సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    మల్లీశ్వరి చిత్రంలోని పాట విశ్లేషణ చాలా బాగుంది…ప్రతి పాయింటు చాలా వివరంగా చెప్పారు..ఈ చిత్రంలోని పాటలన్నీ అజరామయమైనవే ! నల్ల మబ్బులు వేగంగా వస్తుంటే వాటిని వెన్నంటి వర్షం తరుముకు రావటం, వర్షం తగ్గిన తర్వాత ఆకుల వెంబడి బొట్లు బొట్లుగా నీటి చుక్కలు పడటం చాలా సహజంగా చిత్రీకరించారు (ఈ వ్యాసంలో పాట సాహిత్యంలో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. “బిరబిర చరచర పరుగున…..”, “ఘణ ఘణ ఘణ ఘణ మెళ్ళో గంటలు…” అని ఉండాలి).

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సురేఖ పులి గారి స్పందన:*ఆదివారం ఉదయం ఆనందం అందించినందుకు అభినందనలు ✍️👏*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. బిందుమాధవి గారి వ్యాఖ్య:*మీ వ్యాసం చాలా బాగుంది. తాత్వికంగా మొదలైన రచన, ఆ చిత్ర సందర్భంలోకి తీసుకెళ్ళి కాసేపు భానుమతి, ఘంటసాల గారి పాట మా చెవుల్లో మోగుతున్న భావన తెచ్చారు. కానీ వ్యాసం లో పునరుక్తులు, సాగతీతలు ఎక్కువైనట్టు అనిపించింది. కొంచెం సంక్షిప్తం చేస్తే, మనసు కాసేపు ఆ పాటను ఊహిస్తూ మధురానుభూతులతో ఓలలాడేది అనిపించింది. ఇది నా స్పందన.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ధర్మవరపు ఈశ్వరి గారి స్పందన: *చాలా బాగుంది.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎలనాగ గారి స్పందన: *విశ్లేషణ విశిష్టంగా ఉంది. అభినందనలు.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శీలా సుభద్రాదేవి గారి వ్యాఖ్య: *అద్భుతంగా పాట భావం, రాగం, దృశ్యీకరణ, వీటిని సమస్తాన్ని విశ్లేషణాత్మకంగా నాకీ ఇష్టమైన సినీమా మళ్ళా చూసినట్లుగా అనిపించింది. విజయావారి సినీమాలు, మల్లీశ్వరి నెలకు రెండుసార్లు ఐనా ఈ టీవీలో వస్తుంటాయి. ప్రతీసారీ అంతే ఆనందంగా చూస్తాము. అందులో all time classics మాయాబజార్, మల్లీశ్వరీ అయితే మరీను.అనేక అభినందనలు, ధన్యవాదాలు.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జె. శ్యామల గారి స్పందన: *వర్షాకాలంలో ఆహ్లాదకరమైన పాట ఎంచుకున్నారు. 👍
    విశ్లేషణ బాగుంది. 👌🏻
    అయితే మీరు చెప్పిన కథలో, రాణీ వాసం ఆమె కోరినట్లుగా ఉంది
    కానీ రాణీ వాసం గురించి సిఫార్సు చేయమని నాగరాజు అడుగుతాడు. అది మల్లి కోరిక కాదు.
    ఇక పాటలో కొన్ని పదాలు తేడాగా ఉన్నాయి.
    చరచర కు జరజర
    ఘణఘణ కు ఖణఖణ
    కొమ్మల మోగే కోయిల కు
    కొమ్మల మూగే కోయిల
    గజ్జెలు కు గజ్జలు..
    సరిదిద్దుకుంటే సరిపోతుంది.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విహారి గారి స్పందన:*🙏👌👍👌🙏🙏అద్భుతమైన విశ్లేషణ. మూడు రాగాల తత్వాన్ని తెలిపి ఆ రాగమాలికలో సుమధురంగా సమ్మిశ్రితం చేసిన విధానాన్ని , చిత్రంలో దృశ్యాల్ని ఎంతో సమగ్రంగా చెప్పి చూపారు. నిజంగానే ఈ శీర్షిక సూపర్ హిట్. అభినందనలు. శుభాకాంక్షలు.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి స్పందన:*బహు చక్కని పాటకు హృద్యమైన వివరణ.. చాలా చక్కగా ఉంది🤗*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణి గారి వ్యాఖ్య:*మల్లీశ్వరి ఒక అద్భుతమైన చిత్ర రాజం. అందులోని ప్రతి పాట ఒక ఆణి ముత్యమే. “పరుగులు తీయాలి” పాటను ఘంటసాల, భానుమతి పోటా పోటీగా పాడారు. గిత్తలు ముందుకు పరుగులు తీస్తుంటే, మా మనసులు వెనుకకు, ఆ సినిమా వైపుకు పరుగులు తీశాయి. పాటలోని ఆలాపన అతి మధురంగా ఉంది. ప్రతి పదాన్ని స్పష్టంగా పాడడం ఆనాటి గాయకులు/గాయనీ మణులకే చెల్లింది. సంగీతము, సాహిత్యం.. రెండూ కూడా అద్భతమే.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇంద్రగంటి జానకీబాల గారి స్పందన:* మధురగీతాలు.. మనోహర దృశ్యాలు. ఎడ్యుకేటివ్. వెరీ నైస్.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నరేంద్ర సందినేని గారి వ్యాఖ్య: *పరుగులు తీయాలి పాట గురించి అద్భుతమైన విశ్లేషణ. శంతనూ శర్మిష్ట గారలకు, మురళీకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు 🙏 *

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాయప్రోలు సుజాతాప్రసాద్ గారి వ్యాఖ్య: *శంతను శర్మిష్ట గార్ల మధు గీతాలు శీర్షికన మల్లీశ్వరిలోని పరుగులు తీయాలి పాట విశ్లేషణ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు సినిమాయా లోకం గురించి చిన్న స్థాయి తత్వ వివేచన కూడా జరిగింది. ‘ఫిదా’ చిత్రదర్శకులు శ్రీ శేఖర్ కమ్ముల గారికి ‘మల్లీశ్వరి’ సినిమా అంటే ఆరాధన అన్న విషయం ఆయన మొదటి సినిమా ఆనంద్ లోనే తెలుస్తుంది. ఆ సినిమా ఆరంభమే ‘మనసు మల్లెల మాలలూగెనే’ పాటతో అవుతుంది. ఫిదా చిత్రంలో పరుగులు తీయాలి పాట ట్యూన్ లో పాట పెట్టుకోవడం ఆయన పాత చిత్రాలకి ఆ పాటలకి ఇస్తున్న విలువగా నాకు అనిపిస్తుంది.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!