సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లలితా శివజ్యోతి గారి స్పందన: *మంచి మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు. బాపినీడు గారు అన్నట్టు ఎక్కువ buildup ఇచ్చేవారికే రోజులు.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాసుందరి (చండి) గారి స్పందన: *విదేశీ సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ లో పాటలు నడుస్తాయేమో తప్ప భారతీయ సినిమాల్లో హీరో హీరోయిన్స్ కి పాటలు ఉంటాయి. చిరంజీవి నటన, నాట్యం అన్నీ విలక్షణంగా ఆకట్టుకున్నాయి కనుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఆయన సినిమాలో పాటలు చాలా ప్రత్యేకం. బాలు గారు ఏ హీరోనైనా తనలో ఆవహింపజేసుకుని తగ్గట్టు పాడగలరు కాబట్టి ట్యూన్ హిట్. ఆ ట్యూన్ కి మీరు చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని రాశారు కనుకే ఆ పాట కూడా హిట్. అందుకే ఎన్ని పల్లవులు రాసినా, మొదటి పల్లవి మీదే మీ మమకారం సహజం. అదే అందరూ ఓకే చేశారు అంతిమంగా. నాటు నాటు సాంగ్ ని 72 సార్లు చిత్రీకరించారట రామ్ చరణ్, ఎన్ టి ఆర్ స్టెప్స్ సింక్ కోసం. చివరికి అవన్నీ స్టెప్ ఫ్రీజ్ చేసి చూస్తుంటే.. రెండో సారి చేసిందే ఓకే చేశారట. అది గుర్తొచ్చింది.. ఈ సందర్భంగా. కాకపోతే, అనేకం నుంచి ఒకదాన్ని ఎంచుకునే సౌకర్యం ఇవ్వడం.. క్రియేటర్స్ కి అవసరం. వెన్నెలకంటి గారితో మీ ఇంటర్వ్యూ కూడా ఎంతో విజ్ఞానదాయకంగా ఉంది. ప్రతి పాటకీ వెనక ఎంతో మేధో మధనం.. పిచ్చెక్కిపోవడం జరిగితేనే కానీ ఆ పదాలు పడవు. వివరంగా పాట కథలు.. వెతలు రాస్తున్నారు. ధన్యవాదాలు అన్నా. – చండి (రమాసుందరి).*

    Reply
    1. 2.1

      సీతారామా రావు కొడాలి

      ఇంతకీ చక్రవర్తిగారు పల్లవి ఎందుకు మార్చమన్నారో చెప్పలేదు.

      Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వివేకానంద రెడ్డి గారి స్పందన: *కన్నతల్లి సినిమాలో ఆత్రేయ గారు రాసిన సంభాషణ: “వాడికి మీరంటే చాలా గౌరవం అమ్మా; ఎంతైనా నా కొడుకు కదూ!”. దానికి అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన మార్పు “ఎంతైనా నా కొడుకు కాదు.”*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్కారం అండి. మీకు మీరు వ్రాసే భావాలు, వాటి అర్థాలపై, పాట రాయడంలో మీకు చాలా నమ్మకం ఉంది. కాబట్టి మీరు నిలబడి పేరు తెచ్చుకోగలిగారు.
    మంచి డైరెక్టర్లు దొరికారు కాబట్టి మీ విలువైన సమయస్ఫూర్తి భావాల్ని సంపూర్ణంగా అర్ధం చేసుకుని ముందుకు సాగారు. మీరు చాలా సహనంతో మెలిగి మీ పట్ల మీ బాధ్యతను పూర్తి చేసి చాలా కష్టపడి పనిచేస్తారు. కాబట్టే సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనిపించింది. చాలా మంచి వ్యక్తిగత నియంత్రణ కలిగిన వ్యక్తి.మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొఫెసర్ నరసయ్య పంజాల గారి స్పందన: *శ్రద్ధగా చదివా. పాటల రచయిత కష్టాలు తెలిసినవి. మీకు దోస అంటే ఇష్టమా! అభినందనలు.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బలభద్రపాత్రుని రమణి గారి స్పందన: *చాలు, టైటిల్ పడిందిగా వేటూరి గారితో 😊 *

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విష్ణుభొట్ల సుగుణ గారి స్పందన: *మీ సినీ ప్రస్థానం, ప్రయాణం గురించి రాసారా? డిఫన్స్ లైఫ్ కి బయట లైఫ్ కి చాలా తేడా ఉంటుంది కదా బాబాయ్? నేను పెళ్ళి అయ్యాక అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. మనకేమో డొంక తిరుగుడు మాటలు రావు. ముక్కు సూటిగా మాట్లాడటం తప్ప.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యామిని దేవి గారి స్పందన: *నిజమే ఇక్కడ మనుషుల మధ్య మనిషికి మనిషికి లెక్కలేనన్ని గోడలు. ప్రతి మనిషికి లెక్కలేనన్ని ముసుగులు. నిజం ఇది.
    ఈ వారం అనేకమైన విషయాలు తెలుసుకున్నాం. ఒక పదాన్ని ఇటువంటి చేసినప్పుడు అర్థం మారిపోతుంది కొన్నిసార్లు ఒక అక్షరమే కాస్త గ్యాప్ ఇస్తే ఇంకో అర్థంలో అవుతుంది అప్పుడు రాసిన వారి వ్యథ, వేదన ఎలా ఉంటాయో మీ మాటల్లో వ్యక్తపరిచారు.
    ‘మెరుపులా’ అన్న పాట చిన్నప్పుడు మా స్కూల్ డేస్‌లో పిచ్చిగా పాడుకునే వాళ్ళం. ఆ పాట వెనుక ఇంత కథ జరిగిందా అనిపించింది. పాట సూపర్ హిట్. తర్వాత కొక్రి గురించి మీరు చెప్తున్న ప్రతి విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. బాలు గారు ముందు ఏమైనా తిని రండి అనడం నాకు చాలా నచ్చింది. మనిషి ఆకలిని గుర్తించారు వారు.
    ఇక పాటలు పాడడం గురించి చెప్పేదేముంది? ఎవరి గురించి చెప్పినా అంతా మంచే చూస్తారు. కాబట్టి మీకు అంత మంచే కనపడుతుంది. సినీ ఫీల్డ్‌లో ఎలా ఉంటారు, వాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారు, ఎంత క్రియేటివ్ మైండ్ అనేది చెప్పడం చాలా బాగుంది. మరో వారం రాబోయే సంచికకై ఎదురుచూస్తూ ఉన్నాం.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ మోహన్ గోటేటి గారి స్పందన: *ఒక రచయిత ఒక పదాన్ని ఎంతో ఆలోచించి రాస్తాడు. అది మారిపోతే అతను పడే వేదన వర్ణనాతీతం. అలాగే మీ పాటలో ఓ పదం మారిపోయిన వైనాన్ని మీరు ఎంతో ఆవేదనతో.. బాధతో వ్యక్తీకరించారు భువనచంద్రగారూ. ఒక ‘మేధావి’ చేసిన ఒక బ్లండర్ కారణంగా ఆ పాట విన్నప్పుడల్లా అది మీకు ముల్లులా జీవితాంతం గుచ్చుకుంటూనే వుంటుంది. ఒక్కోసారి మ్యూజిక్ డైరెక్టర్లు కూడా రచయిత అనుమతి లేకుండా మార్చేస్తుంటారు కదా? అదీ దారుణమే.. మార్చమంటే మీరే సరైన అర్థవంతమైన పదాలు వేస్తారు కదా? వేటూరి గారికి కూడా ఇలాంటివి కొన్ని జరిగాయట. ఆయనే నాకు చెప్పారు. ఇక “మెరుపులా ఆడతా..” పాట మీ కెరీర్ కి ప్లస్సూ, మైనస్సూ కూడా అయినట్టుంది!*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాజ్యలక్ష్మి గారి స్పందన: *మీ జీవిత ప్రయాణంలో మేము భాగస్థులమే. పానగల్ పార్కు, పాండీబజారు doctor గోపాలకృష్ణ గారు మీ సంతోషాన్నీ షపంచుకుంటూ చాలా ఆనందిస్తున్నానండీ.*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉమాభారతి గారి స్పందన:*మీరు అన్న మనుషులు.. అంటే పక్కనే ఉంటూ గోతులు తవ్వేవారు.. కళా రంగంలో.. ఎక్కువే.. అందులోనూ ప్రతిభ ఉన్నవారంటే.. అసలు సహించలేని వారు mushrooms లా all over.. నేను ఎదుర్కున్న పరిస్థితులు.. హాస్యాస్పదమే అయినా.. మహా దారుణం.. బాగా రాశారు.. 786 సినిమా కూడా చూసాము.. 8వ భాగం too interesting..*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®