సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కోవెల సంతోష్ కుమార్

    చాలా బాగుంది. విమర్శ అంటే.. రచన లోని విషయం గురించి న సమగ్ర విశ్లేషణ కాకుండా.. సదరు రచయితతో ఉన్న అనుబంధాన్ని బట్టి.. నాలుగు పొగడ్తలు పొగిడితే.. సరిపోతుందన్నట్టు గా మార్చారు. ఇటీవలి కాలం లో రచయితే మారు పేరుతోనో.. మరొకరి చేతనో.. ఒక విమర్శ రాయించేసుకొని.. ప్రచారంలోకి పెడుతున్నారు. ఇలాంటి పెడ ధోరణులు అటు కొందరు సంపాదకులు.. రచయితలు విశృంఖలంగా రచనలు చేసే తెగింపుకు దారి తీసింది. తాము ఇది రాసినా, తీర్మానించినా అడిగే వాడు ఉండడన్న ధోరణి.. బ్రిటిష్ వాడు.. లెఫ్టిస్టు లు.. మార్క్సిస్టు చరిత్రకారులు తాము అనుకున్నదాన్ని మన మీద ఇంపొస్ చేశారే.. సరిగా అలాగే ఉంటుంది. ఆ మధ్య ఓ సినీ గాయకుడి గురించి వచ్చిన పుస్తకం ఇలాంటిదే. దానిపై విమర్శ (ఈ సంచిక లో నే వచ్చింది) చూడకపోతే.. అదే నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడేది. ఎందుకంటే రచయితకు అప్పటికే ఉన్న రెప్యూటేశన్ అలాంటిది కాబట్టి. చరిత్ర ఆధారిత రచనలు చేసే టప్పుడు మరింత వొళ్ళు దగ్గర పెట్టుకోవాలన్న ఇంగితం లేకపోతే కాలయంత్రాలు ఇట్లాగే వస్తుంటాయి. పొరపాటున వాటిని చదివితే అందులోనివే నిజమేనా అన్న భ్రమ కూడా కలుగవచ్చూ. ఈ కథలు, నవలలు, చరిత్ర రాసే వాళ్లందరినీ ఒక్క చోట కూర్చోబెట్టి (బలవంతంగా నే) విశ్వనాథ, బాపిరాజు, కందుకూరి, నోరి, (చాలా పేర్లున్నాయి లెండి) వంటి వారి రచనలు చదివించి.. విశ్లేషణ చేయించి.. ఆ తరువాతే రచనలు చేయాలని విధి నిషేధాలు విధిస్తే ఎంత బాగుండు…

  2. 2

    Muralikrishna

    Comment by Kondapalli Niharini
    హలో మురళీకృష్ణా నీ వ్యాసమంతా చదివాను . ఇంత ప్రామాణికంగా విమర్శ ఈ మధ్య చూడలేదు.”పాట లోని ఒక్క పదం పట్టుకుని, అదీ రాణి పాడినట్టు ఒక్క వాక్యంలో రాసి తెలంగాణ / తెలుగు వారే బర్మాను పాలించారని తీర్మనించడం ఏ రకంగా సమంజసం కాదు “అని రాసావు అలాగే , “ బ్రిటీష్ వారు బర్మాపై ఆధిపత్యం సాధించి వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు కావాలని రచించిన చరిత్రతో బ్రిటీష్ వారు చేసిన అకాండ తాండవాల్ని ప్రరస్తావించడం వంటివి ఉదహరిస్తూ , sweeping stetments తో రాయకూడదని బాగా చెప్పి చారిత్రకత ను బాగా రాసావు శుభాకాంక్షలు

  3. 3

    రాపాక పవన్ స్వరూప్

    చరిత్ర, సృజన, రచన – అవి కలిపే తీరు తెన్నుల గురించి, అందులోని లోటుపాట్ల గురించి అద్భుతంగా వివరించారు. ఒక విమర్శనాత్మక విశ్లేషణ కూడా ఇంత నిర్మాణాత్మకంగా, హేతుబద్ధంగా, ఆలోచనాత్మకంగా రాయడం మీకు ఈ విషయాలపై నున్న సమగ్ర అవగాహనకి నిదర్శనం. చరిత్ర మీద రచనలను రాసేవారు, చదివేవారు, సమీక్షించే వారు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలను చక్కగా వివరించిన వ్యాసం ఇది.

  4. 4

    Sandhya Yellapragada

    చరిత్రను పరిశోదకుడు దొరికిన ఆధారాల ద్వారా నిర్ణయిస్తాడు. రచయిత దొరికిన ఆధారాల బట్టి కల్పన చేస్తారు. ఆస్తిపంజరానికి రూపముచ్చి నిలబెడతాడని మీ వివరమ బాగున్నది.
    చరిత్ర వ్రాసేటప్పుడు తీసుకోవలసిన విషయ జాగ్రత్తల వివరాలు బావున్నవి. ఫ్లాష్‌బ్యాక్ టెక్కిన్కు వివరణ కూడా బావుంది. మనకు కళాపూర్ణోదయంలో మొట్టమొదటి సారి ఈ టెక్నిక్ వాడబడినది చెబుతారు కదా. (నాకు గుర్తు ఉన్నంత వరకూ).
    చరిత్ర గురించి వ్రాసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నది నిజం. మంచి చెయ్యకపోయినా చెడు చెయకపోతే, చరిత్రను వక్రించకపోతే చాలు. మన క్లాసు పుస్తకాలలా.మీరు బర్మా మీద వ్రాసిన కథలు నేను చదవలేదు. దొరికించుకునే యత్నం చెస్తాను.

  5. 5

    వివిన మూర్తి

    ఎంత బలమైన వాదన మీది. ఈ రకంగా కల్పనా సాహిత్యం మాధ్యమంగా అవసరం లేని గర్వాలు కలిగించటం చాలాకాలంగా ఉన్నదే. చారిత్రక కల్పనా సాహిత్యం ప్రయోజనం అదే అన్నంతగా జరిగింది. ఇలా ఇంత విషయ సేకరణతో వ్యాసం రాయటం నాకు చాలా నచ్చింది. అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!