సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    సర్వ సమర్ధురాలు మహి ‘కవితల లాంటి వాక్యాలు, వాక్యాలు లాంటి కవితలు’ రాయటమే కాక కుహనా సంఘసంస్కర్తలు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, పోలీసులు, లాయర్లు, ఇంజనీర్ల పనితనంలోని డొల్లతనాన్ని సూటిగా వెల్లడించటం చాలా ఆశ్చర్యం అనిపించింది. మహి వాళ్ళ నాన్నతో పాటు అమ్మ కూడా తన భావాల్ని చెప్పటం చూస్తే సంసార బాధ్యతలలో పడి ఎందరో గృహిణిలు తమ సామర్థ్యాన్ని మరుగుపరుచుకుంటున్నారు అనే సత్యం మరోసారి అనుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మహి వేదనలోంచి నేటి సమాజానికి ప్రశ్నలు సంధించారు భువన్ జీ. సాహితీవేత్తల బాధ్యతా రాహిత్యం, జర్నలిస్టుల బాధ్యతల్ని నిస్సంకోచంగా తాతయ్య ఎంతో అనుభవంతో చెప్పారనిపిస్తోంది. ఈ వారం సీరియల్ చాలా వేడిగా, వాడిగా, ఉలిక్కిపడేలా అగ్నివర్షం కురిపించారు రచయిత.
    అభినందనలు భువన్ జీ.

    Reply
  2. 2

    Bhuvana Chandra

    హృదయపూర్వక ధన్యవాదాలు సుశీలమ్మ గారు మీ స్పందన కోసం ప్రతి వారం చాలా ఆశగా ఎదురు చూస్తాను. మీలో గొప్పతనం ఏమంటే ఏ వారము నిరాశపరచరు
    అంతేకాదు అద్భుతంగా విశ్లేషించి రాయాలని స్ఫూర్తిని మరింత మరింత కలిగిస్తారు.
    చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు
    నమస్సులతో భువనచంద్ర

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి విశ్లేషణ**
    భువనచంద్ర గారూ, ఈ రోజు మీ రచన చదువుతుంటే అమోఘం, అద్భుతం అనిపించింది.
    మహి ఒక విద్యార్థినిగా కాక కొంత ముందుకు వెళ్ళి ఆలోచన విధానంలో తనని తాను తెలుసుకుని సమాజాన్ని ప్రభావితం చేసే స్థితిలో ఆలోచనా సరళిలో ఎంతో విశిష్టతని చూపింది. ఇది చాలా బాగుంది. ఆ వయసులో తనని తాను ఉత్తమంగా మలచుకోవడం కాకుండా విచక్షణతో పాటు కర్తవ్యాన్ని మరవకపోవడం బావుంది. మహిని బాధ్యతగల వ్యక్తిగా చిత్రీకరణ జరుగుతోంది.
    మహీ తండ్రివి చాలా ఉన్నతమయిన భావాలు. ఆవేశాల ఆక్రోశాన్ని బాధని; సమాజం సంబంధించిన పూర్తి అవగాహన చాలా చక్కగా సహజంగా తీర్చిదిద్ది చెప్పారు.
    ఇప్పుడు ఇలా చేయడం అవసరం. సమాజానికి సంబంధించిన చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి.
    మనలో, మన ఆలోచనలో, మన పప్రవర్తనలో చాలా మార్పు రావాలి.
    చాలా బాగుంది. మహి పాత్ర పోషణ అద్భుతం అనిపించింది. ప్రతి పాత్రలో మీరు పరకాయ ప్రవేశం చేసి వ్రాసి మిలిటరీ మనిషి అనిపించారు.
    సమాజానికి సంబంధించిన బాధ్యతను గుర్తు చేశారు. ఈ రోజు కావాల్సింది సంయమనంతో కూడిన ఆలోచనా విధానాన్ని అమలు చేయడమే. అదే కర్తవ్యం.
    మీకు, మీలోని ఓ పౌరుడికి నా ధన్యవాదాలు అండీ.
    నమస్కారము
    రమాదేవి

    Reply
  4. 4

    rohinipalnati@gmail.com

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారములు ఈ వారం మహి పాత్ర వాడిగా వేడిగా వుంది. సమాజములోని వెర్రి పోకడలను.దుయ్య బట్టారు. మనచదువులు మనం ఎందుకు చదువుతున్నాం. ఊహ తెలిసినప్పటి నుండి నువ్వేమి ఉద్యోగం చేస్తావు. నాన్నా అమ్మా అంటూ పిల్లల్ని అడగటంపరిపాటి. డిగ్రీ లు పిజి లు చదివిన యువతకు సంస్కారం నేర్ప టంలా కనీసం బాధ్యతలు ,జీవించ టానికి కావలసిన సమర్థత వుండటం లేదు. ప్రతిదీ డబ్బుతోనే తూకం. ఇలా ఆలోచించి బాధపడే వాళ్ళ ఆలోచనలుబాగావ్రాశారు. దేశం గురించి సమాజం పోకడ గురించి మీ ఆవేదన యువత ను ఆలోచింప చేసేది లా వుంది. జీవితాలు అన్నీ యాంత్రికంగా సాగిపోతున్నాయి మూస పోసినట్లు అని బాగా చెప్పారు. కవిత అంటే ఏమీ లేదు వచ్చిన ఆలోచన వ్రాయడమే అని ఎంత సులువుగా చెప్పారో. స్వతంత్రము లేని నేటి జీవితాల గురించి బాగా వ్రాశారు. చదువులు అంటే డాక్టర్, ఇంజనీర్ కాకుండా, ఉద్యోగం తో పొత్తు లేని చదువు !ఇలాంటి ఆలోచన వుంటుంది అనే ఆలోచన అద్భుతం. భూమిని తవ్వే సగర పుత్రులు అంటూ ముందు తరా
    లగురించి, ప్రకృతి గురించి మీ ఆవేదన ప్రతిఒక్కరూ ఆలోచించ వలసిన బాధ్యత అని అనిపిస్తోంది.యువతను ఆలోచింపచేసే మీకు ధన్య వాదాలు తెలుపుతూ – రోహిణి

    Reply
    1. 4.1

      Bhuvana Chandra

      రోహిణి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పైపైన కాకుండా చక్కగా చదివి అద్భుతంగా విశ్లేషించిన మీకు నా కృతజ్ఞతలు
      మంచి పాఠకులు ఉన్నప్పుడే రచయితలకి రాయాలని గాఢమైన కోరిక కలుగుతుంది
      కేవలం చదవడం ఏ కాక చక్కగా సమీక్షించే మీలాంటి పాఠకులు దొరకడం ఆనందకరమే
      మరోసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ
      భువన చంద్ర

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!