సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కలకత్తా నగరాన్ని వర్ణించె పాట చిత్రీకరణ గురించి, భావం గురించి మీరు చెప్పిన విధానం బాగుంది. ఎడారి లో ఒయాసిస్ లా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలాంటి మంచి పాటలు వస్తాయి. సందర్భం కుదిరితే కవి కలం కదం తొక్కుతుంది. “సాగర సంగమం” లో “ఓం నమశ్శివాయ….” పాట విన్నప్పుడు కూడా నాకు ఇలాంటి అభిప్రాయమే కలిగింది .

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విహారి గారి స్పందన:*🙏👌✌️👍✌️👌🙏ఎంత బాగుందో మీ విశ్లేషణ! మీరన్నట్టు వేటూరికి మనం తగినంత గౌరవం ఇవ్వటం లేదు. సిరివెన్నెలతో మరుగున పెట్టారేమో! ఏ సినిమా చూసినా ‘కొన్ని’ పాటలు అద్భుతం కదా! మేఘసందేశం!!! మీ వెర్సాటాలిటీ కి జోహారు. (ఈ ఇంగ్లీష్ పదానికి తెలుగుని సృష్టించండి నా కోసం! బహుముఖీన అనే అరిగిపోయిన పదం కాకుండా!) *

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీ లక్ష్మిగారి వ్యాఖ్య: *యమహానగరి గురించి ఎంత బాగా వివరంగా రాసారో ! ఇంత లోతుగా ప్రతీ పదం మేం వినలేదు. చాలా చక్కగా ఉంది పాట. సాహిత్యం, సంగీతం, వాయిస్ అన్నీ కలిసిన అద్భుతమైన పాట గురించి చెప్పిన మీకు అనేక ధన్యవాదాలు.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి స్పందన: *”యమహాపురి.. కలకత్తా నగరి” పాట ఆద్యంతం వేటూరి వారి అలతి అలతి పదాలతో ఆ మహా నగరాన్ని కవితాత్మకంగా మన కళ్ళముందు నిలిపింది. శంతనూ.. శర్మిష్టలు మరింత సొబగులద్ది.. అందించారు. మాటల్లేవు. వారికి, సంచిక వారికీ ధన్యవాదాలు.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అశ్విని కుమార్ గారి వ్యాఖ్య: * చాలా చక్కని – చిక్కని శీర్షిక మురళీ కృష్ణ గారూ..! శంతనూ శర్మిష్ట గారు (వారొక్కరేనా ఇద్దరా.. తెలియదు) చాలా సమర్ధవంతంగా, ఆసక్తికరంగా, బహుభాషా సినీ గీత సమాహారం గా నిర్వహిస్తున్నారు. వారికి నా ప్రత్యేక అభినందనలు. Karz సినిమా లోని “Dard -e-Dil” పాటను వారు సమీక్షిస్తే చదవాలని ఉంది.
    ఆ పాటలో గీత రచయిత చాతుర్యం, సంగీత దర్శకుని స్వర మాధుర్యం, నటీనటుల హావభావాలు, దర్శకత్వ ప్రతిభ, కెమెరామాన్ చాకచక్యం close-ups, long-shots అన్నీ కలిసి ప్రేక్షకులకు కనువిందు, వీనుల విందు చేశాయి.. అని నాకనిపించింది.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణి గారి వ్యాఖ్య: *యమహా నగరి పాటలో కలకత్తా నగరాన్ని చూపించారు. అంతకుముందే వెస్ట్ బెంగాల్ నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన మాకు ఆ ప్రదేశాలన్నీ మళ్ళీ తిరిగినట్టనిపించింది. శిలలపై శిల్పాలు పాటలో హంపీ గురించి, ఇదే చంద్రగిరి అంటూ చంద్రగిరి వైభవాన్ని, మహాబలిపురం పాటలో అక్కడి శిల్ప సంపదనూ మా కళ్ళకు కట్టినట్టు చూపించారు. శంతను శర్మిష్ఠ గారు మాకు ప్రతివారం పాత తెలుగు, హిందీ పాటల గురించి విందు భోజనం పెడుతున్నందుకు ధన్యవాదాలు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!