[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]
పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని భుజంపై వేసుకుని మౌనంగా నడవసాగాడు.
విక్రమార్కుని భుజంపై ఉన్న శవంలోని బేతాళుడు “మహీపాలా, నువ్వు నాలుగు వేదాలు, మనుస్మృతి-బృహస్పతి – దక్ష – గౌతమి – యమ – అంగీరస – యాజ్ఞవల్క్య- ప్రచేత – శతాతప – పరాశర – సంవర్త-వౌశనస – శంకర – లిఖిత – ఆత్నేయ – విష్ణు- ఆపస్తంబ -హరీత వంటి స్మృతులను, కణ్వ-కపిల-లోహిత-దేవల- కాత్యాయన- లోకాక్షి – బుధ- శతాతప – అత్రి – ప్రచేత – దక్ష – విష్ణు – వృధ్ధ – ధౌమ్య- నారద-పౌలస్యఉత్తరాంగీస – విష్ణువృధ్ధ వంటి ఉపస్మృతులను అధ్యయనం చేసిన విద్యావేత్తవు. నాకు చాలా కాలంగా ఒక సందేహం ఉంది. దాన్ని నీకు మన ప్రయాణ బడలిక తెలియకుండా ‘నిజాయితీ తెచ్చిన బహుమతి’ అనే కథ రూపంలో చెపుతాను విను” అంటూ చెప్పసాగాడు.
***
అమరావతి రాజ్యంలో ఖజానా నిర్వాహకుడి పదవికి అర్హతతో పాటు నిజాయితీ కలిగిన వ్యక్తిని నియమించే బాధ్యత రాజు చంద్రసేనుడు మంత్రి సుబుద్ధికి అప్పగించాడు. అందుకు సరిపడా అర్హతలు ఉన్న ఇద్దరు యువకులు వచ్చారు, వారిలో నిజాయితీపరుడైన వారిని ఎంపిక చేయడానికి మంత్రి వారితో మాట్లాడుతున్న సమయంలో, ఓ యువకుడు వచ్చి “అయ్యా నేను రత్నం శెట్టి గారి అబ్బాయిని, నాన్నగారు పోయిన వారం మీ వద్ద రెండువేల వరహాలు తీసుకున్నారట. అవి తిరిగి మీకు ఇచ్చిరమ్మన్నారు” అని, రెండు వరహాల మూటలు అందించి “ఒక్కో మూటలో వేయి వరహాలు ఉన్నాయి, లెక్కించండి” అన్నాడు.
“లెక్కించే సమయం లేదు, నువ్వు వెళ్ళిరా” అన్నాడు మంత్రి. ఆ యువకుడు వెళ్ళి పోయాడు.
“నాయనలారా నేను రాజుగారిని అవసరంగా కలవాలి, నేను వెళ్లి వస్తాను. ఈలోపు మీకు భోజనం ఇక్కడే ఏర్పాటు చేస్తాను. మీ ఇరువురు భోజనానంతరం ఈ మూటలోని వరహాలు సరిగ్గా ఉన్నవో లేవో లెక్కచూసి నాకు సాయంత్రం అప్పగించండి. మీకు గదులు కేటాయించాను. మీ మీ గది లోనికే భోజనం వస్తుంది వెళ్లండి” అని చెప్పి, “ఉద్యోగ విషయం తరువాత మాట్లాడతాను” అని చెరి ఒక వరహాల మూట అందించి మంత్రి రాజసభకు వెళ్ళాడు.
భోజనానంతరం ఇద్దరు యువకులు కొంతసేపటి తరువాత వారి గదులలో వరహాల మూటలు లెక్కించారు. సాయంత్రం వచ్చిన మంత్రిని కలసి తమకు ఇచ్చిన వరహాల మూట అందించి “సరిపోయాయి, వేయి వరహాలు ఉన్నాయి” అన్నాడు మొదటి యువకుడు.
రెండో యువకుడు తన చేతిలోని వరహాల మూట మంత్రి చేతికి అందిస్తూ “ఇందులో రెండు వరహాలు ఎక్కువ ఉన్నాయి” అన్నాడు.
రెండో యువకుని చేతిలోని వరహాల మూట అందుకుంటూ “నాయనా, రేపటి నుండి నీవు కోశాధికారి పనిలో చేరు” అన్నాడు మంత్రి.
కథ చెప్పడం పూర్తి చేసిన బేతాళుడు, “విక్రమార్క మహారాజా, మంత్రి ఇద్దరిని పరీక్షించి మెదటి యువకుని కాదని రెండో యువకుడే నిజాయితీపరుడని ఎలా నిర్ణయించి కోశాధిపతి పదవి అప్పగించాడు? సమాధానం తెలిసి నిజం చెప్పక పోయావో తలపగిలి మరణిస్తావు” అన్నాడు.
“బేతాళా, మంత్రి చాలా తెలివిగా వారి నిజాయితీ పరీక్షించాడు. ముందుగా తను ఏర్పాటు చేసిన మనిషి ద్వారా ఒక్కో వరహాల మూటలో వేయి రెండు వరహాలు పెట్టించాడు. ఇరువురు యువకులను లెక్కించే పని అప్పగించినప్పుడు మెదటి యువకుడు ఎక్కువగా ఉన్న రెండు వరహాలను తను తీసుకుని వేయి వరహాలు మూటకట్టి మంత్రికి అందించాడు. రెండో యువకుడు వరహాలు లెక్కించి ఎక్కువ వచ్చిన వరహాలతో సహా మంత్రికి లెక్క చెప్పి తన నిజాయితీని చాటుకున్నాడు. అందుకే కోశాధికారి పదవి అతనికి లభించింది. అంటే నిజాయితీకి బహుమతి లభించింది” అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కునికి సమాధానం విన్న బేతాళుడు శవంతో సహా మరలా చెట్టుపైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.
రచనలతో పాటు సంఘసేవకుడిగా ప్రసిద్ధిచెందిన బెల్లంకొండ నాగేశ్వరరావు 12-05-1954 నాడు గుంటూరులో జన్మించారు. వీరి నాలుగు వందలకు పైగా రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రేతర బాలసాహితీవేత్తగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన నాగేశ్వరరావుకి రావూరి భరధ్వాజ స్మారక తొలి పురస్కారం లభించింది. చెన్నైలో తెలుగులో చదివే బాలబాలికలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మహతి-68
అక్కినేనితో అద్భుత స్నేహం
కాలంతోబాటు మారాలి – 12
అత్తగారు.. అమెరికా యాత్ర 14
సమాజం ఎటు పోతున్నది
కాయిలా
‘సిరికోన’ చర్చాకదంబం-6
శ్రీపర్వతం-64
లోకల్ క్లాసిక్స్ – 39: ఏది స్వేచ్ఛ? ఎక్కడ శాంతి?
కొరియానం – A Journey Through Korean Cinema-61
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®