఎప్పుడు చెబుతుంటారు వారి గురించి మీ సినిమా ప్రస్థానం అంత ఎలా మొదలైంది ఎంత సింపుల్ అండ్ హంబుల్ మీరు చిన్నప్పటినుంచి అనే విషయం అర్థమైంది దానికి తగ్గట్టు ఆర్మీ వారు కాబట్టి అన్ని పద్ధతిగా చేసుకుంటూ వెళ్లారు ఈనాడు మీరు ఇంత విజయం సాధించడానికి కారణం మీ స్వభావం మీ ఆధ్యాత్మిక చింతన మీ రూల్స్ చాలా సంతోషం మీకు శుభాభినందనలు ఒక్కొక్క భాగం చదువుతాను ధన్యవాదాలు మీరు నాకు పంపినందుకు అత్యంత అద్భుతంగా ఉంది మీరు పంపారు కదా🕉️శుభాభినందనలు బాబాయ్ గారు.ఆ సద్గురువుల లలితాంబిక అనుగ్రహం మనందరి మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః 🕉️ 🪷🙏

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ శైల కుమార్ గారి స్పందన: *అయ్యా చాలా బాగుంది. గతం ఇలా రికార్డు చేయడం ఎంతో ఉపయోగం. పుస్తకం వేశారా, వేస్తున్నారా. వేస్తే ఫోటోలు కూడా ఉంటే వేయండి.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జివిఎన్ నరసింహం గారి స్పందన: *అన్నగారికి నమస్కారం 🙏. ఎలావున్నారు? మీ ‘జీవితం ఒక ప్రయాణం’ షేర్ చేసినందుకు ధన్యవాదాలు🙏. రెండుసార్లు చదివాము. చాలా బాగుంది. మీరు మా ముందు కూర్చొని చెపుతున్నట్లు ఉంది. మీ ఈ రచన కూడా మీ మిగతా రచనల వలె దృశ్య మాధ్యమంలో చూస్తున్న అనుభూతిని కలిగించింది. మిగతా భాగాల కోసం ఎదురు చూస్తున్నాము. మీ ఆరోగ్యం జాగ్రత్త. మరియొక సారి 🙏*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mrs. Lakshmi Sailaja: *You made me cry when you were talking about mom and the relationship. Now a days no one needs a mom Man! People are busy with their life!!*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన:*భువన్ జీ! ‘పనీ పాటా చేసుకుని వచ్చిన డబ్బులతో బతకాలి’ అని మీరు ఏ క్షణంలో అనుకున్నారో, తథాస్తు దేవతలు “అలాక్కానీ” అని వుంటారు. పాటే పనిగా చేసుకుని హుందాగా, అద్భుతమైన పేరు ప్రఖ్యాతులతో జీవిస్తున్నారు. మీ గీత రచనా జీవితం చదువుతుంటే ఆ దృశ్యాలు కళ్ళముందు కదలాడేవి. ఇప్పుడైతే ఏకంగా సినిమా చూస్తున్నట్టే ఉంది. చెట్టు కింద డాక్టర్ గారు, ఆయన చుట్టూ మీరందరూ, పక్కన టీ స్టాలు, గువ్వా గోరింక పాటను చిరంజీవి గారికి విజయబాపినీడు గారు వినిపించడం.. సావిత్రి గారి జీవితాన్ని “మహానటి” సినిమా చూపించినట్టు – వివరిస్తున్నారు మీరు. మీకు అనేకానేక ధన్యవాదాలు.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి పల్నాటి గారి స్పందన: *శ్రీ భువన చంద్ర గారికి నమస్కారములు. ‘జీవితం ఓ ప్రయాణం’ 6వ సంచిక చదివాను అండీ. చాలా బాగుంది అండీ. మీ అమ్మ గారితో కలసి మీరు వ్రాసిన పాటల సినిమా చూడటం మీ అనుభూతి చదువుతుంటే మనసు సంతోషంతో నిండి పోయింది. ఘంటసాల గారు కూర్చున్న బెంచి తడుముతూ వ్రాసిన మీ అనుభవం సూపర్ అండీ. ఎంతో మంది మహానుభావులతో కలసి నడిచిన మీ జీవితం ధన్యమండీ. చదివిన వారి జీవితాలు కూడా -ధన్యవాదములు 🙏🌹-రోహిణి.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వూటుకూరి శ్రీలక్ష్మి గారి స్పందన:*ఇప్పుడే చదివాను. చాలా బాగా వ్రాశారు. ఎంత ఎదిగినా ఒదిగి వుండే తత్వం మీది. అందుకే మీలో భేషజం ఉండదు. చాలా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాను.
    అభినందనలు. థన్యవాదాలు.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన:*నమస్కారం అండీ. మీరు మీ పెన్షన్ డబ్బులు వాడకూడదు, కష్టపడి సంపాదించిన డబ్బులు వాడుకోవాలనే మనసులో నిర్ణయం తీసుకోవటంలో మీ విజయానికి పునాది పడింది అనుకుంట. మీ ఆలోచన విధానం, మీ మనస్తత్వం అర్థం చేసుకోవడం మీపై చాలా గౌరవం పెరిగింది.
    ఇంత సున్నితమైన మనసుకు గువ్వా గోరింకతో నచ్చలేదన్న విషయం ఎంత బాధ, ఉద్విగ్నత కూడిన ఆ సమయం.. నిస్సహాయత ఉన్నా లేకున్నా ధైర్యంగా అక్కడ వాడవలసిన పదం గట్టిగా వివరణ ఇచ్చిన విధానం మరల ఓ రచయిత హృదయం మరో లోతైన రచయితకు మాత్రమే అర్థం అవుతుంది. వేటూరి గారు ఆమోదించారు. చాలా బాగుంది. మీకు నా అభినందనలు, ధన్యవాదాలు.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    జి వి ఎం నరసింహం గారి స్పందన: *అన్నగారు, మీ ఓర్పు కు జోహార్లు 🙏 you are great! మధుసూదనరావు గారు కారులో నుంచి ఫైల్ ను బయటకు విసిరి వేసి నప్పుడు మీరు కామ్ గా దానిని తిరిగి తీసుకువచ్చి విషయం వివరించారు. మీ స్థానంలో మరొకరు ఉండివుంటే కామ్ గా దాన్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయే వాడు!. మీ కున్న సహనం, పట్టుదల మిమ్మల్ని ఈరోజు ఒక గొప్ప సినీ గేయ రచయితగా నిలబెట్టాయి! మీకు అభినందనలు💐.
    అన్నగారు, ఇంకొక విషయం. దేముడెంత ‘సమవర్తి ‘ -నార్త్ కి లత, సౌత్ కి సుశీల గార్ల తో పాటు అక్కడ వారికి ఆశా భోంస్లే, ఇక్కడ మనకి జానకి గార్లను కూడా ఇచ్చాడని నాకు అనిపిస్తోంది సర్! *

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ గోటేటి మోహన్ గారి స్పందన:*ఎప్పటిలానే ఈ వారం కూడా చాలా బాగుంది మాస్టారూ.. మీ ప్రయాణం స్పూర్తిదాయకం! ‘గువ్వా గోరింక’తో మొదలెట్టి మెగాస్టార్ కి అన్నీ సూపర్ హట్ సాంగ్స్ రాశారు కదా.. మీ పాటల్లో ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా మీరు వేసే పదాలు మంచి ఫోర్స్ తో .. గమ్మత్తుగా వుంటాయి..*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బ్నిం గారి స్పందన:*భలే ఉంది సార్.. జీవితం.. గువ్వా గోరింకా సూపర్ హిట్ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్.. ఫోర్‌గ్రౌండ్ కూడా. ఒక విద్యాధికుడైన కవి జీవనయానంలో ప్రతి పదం సోపానమే..*

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యామిని గారి స్పందన: *ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు చెప్తారు మీరు ప్రతి చోట అది ఆచరించి చూపించారు.
    ఆత్మవిశ్వాసంతో వేసిన ప్రతి అడుగు మీ కష్టానికి ప్రతిఫలం లభించేలా చేసింది.
    మీ ఓర్పు, సహనం, వినయవిధేయత మిమ్మల్ని ఉన్నత శిఖరాన నిలిపాయి. మీరు చెప్తూ ఉన్న ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క సందర్భం కళ్ళ ముందు కదులుతూ ఉన్నట్టే ఉంది. మీ చుట్టూ మేమంతా కూర్చుని వింటున్నట్టు మీ ప్రేమ పూర్వక పలుకులు ప్రేమపూర్వక మాటలు మేము ఆలకిస్తూ ఆ విషయాలలోని గాఢతని, తడిని మా హృదయానికి అద్దుకుని ఆ లోపలి తడి కంటిపాప తడిబారేలా చేసిన వాక్యాలు అనేకం ఉన్నాయి.
    నిర్మాత కావచ్చు డైరెక్టర్ కావచ్చు కెమెరామెన్ కావచ్చు ఎవరైనా కావచ్చు
    వారితో మీకున్న అనుబంధాన్ని మీరు వ్యక్తపరిచే తీరు వాళ్ళకి ఇచ్చే గౌరవం మీ ప్రతి మాటలోనూ నేను చూస్తూ ఉన్నాను. మీపై దానికి రెట్టింపు ప్రేమ మాకు కలిగేలా మీ వ్యక్తిత్వం మాకు మార్గదర్శకంగా ఉన్నతంగా ఉంది.
    నేను ఇందులో ప్రస్తావించిన పేర్లు ఒక్కొక్కరి గురించి ప్రస్తావించి చెప్పట్లేదు కానీ అంతా చదివిన తర్వాత నా మనసు లోపల యొక్క భావాన్ని ఆ తడిని మాత్రమే ఇక్కడ వ్యక్త పరుస్తున్నాను. చెప్పుకుంటూ వెళితే చాలా ఉంది అన్నట్టు ఎంత చెప్పినా తరగని మీ ఔన్నత్యం మీ వ్యక్తిత్వం వ్యక్తిని గౌరవించే స్వభావం కళ్ళకు కట్టినట్టు మనసుకు తెలుస్తోంది. మీ సమదృష్టి ప్రేమ పూర్వక వచనాలు ఆనందంగా ప్రసరింప చేస్తారు.
    ఇది ఈ వారం భాగం చదివిన తర్వాత ఇప్పుడు నా మదిలో కలిగిన భావం.
    ధన్యవాదాలు గురువర్యా🙏💐 *

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇ. సత్య గారి స్పందన:*చాలా ఇష్టంగా చదువుకున్నాం అన్నగారూ. వ్యక్తులు, సందర్భాలూ, సంఘర్షణలూ అద్భుతంగా వచ్చాయి.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®