సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    పి. దినకర్ రెడ్డి

    చక్కని విశేషాలు అందిస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గురించి కూడా మాట్లాడాలి. Casual Relationships ఎక్కువగా కనిపించే హాలీవుడ్ సినిమాలను, శరీరం ఒకరిదే అని భావించే పాత్రలు కనిపించే భారతీయ సినిమాను మనం పూర్తిగా అన్ని విషయాల్లో పోల్చి చూడలేము.
    ఎవరి హింసా ప్రవృత్తి వాళ్ళది..ఎవరి చిత్రణ వాళ్ళది. నేను హింసను ప్రోత్సహించడం లేదు. కానీ ఎక్కడ అన్నీ తొందరగా normalise అనిపిస్తాయి అనేది ప్రేక్షకుని మీద ఆధారపడే ఉంటుంది. ఇక నేపథ్య సంగీతం విషయానికి వస్తే హారర్ సినిమాల అడ్రినలిన్ ఎక్కేది ఆ శబ్దాల నుంచే కదా. మరిన్ని విషయాలు మీ వ్యాసాల నుండి తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాతిరాజు గారి వ్యాఖ్య: *మనోహర దృశ్యాలు బావుంది. సంగీత పరంగా హిట్ అయిన సినిమాలు తెలుగు లో అనేకం ఉన్నాయి. ఒక శంకరాభరణం ఒక ఊపు ఊపింది. ముఖ్యంగా విశ్వనాథ్, బాపుల సినిమాలలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కేవలం పాటలే కాకుండా నేపథ్య సంగీతం కూడా బావుంటుంది.
    మంచి శీర్షిక. కొనసాగించండి.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గొర్తి సాయి బ్రహ్మనాదం గారి స్పందన: చదివాను. ఏవేవో రాసారు కానీ, అస్సలు depth లేదు. పాత సినిమాల్లో పాటలు గురించి బోలెడు వ్యాసాలు వచ్చాయి – ముఖ్యంగా హిందీ సినిమాల పైన. సినిమా సంగీతం అంటే పాటలొకటే కాదు.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చిర్రావూరు రామకృష్ణ గారి స్పందన: * యతి జత పడి శ్రావ్యంగా ఉందండి.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కృష్ణకుమారి గారి స్పందన: బాగుంది. దాదాపుగా అన్ని కోణాల్లో స్పష్టం గా చెప్పారు. అభినందనలు 👏👏👏*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కస్తూరి రాజశేఖర్ గారి వ్యాఖ్య: *ఎలాంటి శ్లేషలూ లేకుండా చాలా విశ్లేషణాత్మకంగా ఉంది. ఇంత క్లుప్తంగా, కానీ విపులంగా నేను ఇప్పటివరకు ఈ అంశం మీద చదవలేదు. 💐*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Dr Revuru Anantapadmanabha Rao: *Interesting and informative. New approach and analysis. The way it was narrated is exemplary. Readers are benefited with new dimensions.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వెంకటేశ్వర శర్మ గారి స్పందన: * చాలా బాగుంది. రాబోయే ఎపిసోడ్ కోసం వెయిటింగ్.👍*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Sujatha garu: *Great work on the sound of music sir. Kudos.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బిందుమాధవి గారి స్పందన: *శీర్షిక చాలా లోతైనది.. విస్తారమైనది. అన్ని భాషల చిత్రాల పైన, అన్ని రకాల సంగీత సంప్రదాయాల మీద పట్టు ఉండాలి. మన పాత చిత్రాలలో పాటలకి నేపధ్యం అనేక రకాల కళా రూపాలని.. పొలం పనులు చేసుకుంటూ అలసట తెలియకుండా ఒకటి, వీధి నాట్యం రూపంలో.. సాయంత్రపు కాలక్షేపంగా సేదతీరటానికి (తోడికోడళ్ళు).. జానపదం (ఏరువాకా సాగారో, ఓ రంగయో పూల రంగయో) జీవిత సత్యాలు (టౌను పక్కకెళ్ళద్దురా డింగరీ) బుర్రకథలు (పాత పూలరంగడు) హరికథలు (షావుకారు).. ఇలా.*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా ప్రసాద్ గారి స్పందన: *అత్యద్భుతంగా వివరించారు. కథనంతో బాటు థీమ్ మ్యూజిక్ బిట్స్‍ని కూడా జతపరచడం మరింత లోతుగా కథనాన్ని పరిశీలించడానికి ఉపయోగపడింది. కొన్ని సినిమాలకి వాటి నేపథ్య సంగీతం బలం. పాటలతో బాటు నేపథ్య సంగీతం కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. మన తెలుగు, హిందీ చిత్రాల్లో పాటలు సన్నివేశం మరింత రక్తి కట్టడానికి ఉపయోగ పడడం చూస్తాము. మంచి విశ్లేషణగా చెప్పచ్చు.👏👏*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మణి కోపల్లె గారి వ్యాఖ్య: *బాగుంది కొత్త శీర్షిక. సినిమా హిట్ అయినా ఫర్ అయినా పాటలే కారణం. ఉదా మల్లీశ్వరి ఇప్పటికీ అజరామరం. నిలిచి ఉండే సినిమా. పాటలు బాలేక ఎక్కేవ ఆడని సినిమాలు వున్నాయి.
    ఒక దశకంలో అన్నీ మసాలా సినిమాలు, క్రైమ్ క్లబ్ పాటలతో పాటు ఒకరకమైన పాటలే వచ్చి ఆ తరువాత మార్పు చెందాయి అనే చెప్పొచ్చు. అలాంటి పాటలు తాత్కాలంగా విజయం సాధించినా ఆ తరువాత మరుగున పడిపోతాయి.
    నేను పథేర్ పాంచాలి చూసాను. ఏ హంగులు లేని సహజంగా తీసిన సినిమా. ఎంతో హిట్ అయింది దేశమంతటా. మా తెలుగు నాట కూడా హిట్టే.
    ఆ రోజుల్లో మీడియాతో పాటు mouth publicty కూడా ఉండేది.
    ముఖ్యంగా లవకుశ పద్యాలు ఎంత హాయిగా ఉంటాయో. పాటలు పద్యాలు సంగీతం (back ground music) చెర విజయానికి ఎంతో దోహద పడతాయి.
    ఇక ఆంగ్ల చిత్రాల్లో background music కి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ది గాడ్ ఫాదర్ లా ఒకే సంగీతం వినిపించే ఆంగ్ల సినిమా పిల్లల్లూ గుర్తు పట్టే మ్యూజిక్ “జేమ్స్ బాండ్” మూవీస్.
    ఆ చిత్రాల థీమ్, సంగీతం హీరో, కథ, కథను నడిపించే తీరు ఇప్పటికీ ప్రజలు చూసే సినిమాలు అవి.
    వ్యాసంలో చెప్పినట్లు కాలం మారింది. ప్రజల దృక్పథమూ మారింది. మొదటి జేమ్స్ బాండ్ చిత్రాల హీరో ని ఆదరించినట్లు ఈ శతాబ్ది జేమ్స్ బాండ్ చిత్రాలు అంతగా ప్రజాదరణ పొందలేదేమో అని నా కనిపిస్తుంది. మళ్లీ అదే సంగీతం.
    ఈ ఆర్టికల్ రాయడానికి రచయిత (లు) చాలా కృషి చేసారు. ఎంతో పరిశోధన చేస్తేనే కానీ ఇంత చక్కటి వ్యాసం ఆవిష్కృతం కాదు. వారికి నా అభినందనలు. 👏🏻👏🏻👌👌🙏🙏*

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుధాకర్ గారి స్పందన: *ఏది ఏమైనా తెలుగు సినిమాలలోని సంగీతం దిగజారిందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సినిమాలన్నింటిలోనూ కుర్ర కారుని రెచ్చగొట్టేలా బూతు సాహిత్యాన్ని కూడా చొప్పించారు. ఉ అంటావా ఉ ఊ అంటావా అంటూ వస్తున్నటువంటి పాటలు పిల్లలతో కలిసి చూడలేనటువంటి సినిమాలు వస్తున్నందుకు మన తెలుగువారి దౌర్భాగ్యం అని భావించాలేమో.*

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కమల్ రెడ్డి గారి స్పందన: *మంచి bgm పడితే ఒక సన్నివేశం ఎలివేషన్ రెట్టింపు అవుతుంది.
    అగరొత్తి వాసన లాగా చాలా కాలం మనల్ని ఆ నేపథ్య సంగీతం వెంటాడుతుంది. ఒక్కోసారి నేపథ్య సంగీతం విన్న వెంటనే సన్నివేశం గుర్తుకు వస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
    సినిమా జీవన కాలం తక్కువ కావచ్చు కానీ పాట బాగుంటే ఆ పాట అమృతం తాగినట్టు మరణం లేనిదిగా ఒక తరం నుంచి ఇంకో తరానికి అందుతూనే ఉంటుంది.
    ఈ వ్యాసంలో పాటలు నేపథ్య సంగీతం గురించిన విశ్లేషణ చక్కగా ఉంది.*

    Reply
  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి స్పందన: *చాలా విస్తృతమైన విషయం.. ఒక వ్యాసంలో ఇమిడేది కాదు.. అయినా మీ అద్భుతమైన పరిశీలనతో ముఖ్యంశాలను స్పృశించారు.. మీరూ లేవనెత్తిన అంశాలు సత్యం.. హాలీవుడ్ మూవీస్‌కి మన మూవీస్‌కి బేసిక్‌గా అంతరాలున్నాయి.. మనది కలగూర గంప.. నవరసాలు పండాలనుకుంటారు మన సంప్రదాయ ప్రేక్షకులు.. ఏదేమైనా పాట ఒక రసానుభూతిని మిగిల్చే అమరత్వం.. 💐💐*

    Reply
  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నలగడ్డ భారతి గారి వ్యాఖ్య: *మంచి శీర్షిక మొదలు పెట్టారు. మన సినిమాలకి పాశ్చాత్య సినిమాలకి అభివ్యక్తిలో ఉన్న తేడా చక్కగా చెప్పారు. వాళ్ల సినిమా లలో నేపథ్య సంగీతం ప్రాధాన్యత గురించీ ఇలా చాలా విషయాలు తెలిసాయి. మంచి ఆర్టికల్ చదివించారు థాంక్యూ 🙂 *

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®