సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆర్. వి. రాసాని గారి స్పందన:*’నీ లీలా పాడెద దేవా..’ సంగీతాభినయాలకు అదొక స్వర్ణయుగం. ఆ రోజులు తిరిగిరావు. వ్యాసం అద్భుతంగా వుంది. అభినందనలు.*

    Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    “నీ లీల పాడెద దేవా…” పాట నేపధ్యం, నటీనటుల అభినయం, చిత్రీకరణ, రాగం అన్నీ చాలా వివరంగా చెప్పారు. బాగుంది. యస్. జానకి పాటలలో అత్యుత్తమ మైనవి ఓ పది ఎంపిక చేయమంటే ప్రధమస్థానం లో నిలుస్తుంది ఈ పాట….మానవ స్వరాన్ని reeded musical instrument తో పోల్చటం చాలా బాగుంది.. …. గొప్ప గాయకులు కూడా కొన్నిసార్లు లొల్లాయి పదాలు పాడవలసి వస్తుంది. ఎందుకంటే గాయనీగాయకులకు పాడటమే ఆనందం. జీవించి ఉన్నంత వరకూ పాడాలనే కోరుకుంటారు. ఆ పాటలను నదీ కాలుష్యంతో పోల్చటం అద్భుతం. {ఈ పాట జానకికి ఐకాన్ గా ఎలా నిలిచిందో అలా ఘంటసాల కి “శివశంకరీ…(జగదేక వీరుని కథ)”, సుశీల కు “మనసే అందాల బృందావనం….(మంచికుటుంబం)”, వాణీ జయరాం కి “ఆనతినీయరా హరా…(స్వాతికిరణం)” పాటలు అలాంటివి అని నా అభిప్రాయం.}

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన:* అద్భుతం. ఎస్. జానకి గారి పాటలలో తలమానికమైన “నీ లీల పాడెద దేవా” గురించి రాయడం ఆమెకు సరియైన నివాళి. ఆమె పాడిన ఎన్నో మంచి గీతాలున్నాయి కానీ, ఇది ఆమె మాత్రమే పాడగలిగిన పాట. ఆమె భౌతికంగా లేకపోయినా కలకాలం నిలిచిపోయి, ఆమెకు శాశ్వతమైన కీర్తిని కలిగించే పాట.
    పాట లోని సంగీతంతో పాటు, మహానటి హావభావాలను వివరించడం బాగుంది.
    కర్ణాటక, హిందుస్తానీ సంగీతాల బేధాలను ఒక చిన్న ఉదాహరణతో విశ్వనాథ వారు చెప్పిన దానిని ఇక్కడ స్మరణలోకి తీసుకుని రావడం అనూహ్యం. అయితే వ్యాసానికి మరింత గౌరవాన్ని సంతరించింది.
    జానకమ్మ స్ధాయిని వివరించి చెప్పారు. అభినందనలు.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎలనాగ గారి స్పందన:*👍వ్యాసం చాలా బాగుంది. కూనరాగం అనే పదబంధాన్ని మొదటిసారిగా విన్నాను. శోధిస్తే, కూనిరాగం కూనరాగంకు రూపాంతరం అని తేలింది. “మ్రోయుతుమ్మెద”లో విశ్వనాథ వారు వాడిన వేదవాసన వైరిసమాసం అని భ్రమపడి నిఘంటువును చెక్ చేస్తే, వాసన సంస్కృత పదమేననీ, కాబట్టి అది సవ్యమైన సమాసం అనీ తెలిసింది.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణి గారి స్పందన:*ఈ వారం జానకిగారి పాట ‘నీ లీల పాడేద దేవా’ గురించి రాస్తూ ఆమెకు నివాళులు అర్పించడం చాలా నచ్చింది. నాదస్వరంతో సమానంగా ఆవిడ గొంతు పలకడం… ఆ గమకాలు… అత్యద్భుతం. ఆవిడ పాటలన్నీ ఒక ఎత్తైతే, ఈ పాట ఒక్కటే ఒక ఎత్తు.
    కొందరు సంస్కార హీనులు ఆమె కులం గురించి మాట్లాడి, రాజకీయం చేయడం చాలా హేయమైన విషయం. అసలు కళకు, కులానికి ఏం సంబంధం?
    మహమ్మద్ రఫీ గొంతును ఆరాధించేవాళ్ళు కొన్ని కోట్లమంది ఉన్నారు. భక్తి పాటలు పాడే జేసుదాసుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
    పాత తరం ఒక్కొక్కరుగా సెలవు తీసుకుంటూ ఉంటే మా తరం వారికి బాధ కలుగుతుంది.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®