సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “పండంటి కాపురం” చిత్రంలో నాయిక ముఖంలో వ్యక్తీకరించిన మానసిక సంఘర్షణను అద్దంలో చూపినట్లు అక్షరబద్ధం చేశారు. ప్రస్తుత సమాజంలో అహానికే అత్యంత ప్రాముఖ్యత నిస్తూ బ్రతుకుబాటలో వంటరి పయనం చేసేవారి హృదయంలో చీకటిని కూడా చక్కగా అర్థం చేసుకుని చెప్పారు. “నా ఇష్టం, నాకెవరూ చెప్పటానికి వీల్లేదు” అన్నట్లు ప్రవర్తించేవారిని ఏమీ చేయలేం, “మతి వలెనే గతి” అనుకోవటం తప్ప……..హిందీ సినిమాలో నాయిక లాగా ప్రతీకారేచ్చతో రగిలిపోతే తెలుగు మహిళా ప్రేక్షకులు మెచ్చరు. ఆడది హద్దుల్లో ఉంటేనే అందం అనుకునేవారు అప్పట్లో…..తెలుగు చిత్రంలో నాయికలో అంతర్లీనంగా ఉన్న మాతృభావనను చూపించటం వలననే చిత్రం ప్రేక్షకాదరణ పొందింది.

    Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    “పండంటి కాపురం” చిత్రం మనసా… పాటలో ఇంకొక చరణం కూడా ఉన్నది…”ఎగిరింది కడలి కెరటం ఆ నింగి స్నేహం కోసం. ఏ నాటికైనా అవి చేరువౌనా? కెరటానికీ, నింగికీ స్నేహమా!” అనేది. చిన్నప్పుడు రేడియోలో వచ్చేటప్పుడు వినేవాడిని…..ఒక పత్రికలో వచ్చిన “నేను – నా పాటలు”అనే శీర్షికలో జమున “ఆ చరణం సముద్రతీరంలో చాలా బాగా చిత్రీకరించారు. నిడివి ఎక్కువైనదనే కారణం తో ఎడిట్ చేశారు. సినిమాలో లేదు కానీ ఆడియో రికార్డింగ్ దొరుకుతూనే ఉన్నది.” అని చెప్పారు..ఈ పాత్రకి మొదట భానుమతి నీ అనుకున్నారట. ఆమెకి డేట్స్ కుదరకపోవటంతో ఆ అవకాశం తనకు వచ్చింది అని కూడా చెప్పారు జమున.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్ సుశీలమ్మ గారి స్పందన:*చివరి పేరాలో మీ సమన్వయం, సమాజ పరంగా, వ్యక్తి పరంగా విశ్లేషణ బాగుంది. ఆమె బిడ్డను అతను (గుమ్మడి) తీసుకుని వచ్చి పెంచాడు అన్నారు. కాదు. అతని అన్న (యస్వీ. రంగారావు) తీసుకుని వచ్చి పెంచుతాడు.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కోవెల సంతోష్ కుమార్ గారి స్పందన:*సామాజికంగా, మానసికంగా కూడా వ్యక్తుల జీవితాలు, మనస్తత్వాలను ప్రతిబింబిస్తున్న పాటను బాగా విశ్లేషించారు. కుటుంబాలు కుంచించుకుపోయి, అపోహలు, అనుమానాలు విపరీతంగా పెరుగుతూ విచ్ఛిన్నమవుతున్న ఈ నాటి తరం దీన్ని చూసి నేర్చుకోవాలి. మనస్తత్వ పాఠాలలో ఇలాంటి కొన్నింటిని ఉదాహరణలుగా చూపుతూ బోధన చేస్తే బాగుంటుంది.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పద్మలతా జయరామ్ గారి స్పందన:*చక్కని write-up. మళ్ళీ సుశీలమ్మ, జమున, గుమ్మడి, SVR లను తలుచుకునే అవకాశమిచ్చారు. మనసు పాటల రచయిత ఆత్రేయగారేనేమో.. కదా

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®