సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    డా. సిహెచ్. సుశీల

    చారిత్రక రచనలు చేయటమే ఒక సాహసోపేతమైన చర్య. చరిత్ర , సాహిత్య చరిత్ర తెలుసుకోవటం ఏ దేశంలోనైనా పాఠకుడికి అత్యవసరం. చరిత్ర పునాది లేకుండా’ వాస్తవ, ప్రస్తుత, భవిష్యత్’ హర్మ్యాల పటిష్టత అనుమానాస్పదమే కదా! ఎంతో పరిశోధన, పరిశ్రమ, ప్రణాళికాబద్ధంగా చారిత్రక నవలలు రాయడం కష్టంతో కూడుకున్న పని. అంతటి శ్రమ కోర్చి అద్భుతమైన చారిత్రక రచనలు చేసిన వారు మనకున్నారు- అని గర్వంగా చెప్పుకోవాలి కానీ ” మన చారిత్రక రచనలు 70 ఏళ్ల కిందట ఆంధ్ర రాష్ట్రోద్యమం నేపథ్యంలో వచ్చినవే. ఆ తర్వాత కాలంలో వచ్చినవి దాదాపు శూన్యం” అనటం సాహసోపేతమైన వ్యాఖ్య అనాలా! మన దురదృష్టం, దృష్టిలోపం అనాలా! చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్య ఇది. అంటే 1951 తర్వాత తెలుగులో చారిత్రక రచనలు లేవా! విశ్వనాథ వారిని విస్మరించారా! అడివి బాపిరాజు, లల్లాదేవి, ప్రసాద్ వంటి ఉద్దండుల రచనలు చారిత్రకమైనవి కావా! పైగా “వాస్తవిక” చారిత్రక అనటంలో “వాస్తవిక” అనే పదానికి ప్రత్యేక అర్థం ఏమైనా ఉందా! మురళీకృష్ణ గారు అన్నట్టు వందిమాగధులను పోగేసుకొని – వాస్తవిక, ప్రస్తుత ప్రపంచాన్ని దర్శించక, దర్శించలేక, సాహిత్య ముఠాల మఠాల పీఠాల మాఫియా వీరులు ఒకానొక పరిధిలోనే మిగిలితే మిగిలి పోవచ్చు గాక. కానీ నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా భ్రమింప చేయాలనుకోవటం అన్యాయం. దుర్మార్గం. తమనితాము మేధావివర్గం గా స్వయం ప్రకటనలు చేస్తూ, చేయించుకుంటూ ఆత్మవంచన చేసుకునే వారికి చెంపపెట్టులాంటిది పై వ్యాసం. “తెలుగు కథ ఒక కొమ్మ మాత్రమే విపరీతంగా పెరిగిన వికృత వృక్షంగా ఎదుగుతోంది” అంటూ ఉపోద్ఘాతంతోనే పెద్ద సంచలనానికి దారి తీసిన మురళీకృష్ణ ఈ వ్యాస పరంపరతో ఇంకెన్ని సునామీలు సృష్టిస్తారో! ” గుడ్డిగా పొగిడే అమ్ముడైపోయిన అజ్ఞాన విమర్శకులకు” కూడా కనువిప్పు కలిగించే తరువాయి భాగాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ…
    డా.సిహెచ్.సుశీల
    రిటైర్ ప్రిన్సిపాల్.

    Reply
  2. 2

    భవాని

    నమస్తే. ఆలోచించదగిన ఉత్తమ వ్యాసం.మురళీకృష్ణ గారికి అభినందనలు
    నేను బొబ్బిలి యుద్ధం చారిత్రక పద్యనాటకం రెండున్నర గంటల నిడివి గలది రాశాను.30 ప్రదర్శనలు అయింది.
    ధన్యవాదాలు

    Reply
  3. 3

    మధు చిత్తర్వు

    Historical fiction writing is the most difficult form of writing .ఈ విషయం మాత్రం నిజం.మీ నిష్పాక్షిక మైన , వ్యక్తి గత విమర్శ లు లేని విశ్లేషణ కు ఎదురు చూస్తాను‌.పరిచయం బావుంది.ఇంతవరకూ రాసిన ఎంతో మంది రచయితల పేర్లు గుర్తు చేశారు.కాలయంత్రం వల్ల చారిత్రక కథ కు మళ్లీ గొప్ప ఫోకస్ వచ్చింది.దీనికి నిర్వాహకులు సాయి పాపినేని గారు అభినందనీయులు.అలాగే మీ వ్యాసాలు కూడా ఈ చారిత్రక కల్పనా సాహిత్యం రాసేపథ్థతి , రాసిన ఎంతో మంది తెలుగు రచయితల గురించి వారి నవలలు కథలు తెలియజేసి ఉపయోగకరం అవుతాయని ఆశిస్తున్నాను.చరిత్ర రచన వేరు , చారిత్రక కల్పనా రచన వేరు .ఈ విషయం మాత్రం నిజం ‌.పాపులర్ సైన్స్ రచన వేరు, సైన్స్ ఫిక్షన్ వేరు అయిన విథంగానే.

    Reply
  4. 4

    తుర్లపాటి rajeswari

    కస్తూరి మురళీకృష్ణ గారి వ్యాసం ఆలోచింప చేసేదిగా ఉంది. వారు ఎన్నో విషయాలను తెలియ చేశారు. సాహిత్య చరిత్ర గురించి వ్రాసేటప్పుడు తప్పుడు వ్యాఖ్యలు చోటు చేసుకోవటం సరికాదు. కాలయంత్రం అట్ట వెనకాల 1951 తర్వాత చారిత్రిక రచనలు దాదాపు లేవు అన్నట్టు వ్రాయటం దురదృష్టకరం.
    నేను కధలు, ఒక రూపకం రాసాను.1933 లో బరంపురం లో జరిగిన అభినవాంధ్ర కవిపండిత సభ గురించి . మురళీ కృష్ణ గారు మునుముందు చెప్పే విషయాల కోసం ఎదురు చూస్తున్నాను.
    తుర్లపాటి రాజేశ్వరి

    Reply
  5. 5

    Sandhya Yellapragada

    ఈ నెల సంచికలో మొదట చదివిన వ్యాసముదే. మీరు సవివరముగా ఎందరినో ఉదహరిస్తూ రాయటము వలన వయాసము పరిపుష్టితో ఉంది. భారతీయ, అందునా తెలుగువారి చరిత్ర మీద కూలంకుశమైన రచనలు ఇంకా రావాలి. మీరు సాహిత్యములో అందునా చరిత్కరు ఎన్నో గొప్ప రచనలు కలిపారు. మీ చర్చల కోసం ఎదురుచూస్తాము. వందనములు

    Reply
  6. 6

    డా.వై. కామేశ్వరి.

    ఆధునిక కవిత్వ పరిస్థితి కూడా ఇంతే. వర్క్ షాపులు, పరస్పరం భుజాలను చరుచుకోవడాలు. ఇలాగే కొనసాగుతోంది

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!