సంచికలో తాజాగా

Related Articles

17 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యక్కలూరి శ్రీనివాస్ గారి వ్యాఖ్య: *పియానో వాయిస్తూ పాటలు పాడే సన్నివేశసంగీతంలో పియానో మెట్లు ఎక్కి దిగే వేళ్ళు కనిపిస్తాయ్ కానీ పియానో సంగీతం వినిపించదు.. సునిశితమైన సంగీత పరిశీలన.. 👌👌👌💐🌺🌺🌹*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్య: *పాటల పట్టాభిషేకం చేస్తున్న మీకు హృదయపూర్వక అభినందనలు 💐*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎలనాగ గారి వ్యాఖ్య: *వ్యాసం బాగుంది. “కణస్వరం” గురించి కూడా మాట్లాడారంటే మీకు సంగీతం తెలుసునని నమ్మవచ్చు. అభినందనలు. పాత సినిమాలలో, పియానో లాగే బిలియర్డ్స్ ఆటను కూడా తరచుగా చూపించేవారు – ముఖ్యంగా హిందీ సినిమాలలో.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇవిబి సత్యనారాయణ గారి వ్యాఖ్య: *”వలపు తోటలో” అని మొదలు పెట్టి చెప్పిన వన్నీ చదివాక గానీ ఆ పాట్ లోని సౌందర్యం గ్రహింపుకి రా(లే)దు. ఆ వీడియో చూసాక ఆ భావం ద్విగుణీకృతమైంది. అద్భుతమైన విశ్లేషణ సుమండీ. 🙏*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సురేఖ పులి గారి వ్యాఖ్య: *మధురమైన శీర్షిక. అలాగే మరో రెండు పాటలు గుర్తు కొచ్చాయి: (1) ఈ రోజు మంచి రోజు మరపు రానిది మధురమైనది.. చిత్రం ప్రేమ లేఖలు. (2) భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే.. చిత్రం జరిగిన కథ. 🤝*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. EVB Satyanarayana: *I loved the scene in this video of ANARI – sab kuch seekha humne “PYAAR KAA RANG UTARTE DEKHA”. You started my day Sir. Thank you so much for sharing.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నిరంజన్ గారి వ్యాఖ్య: *ఎప్పుడూ టెన్షన్ ఉండే మనుషులకు/మనసులకు ఒక ఐ.వి.ఫ్లూయిడ్ ఈ శీర్షిక*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య: *బాగా వర్ణించారు. ఆ పియానో వాయించడం తెలియకపోయినా నటీనటులు గొప్పగా నటించి మెప్పించేవారు. హృదయం లోని బాధని పియానో మీద పలికించినట్లే, హీరో తన హావభావాలతో మేళవించి సంగీత దర్శకుడు చేసిన స్వరానికి న్యాయం చేయడం మరువలేము.👏*

    Reply
  9. 9

    గోనుగుంట మురళీకృష్ణ

    తెలుగు సినిమాల్లో పియానో పాటల గురించి చాలా బాగా వివరించారు. మీ పరిశీలనా శక్తికి, అవగాహనకు అభినందనలు. సాధారణ ప్రేక్షకుడికి పియానో ప్లే చేయటం తెలియదు కాబట్టి, ఎక్కువగా పాత్రధారుల భావ వ్యక్తీకరణ నే చూపించేవారు. పగలే వెన్నెల… పాటలో జమున పొడవాటి అందమైన వేళ్ళు (ladies fingers అంటారు ఇందుకేనేమో!) పియానో మెట్ల మీద చిందులు తొక్కుతున్నట్లు అనిపిస్తాయి. చాలా అలవోకగా వాయిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంకా రక్త సంబంధం, నేనూ మనిషినే, చదువుకున్న అమ్మాయిలు వంటి చాలా చిత్రాల్లో పియానో పాటలు ఉన్నాయి. వేరైటీ సబ్జెక్ట్ తీసుకున్నారు.

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వారణాసి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *చలనచిత్రాల్లో చక్కని సాహిత్యం దానికి తగిన సంగీతం ఉన్న మనోహర గీతాలకు అద్భుతమైన చిత్రీకరణ తోడైతే ఆ సంయోగం ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో తెలియచెప్పే మీ శీర్షిక చాలా బాగుందండి!*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కోవెల సంతోష్ కుమార్ వ్యాఖ్య: *గులాబీ పువ్వంత సున్నితంగా ఉంది.. పియానో పాట.*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జయసూర్య గారి వ్యాఖ్య: *బాగుంది.. కానీ ‘నా హృదయంలో..’ పాట లోని మంచి సాహిత్యాన్ని మెచ్చుకుంటూనే ఆ గీతాన్ని అంత మృదు మధురంగా సృజించిన ‘శ్రీశ్రీ’ ను పేర్కొనకపోవడం వింతగా ఉంది. అలాగే ‘ఓహో గులాబీ బాలా..’ పాట రచయిత పేరు చెప్పకపోవడం కూడా..*

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Krishnaveni chary garu: *Looks like much keen observation and a lot of research have gone into this column. Impressive 👍*

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కనాద గారి స్పందన:*నాయికా నాయక ఆంగికాభినయాల చర్చ పాటల నేపథ్యంలో జరగటం బాగుంది. ఈ పాటలకీ సంగీతానికీ ఉన్న సంబంధ చర్చ ఇంకా జరగటం అవసరమేమో చూడండి. ఈ సంగీతం ఒక రాగం ఆధారితం. ఆ సంగీతం ఒక సమయంలో పాడాలి . ఆ రాగ నాయిక భావాలు, వర్ణన అవి సినిమాల్లోకి రావాలా?, ఎంత వచ్చాయి, దాని వల్ల సొబగు పెరిగిందా? ఎట్లా అనేవి కూడా విచారించవచ్చునేమో చూడండి.
    ముఖ్యంగా పాటకి అభినయం దానిలోని మాటల అర్థాలతో జరుగుతుంది. ఉత్తమమైన చోట పాటలోని భావ వ్యక్తీకరణ జరుగుతుంది. రెంటి తేడాలు, భేదాలు కూడా విశదంగా చర్చించగలరేమో చూడండి.*

    Reply
  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. శాంతి నారాయణ గారి స్పందన: *పియానో నేపథ్యంగా మీరు పరిచయం చేసిన పాటలూ, ఆ సన్నివేశాలూ, సందర్భాలూ, మనస్సును మనోహరమైన జ్ఞాపకాల్లోకి , కాదుకాదు, మధురమైన స్వప్నలోకాల్లోకి తీసుకెళ్లి, వేసవితాపాన్ని చల్లబరిచాయి. ఈ పాటలన్నీ నాకు ప్రాణప్రదం! రకరకాల సమస్యలతో బరువయిపోయే హృదయాలకు గొప్ప సాంత్వన ఈ శీర్షిక. మనసారా అభినందనలు.*

    Reply
  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది త్రినాథరాజు గారి స్పందన: *అద్భుతం! ఆ గేయ రచయితలు మరియు నటీనటులు కూడా ఇంతగా ఆలోచించలేదేమో. తెరపై చూసాం కానీ వ్యాసకర్తల శోధన విశ్లేషణ తర్వాత. ..ఒక్కసారిగా నాణ్యతాపరంగా ఇంత ఉందానిపిస్తోంది. అభినందనలు 🙏

    Reply
  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణగారి వ్యాఖ్య: *సినిమాల్లో అటు తెలుగులో ఇటు హిందీలో పియానో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. గుర్తున్నంతవరకు మొదటి పియానో పాట తెలుగులో ఆరాధన చిత్రంలో”నా హృదయంలో నిదురించే చెలి” అనుకుంటాను.
    వ్యాసంలో పేర్కొన్న “ఓహో గులాబీ బాలా, జగమే మారినది, నా హృదయంలో నిదురించే చెలి ” మధురమైన పాటలు.
    “ఓహో గులాబీ బాలా” పాటలోని చరణాలు వివరించిన తీరు చాలా బావుంది.
    వ్యాసకర్త చెప్పినట్లు పి బి శ్రీనివాస్ కు రావలసినంత గుర్తింపు రాలేదు అనిపిస్తోంది.
    కన్నడిగులు అక్కున చేర్చుకున్నట్లు, తెలుగువారు అంతగా ఆదరించలేదు.
    అజరామరమైన గీతాలు అందిస్తున్న వ్యాసకర్తలకు, సంచిక పత్రికకు అనేక ధన్యవాదాలు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®