బాల అందమైన ఏడేళ్ళ పాప. అందమైనదే కాదు, తెలివైనది కూడా. వయస్సు రీత్యా కొంత అమాయకత్వమూ ఉంది. అన్నీ తనకు తెలుసుననుకుంటుంది. అంతే కాదు, అన్నిటి లోనూ తల దూర్చి అందరికీ సలహాలు కూడా ఇస్తుంది. ఆ బాల చేసిన పనుల్లో కొన్ని కథల్లాగా చెప్పచ్చు. అందులో ఇది ఒకటి.
బాల వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. స్థలం కూడా ఎక్కువ ఉంది. పెరడు ఎక్కువ ఉండటం వల్ల నయితేనేమి, మొక్కలపై ప్రేమ వల్ల అయితేనేమి, ఉమ్మడి కుటుంబం కావట౦ వల్ల ఖర్చు కూడా కలిసి వస్తుందనే కారణం వల్ల అయితేనేమి, ఇంటిలో అన్నిరకాల మొక్కలు వేసారు. పూల మొక్కలు, కూరల పాదులు, పండ్ల చెట్లు అన్నీ ఉన్నాయి. అయితే ప్రతి పని లోను ఎన్ని లాభాలున్నా, కొంచమైనా కష్టం కూడా ఉంటుంది కదా.. ముఖ్యమైన చెత్త సమస్య పక్కన ఉంచితే, పూలు కావాలన్నా, కూరలు అయిపోయి తెచ్చే లోపల అతిథులు వచ్చినా, అనారోగ్యముతో ఉండి పళ్ళు కొనలేక పోయినా గుర్తు వచ్చేది బాలా త్రిపుర సుందరే. అంటే బాల నాయనమ్మ ఇల్లే. ఆమె పేరే కుదించి బాలకి పెట్టారు.
ఎక్కువగా వచ్చేటప్పుడు బాలమ్మ గారు (నాయనమ్మ) ఎలానూ పంచి పెడతారు. అమ్ముకోవటం అలవాటు లేదు, అవసరమూ లేదు. నాయనమ్మ మాట కరుకు గానీ మనస్సు మంచిది. ఎవరు ఏది లేదన్నా, కావాలన్నా, వెంటనే సాయం అందిస్తుంది. ఇవనే కాదు ఏదైనా. ముఖ్యముగా ఎదుటి వాళ్ళు ఆర్థిక సమస్యల్లో ఉంటే ఇంకా ఎక్కువ సాయం చేస్తుంది.
ఒక్కోసారి ఇంటిలో వాళ్ళు చికాకు పడతారు వేళా పాళా లేని వారి రాక పోకలతో, దాన ధర్మాలతో… ఎందుకంటే ఒక్కోసారి మంచి పనివేళ వస్తారు. కావలసింది అడిగి, తీసుకుని వెంటనే వెళ్లరు, నానమ్మని పొగడటమో లేక ఊరి ముచ్చట్లు చెప్పడమో చేసేవారు. దానితో ఇంటిలో వారికి పని దండగ అయేది.
అందుకని ఇంటిలో వాళ్ళు విసుక్కుంటే “పోనీ లెండి రా. ఏదైనా పంచి తినాలి. అప్పుడే పుణ్య౦, పురుషార్థం” అంటుంది.
ఒకసారి బాల ఇంటికి వచ్చేసరికి నాన్నమ్మ బాబాయిని కోప్పడుతో౦ది. “ఏదైనా పంచి తిను, అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ జన్మలో పంచి తింటేనే మళ్ళీ జన్మలో తినటానికి దొరుకుటుంది. అయినా మనమేమయినా కొని ఇస్తున్నామా. ఇంటి లోవే కదా” అంటోంది బామ్మ.
నాన్నమ్మ కోపం చూసి బాబాయి ఇంక మాట్లాడలేదు.
ఆ రోజు ఆదివారం. బాల తండ్రిని “ఈ పంచి పాతదేనా? తీసుకోనా” అని అడిగింది.
“తీసికో” అన్నాడు. తల్లో, భార్యో అడిగి ఉంటారు. పాత గుడ్డలకి అనుకున్నాడు.
దొడ్డిలో అరుగు మీద కూర్చుని కత్తెరతో పంచి ముక్కలు చేస్తున్న బాలని చూసి “ఎందుకే ఆ పంచె అలా చింపి తగలేస్తున్నావ్. అలా ఉంచితే ఒళ్ళు తుడుచు కోవటానికో లేక ఇంటి శుభ్రానికో పనికొస్తుంది కదా” కోపంగా అంది బాల అమ్మ.
“మరి కత్తిరించక పొతే ఎలా తింటాము. కష్టం కదా” అంది తలెత్తకుండానే.
“పంచి తినడం ఏమిటి? ఎవరైనా తింటారా? పిచ్చి గానీ పట్టిందా” అంది అమ్మ.
“ఏమో. నానమ్మ చెబుతోందిగా మొన్న బాబాయ్‌తో, ఏదైనా ‘పంచి’ తినాలి అని. అప్పుడే తినటానికి దొరుకుతు౦ది మళ్ళీ జన్మలో అని అంది. మరి తిండి అందరికీ కావాలి కదా!అందుకే చిన్న చిన్న ముక్కలు చేస్తున్నా, అందరికీ తినటం కొంచెం సులభం కదా”.
శ్రీమతి ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారు ప్రముఖ రచయిత్రి, కవయిత్రి. ముఖ్యముగా బాల సాహితీవేత్త. వీరు కేంద్ర ప్రభుత్వ శాఖ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సుబ్బలక్ష్మి గారి కథలు మహారాష్ట్ర వారి టెక్స్ట్ బుక్స్‌లో, తెలుగు వాచకములలో 7 వ, 9వ తరగతులకు పాఠ్యాంశములుగా (lessons) తీసుకొనబడినవి. వీరు భారత్ భాషా భూషణ్, లేడీ లెజెండ్, సాహిత్య శ్రీ, ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ, సావిత్రి బాయ్ పూలే స్త్రీ శక్తి అవార్డులు, బాల సాహితీ రత్న, బాలసాహిత్య శిరోమణి మొదలయిన అనేక బిరుదులు పొందారు. వీరి కొన్ని కథలు తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్లలో అనువాదం చేయబడినవి. ఆకెళ్ల అసోసియేషన్, బాలగోకులం సంస్థలు స్థాపించి, రచయితలను,బాలలను గౌరవించి, ప్రోత్సహిస్తున్నారు. రేడియోలో బాలల, కార్మికుల, స్త్రీల కార్యక్రమాల్లో రచించి పాల్గొంటారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కలబెట్టు
ఆంతర్యాలు – అనుబంధాలు
నూతన పదసంచిక-89
అందిన ఆనందం
సినిమా క్విజ్-78
మేరే దిల్ మె ఆజ్ క్యా హై-14
ప్రమాద ఘంటికలు
ఓ గగనమా
కొడిగట్టిన దీపాలు-1
వారెవ్వా!-46
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®