సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డి. చంద్రశేఖర్ గారి స్పందన: * ఎక్స్‌లెంట్. 👍🏼👏🏼👌🏼🙏🏼💐 హిందీ, ఇంగ్లీషు పౌరాణికాల గురించి ఇతర భాషల వాటి గురించీ మీరన్నది అక్షర సత్యం.. నాకు నచ్చింది. మోజెస్ రామ్సేసే ల నడుమ పద్యాలను ఊహించుకుని తెగ నవ్వుకున్నాను. జితేంద్ర రాముడిగా.. అబ్బ యమ యాతన! 👍🏼😊🙏🏼💐

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    “భక్త ప్రహ్లాద” చిత్రం లోని పాటల చిత్రీకరణ గురించి చాలా వివరంగా తెలియజేశారు. మీరన్నట్లు కెమెరా యాంగిల్స్ వల్ల, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ప్రేక్షకుడు సన్నివేశంలో, పాత్రతో మమేకమైపోతాడు. ….వివరణ బాగుంది. మీరు వివరించిన సన్నివేశాల్లో రోజారమణి చాలా బాగా నటించింది అనటం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఒక్క క్షణం వాస్తవం ఆలోచిస్తే…అప్పుడు ఆ పాపకు అయిదేళ్ళు. అ, ఆ లు నేర్చుకునే వయసులో సంస్కృత సమాస బంధురమైన సంభాషణలను చూసి అయినా చదవగలదా! ఆ ప్రతిభ అంతా ఆమె చేత అలా నటింపజేసిన డైలాగ్ కోచ్ ది, డైరక్టర్ దీ!వారిద్దరి శ్రమ ఫలితం ప్రహ్లాదుడి పాత్ర……….నరసింహావతారం ఆధారంగా వచ్చిన మరొక గొప్ప చిత్రం “చెంచులక్ష్మి”. అందులోనూ హిరణ్యకశిపుడు గా యస్.వి.ఆర్. గారే నటించారు. ప్రహ్లాదుడు గా మాస్టర్ బాబ్జీ నటించాడు.

  3. 3

    గోనుగుంట మురళీకృష్ణ

    పౌరాణిక చిత్రంలోని పద్యాలు తెలుగు భాషలోనే కనబడుతాయి. ఇతర భాషల్లో ఉండవు. ఎందుకంటే పద్యం అనేది తెలుగువారి స్వంతం. ఒకప్పుడు గేదెలను కాచుకునే కుర్రవాళ్ళు కూడా హరిశ్చంద్ర నాటకంలోని “భక్తయోగ పదన్యాసి వారణాసి…..”, కురుక్షేత్రం లోని “బావా ఎప్పుడు వచ్చితీవు….” వంటి పద్యాలు అవలీలగా పాడేవారు. పద్యాల కోసమే తెల్లవార్లూ మేలుకుని కుర్చుని, ఒక్కొక్క పద్యం వన్స్ మోర్ అని అరుస్తూ రెండుమూడు సార్లు పాడించుకుని తనివితీరా వినేవారు. నాటకం అయిపోయేసరికి తెల్లగా తెల్లవారిపోయేది.

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. పి. సుశీలమ్మ గారి వ్యాఖ్య: *ఇటీవల మహా నరసింహ యానిమేషన్ సినిమా బాగుంది. కానీ పోతన పద్యాలు లేకపోవడం చాల లోటుగా అనిపించింది. అనేక భాషల్లో తీయడం వల్ల తెలుగు పద్యాలు పెట్టలేదేమో కానీ నాకైతే కొన్నిచోట్ల పేలవంగా అనిపించింది.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య: *మంచి విశ్లేషణ. పురాణేతిహాసాలు చిత్రాలుగా మలచడం తెలుగు వారికే తెలిసిన విద్య. ఆ రోజుల్లో టెక్నాలజీ తక్కువే అయినా చాలా నమ్మశక్యంగా చిత్రించిన భక్త ప్రహ్లాద గురించి బాగా వివరించారు. పద్యాలు, పాటలు పురాణ చిత్రాలకు ఆయువుపట్టు.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాయపెద్ది అప్పా శేష శాస్త్రి గారి వ్యాఖ్య: * మీ విశ్లేషణ అద్భుతంగా ఉందండి. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: *ఈ శీర్షికన ఈ వారం ప్రచురించిన ‘భక్త ప్రహ్లాద’ సినిమా లోని ‘జీవము నీవే కదా దేవా’ పాట ప్రతిరోజూ నేను నిద్ర లేవగానే వినే భక్తి గీతాల్లో ఒకటి. ఆ దేవదేవుని లీలామృత విశేషాలు ఇంత గొప్పగా చాటి చెప్పిన సినిమా మరొకటి లేదు అనడంలో ఆశ్చర్యం లేదు. మొన్న వచ్చిన ‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ సినిమాను తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. కానీ, భక్త ప్రహ్లాద ముందు మాత్రం అది దిగదుడుపే.
    మన తెలుగువారికి మాత్రమే స్వంతం అయిన పద్యాలు, పాటలు వింటూ ఉంటే, తెలుగునేలలో పుట్టడం ఏ పూర్వజన్మ సుకృతమో అనిపిస్తుంది.
    ముద్దులు మూటగట్టే పసివాడు ప్రహ్లాదుని పాత్రలో రోజారమణి, స్పష్టంగా తెలుగు, (అందునా సంస్కృత పదాలు కలిసిన తెలుగు) మాట్లాడటమే కాక , పాటలకు ముఖ కవళికలు చక్కగా ప్రదర్శించి తనకి తానే సాటి అనిపించుకుంది. రచయిత చెప్పినట్లు టెన్ కమెండ్మెంట్స్, బెన్ హర్ సినిమాల్లో… సరైన పాట నో పద్యమో పడి ఉంటే నిజంగా భలే ఉండేది. గ్రీకు పురాణ గాథ ‘హెలెన్ ఆఫ్ ట్రాయ్’ లో కూడా ఎంత మంచి పాటలు పెట్టీ ఉండొచ్చు!!

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నలగడ్డ శ్యామల గారి వ్యాఖ్య: *నమస్తే! శివశంకరీ.. పాట నిజంగా ఓ అద్భుతం. విలువైన విశ్లేషణ.. మరికొన్ని గొప్ప హిందీ పాటలను కూడా వివరంగా పరిచయం చేయడం.. సినీ గీతాల ప్రేమికులకు మీ కాలమ్ ఓ పండుగే. అభినందనలు. 💐👏🏻

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి భైరవజోశ్యులు గారి వ్యాఖ్య: *నా చిన్నప్పుడు భక్త ప్రహ్లాద సినిమా ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు. ఈ పాటలన్నీ నోటికి వచ్చేవి. ఏ ఆపద వచ్చినా, ఈ సినిమాలోని పాటలే పాడుకునేదాన్ని. సుశీల కంఠంలోని మాధుర్యం ఎవరి గొంతులోనూ లేదు. ఆ సినిమా ఇప్పటికీ కళ్లకు కట్టినట్టు ఉంది. S.V రంగారావు గారి గాంభీర్యం, అంజలీదేవి గారి తల్లిప్రేమ.. అద్భుతం.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె.మణి గారి వ్యాఖ్య: *భక్త ప్రహల్లాద చిత్రం లోని జీవము నీవే కదా అనే పాటపై చాలా చక్కగా వివరించారండి. రచయితకు అభినందనలు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!