సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    రామరాజు కోసం ఎదురుచూస్తూ సీత పాడే ఈ పాట చూడకముందే భావం, చిత్రీకరణ, సందర్భం, స్వరకల్పన సర్వం అద్దంలో చూపించినట్లున్నది మీ వ్యాసం….సినిమా చూసేటప్పుడు ఈ పాట కోసం మన మనసులు మనకు తెలియకుండానే ఎదురుచూస్తూ ఉంటాయి..విజయనిర్మల ధరించిన సీత పాత్ర చిన్నదైనా గుర్తుండిపోతుంది…..”వెన్నెలలెంతగా విరిసిన గానీ చంద్రుణ్ణి విడిపోలేవు” అనేచోట మీ వివరణ బాగుంది. నిజమే! చంద్రుడు, వెన్నెల ది విడదీయరాని బంధం. ఒక సినిమాలో (వెలుగునీడలు) నాయకుడు అనారోగ్యంతో ఉండి, తనను మర్చిపోయి వేరే వ్యక్తిని వివాహం చేసుకోమని కోరతాడు ప్రేయసిని…”చంద్రుడు క్షీణిస్తున్నాడని వెన్నెల వేరే చోటు వెతుక్కుంటుందా?” అంటుంది ఆమె….

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. కళాగోపాల్ గారి వ్యాఖ్య: *మధురగీతాలు అద్భుతంగా అలరిస్తున్నాయి. పాట సాహిత్యం వివరణ చాలా బాగుంటుంది.
    పాత హిందీ పాటలు కూడా బాగుంటున్నాయి. ఈ మధ్య నేను ఎక్కువగా వింటూ సమ్మోహనపడుతున్న పాట కానూన్ ఔర్ ముజ్రిం సినిమా లోని సురేష్ వాడ్కర్ ఉషా మంగేష్కర్ పాడిన కైఫీ ఆజ్మీ గీతం “శ్యామ్ రంగీన్ హుయీ హై తేరే ఆంచల్ కీ తర్హా సుర్మయీ రంగ్ లాతీహై తేరే కాజల్ కీ తర్హా”. ఈ పాట మధుర గీతంలో చూడాలని ఉంది. మది దోచే మంచి పాటల్ని అందిస్తున్నందుకు మీకు అభినందనలు. 💐💐🙏🙏👏👏*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన:* చాలా బాగుంది. మధుర గీతాలు శీర్షిక పేరిట చిరస్థాయిగా నిలిచిపోయే పాటలలో ఇది ఒకటి. రచయిత భావం, సంగీత దర్శకుడు వాయిద్యాలలో, బాణీ లో వినిపించిన రాగాల్లో ఒకవైపు ఆమె ఆనందం, ఆ వచ్చే ‘రాజు’ దేశసేవ కు అంకితమై పోతాడని తెలిసిన ప్రేక్షకుడిలో, తెలియని ఆ ప్రేమికురాలిలో అంతర్లీనంగా ఏదో ఆవేదన.
    సినీ గీతాలలో అద్భుతమైన పాటల్లో ఇది ఒకటి.
    రామాయణంలో మొల్ల – సీతను కనుగొని వచ్చిన హనుమంతుడు తన రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న రామ లక్ష్మణులు, ఇతర వానర నాయకులకు తన ప్రయాణ ప్రయాస, తదితరాంశాలు సవివరంగా చెప్పటం మొదలుపెట్టకుండా “కంటిన్” – చూసాను అని మొదలు పెడతాడు. సాధారణంగా క్రియతో పద్యం మొదలుపెట్టరు.
    ఇక్కడ “చూసాను” అన్న క్రియా పదంతో ఎదురుచూస్తున్న అందరి హృదయాలు మొదట కుదుటపడ్డాయి. ఎక్కడ, ఎలా అనేవి తర్వాత.
    “వస్తాడు” నా రాజు అనడంలో అతని రాక కోసం ఆమె ఎంత తపించిపోతోందో తెలుస్తోందో, “తానే వస్తాడు” అనడంలో తన కోసం, తాను ప్రేమకోసం “అంతటి” రాజు వస్తాడు అనే నమ్మకం తెలుస్తోంది.
    పాట రచన ఎంత గొప్పగా ఉందో, ఆలపించిన పి.సుశీల గళం లోని మాధుర్యం ప్రేక్షకుల, శ్రోతల హృదయాల్లో – మాధుర్యం, మనసుల్లో అందమైన ప్రేమ, ఆనందం, ఏం జరగబోతోందో తెలుసు కాబట్టి ఒక విషాద ఛాయ ముప్పిరిగొంటాయి.
    మంచి పాటను ఎన్నుకుని, విశ్లేషించిన శంతనూ శర్మిష్ఠ లకు హృదయ పూర్వక అభినందనలు.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి స్పందన: *అద్భుతమైన పాటకి చక్కని చిక్కని,మాటలలో చెప్పలేనంత గొప్ప విశ్లేషణ.. 🙏🏻🙏🏻*

  5. 5

    పి. వి. సత్యనారాయణ రాజు

    మీరన్నట్టు బాణీయా, సాహిత్యమా, గాత్రమా తేల్చి చెప్పటం సాధ్యం కాని పాట. న భూతో న భవిష్యతి!

  6. 6

    పి. దినకర్ రెడ్డి

    చక్కగా వివరించారు. మరొక్క విషయం..అతని చల్లని కాదు..సుశీల గారు “ఆతని చల్లని పాదధూళికై” అంటూ దీర్ఘం తీస్తారు. ఇలా తెలుగు పాటల్లో అతను అనే పిలుపు ఉండే చాలా చోట్ల ఆతని మనసు, ఆతని హృదయం అంటూ చాలా సార్లు వింటూ ఉంటాము. గమ్మత్తుగా ఉంటుందీ విషయం. ఈసారి విన్నప్పుడు గమనించగలరు.

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పద్మావతి గారి స్పందన: *శుభోదయం. ఈ పాట విశ్లేషణ చాలా బాగుంది. ప్రతి పదాన్ని పలకరించారు. రచయితను, సంగీత దర్శకుడు గురించి వివరణ. ఒకసారి ఆ సినిమా చూసిన అనుభూతి, ఆ పాట వింటున్నాను ఆనందం కలిగాయి. అభినందనలు మీకు💐💐🙏*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కస్తూరి రాజశేఖర్ గారి స్పందన:*చాలా మధురంగా ఉంది రచన. పాటలోని లాలిత్యాన్ని సమీక్షలో కూడా ఒలికించారు. 💐
    పెద్ద దోషం కాదు గానీ, తాను అల్లూరి సీతారామారాజుకి సంపూర్ణంగా.. వాక్యంలో ఉండాల్సింది రామరాజుకి. ఆమె పేరు సీత. ఆ సీత మరణించిన తర్వాత తన పేరు ఇకనుంచీ సీతారామరాజు అని ప్రకటించుకున్నాడు.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సందినేని నరేంద్ర గారి స్పందన:*వస్తాడు నా రాజు ఈరోజు అద్భుతమైన పాట అద్భుతమైన విశ్లేషణ. శంతను – శర్మిష్ట గారికి హృదయపూర్వక అభినందనలు.
    🙏

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పద్మలతాజయరామ్ గారి వ్యాఖ్య:*పాట ఆపాతమధురం. మీ విశ్లేషణ పాట లోని లోలోతుల్లోకి వెళ్ళి, చిలికి చిలికి మాధుర్యాల్ని వెలికితీసి పాఠకులకు అందించింది. సాహిత్యాన్ని అందుకు తగ్గ సంగీతాన్ని , దృశ్యాన్ని ఆనందిస్తామే కానీ, అందుకు కారణమైన రచయితలకు , గీతకర్తలకు, కళాదర్శకులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని తోచదు. మీరు అందిస్తున్న సమాచారం చాలా విలువైనది. సుప్రభాత వేళ సుమధురగీతాన్ని అందించారు. 🙏*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!