సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. ఇందిరా లాంటి ఓ శాడిస్టు మనస్సుని పాజిటివ్ గా మలచటానికి అల గతాన్ని అలతోనే ప్రయోగించటం అద్భుతమైన మలుపు తిప్పారు కధ. రచయిత అంటేనే సృష్టికర్త. అన్ని పాత్రల వెనుక ఉన్న మీ ఉన్నత మైన ఆలోచనలు మనస్సు చాలా గొప్పవి అండీ. ప్రేమ దైవమ్ కంటే గొప్పది ప్రేమించటానికి షరతులు లేవనే మీ అభిప్రాయం చాలా వున్నతమైనది. పిల్లలు గొప్ప ప్రేమలో పడ్డాక ప్రకృతి మాయకు లోబడి ఫిజికల్ ఫీల్డ్ లోకి పోతారు. అప్పుడు ఏ కడుపో కాలో వస్తే వచ్చేది ఆడ వాళ్ళకే అప్పుడు సంతోషం కాస్తా చెట్టు ఎక్కుతుంది పిల్ల అమ్మా నాన్నకు ఏమి చేయాలో తోచదు. మన వాళ్ళ ముందు జాగ్రత్త. మనస్సు మహా చంచలం కదా ఒక్కసారి ప్రేమించాలనే రూల్ దానికి వుండదు కదా. బాలన్స్ ఆఫ్ ఎమోషన్స్ లేకపోతే చాలా కష్టం. సమాజం ఓ తీరున నడవటానికి కుటుంబ వ్యవస్థ కనిపెట్టారు దానికి కాలదోషం పట్టింది. కాలం చక్రం కదండీ – ధన్యవాదములు – రోహిణి

    Reply
    1. 1.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు రోహిణి గారు చక్కగా చదివి వారం వారం మనస్ఫూర్తిగా మీ స్పందన తెలియజేస్తున్నందుకు శతకోటి వందనాలు శుభమస్తు శుభమస్తు

      Reply
  2. 2

    Sobharaja

    🙏
    ఇందిర లో మార్పు తేవడానికి అల పుట్టిన రోజు పేరుతో అందరినీ కలపడం నాకెంతో నచ్చింది
    ప్రేమ,పెళ్ళి గురించి మంచిగా చెప్పారు. ప్రేమ అనేది గుండె లోతుల్లో నుంచి రావాలి నిర్భంధంతో కాదు. ఆ విషయం ఇందిరకు అర్థమైతే గొడవుండదు
    అల ద్వారా ఎన్నో జీవిత సత్యాలను అద్భుతంగా చెప్పారు. నిజం చెప్పాలంటే అల మహి characters చాలా ఉన్నతంగా చిత్రీకరిస్తున్నారు. ఈ కాలం ఆడపిల్లలు వాళ్ళను చూసి ఎంతో నేర్చుకోవలసి ఉంది. ప్రేమ పెళ్ళి అంటూ వెంటనే విడాకులకు సిధ్ధమవుతున్న ఈ కాలం పిల్లలకు వీళ్ళు కనువిప్పు కలిగించాలి.
    ధన్యవాదాలు🙏🌹🙏

    Reply
    1. 2.1

      BhuvanaChandra

      శోభాజీ నమస్కారం. చక్కగా సీరియల్ చదివి వారం వారం మీ స్పందన తెలియజేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు శుభం కలుగుగాక

      Reply
  3. 3

    Yamini Devi

    అల పుట్టినరోజు పేరుతో విందు భోజనం హాస్పిటల్ లో ఏర్పాటు చేసి అందర్నీ ఒక చోట చేర్చి అల గతం తాలూకు ప్రేమ గురించి చెప్పడం ప్రేమ యొక్క భిన్న స్వరూపాల్ని ప్రస్తావనకు తీసుకురావడం
    ప్రేమ గురించి పెళ్లి గురించి చర్చ మొత్తం బావుంది. డాక్టర్ గారి మాటల్లో చెప్పించిన మీ వివరణ కూడా 👌
    ప్రణామాలు గురువర్యా 🙏

    Reply
    1. 3.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు యామిజి చాలా చక్కగా మీ స్పందనని వారం వారం అందిస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఆయుష్మతిభవ శుభం భూయాత్

      Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్సులు భువన చంద్ర గారూ.
    అల పుట్టిన రోజు అని ప్లాన్ చే మంచి రసవత్తరంగా సాగింది కథ. మహి ఆలోచనలో పడ్డా, ప్రేమ పెళ్లి పిల్లల విషయంలో పెద్దవాళ్ళు నడుచుకునే విధానం గురించి వాస్తవాల విషయ విశ్లేషణ చాలా బాగుంది. అభివందనాలు. నూటికి నూరుశాతం నిజం .ప్రేమ అనేది ప్రతి మనిషికి సహజంగా ఉండే ధర్మం లక్షణం కూడా. అది
    సహజంగా విశాలమైన విశిష్టమైన గుణం. దాన్ని సంకుచితంగా చేసి ఎవరి అవసరాలకు తగిన విధంగా ప్రేమ పేరుని వాడుకుంటున్నారనిపిస్తుంది. ప్రేమనేది ఎవరికీ చెప్పుకోలేని అనుభూతి.
    అందుకు ప్రతి వ్వక్తికి ఆడామగా పెద్దాచిన్నా కుసమత తేడా లేకుండా స్వేచ్ఛగా, స్వతంత్ర్యంగా ప్రేమింటవచ్చు. ఆ ప్రేమనేది వారి మనసుకు మాత్రమే చెందినది. నేను ప్రేమిస్తున్నానని ఎదుటివారిని అన్నిరకాలుగా స్వంతం చేసుకోవాలనుకోవటం తన ఆధీనం ఉండాలని ప్రయత్నిస్తారు. చాలా పొరపాటు. స్వంతం కావాలని అనుకోవటంతో అన్ని మనోవికారాలు తోడవుతాయి.
    ప్రేమ అనేది అప్పుడే మొగ్గ తొడిగిన గులాబీ. ఆ అందం ఆనందం సౌరభం చూసి ఆనందించటం, ఆహ్లాదపడటంలో తప్పులేదు.
    ఆ హాక్కు దానిపై అందరికీ ఉంటుంది కానీ అది నా ఒక్కరికే అనుకున్నప్పుడు పైశాచిక గుణాలు బయటకు వస్తాయి.
    పెద్ద వాళ్ళు పిల్లల పై ప్రేమని అధికారం గా చూపిస్తారు. మీరన్నట్టు కొంత కాలం పాటు అయినా వారితో ఆ కాసేపూ ప్రేమతో స్నేహంతో కలిసిపోయి మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుతూ వారి ఆలోచనా విధానం కూడా తెలుసుకోవచ్చు.
    ఆహారం పరపరబ్రహ్మ స్వరూపమై మనకి శక్తిని ఇస్తుంది. ఓ రకంగా ఈ శక్తే మనలో దైవంగా నడిపిస్తుంది. సహజంగా తల్లి కడుపు నుండీ బయటకు వచ్ఛాక
    ఉంగా అంటారు. ఆకలయి ఆహారం తీసుకోవాలి అన్నప్పుడు ఉఅంటే ఉకారంలో ఓంకారం సహజంగా ప్రేరేపిస్తుంది. మరీ ఊహ తెలిసినప్పటి నుండి దాని ప్రాధాన్యం మరుస్తున్నారు, పిల్లల కూడా చెప్పలేకపోతున్నారు.
    భగవధ్గీతలో స్వయంగా కృష్ణ భగవాన్ చెబుతున్నారు కదా, శరీరంలో జఠరాగ్ని నేనే అని. చాలా విలువైన విషయాలు విశ్లేషించి అందరూ ఆలోచించేలా
    అందచేస్తున్నారు మీ రచన ద్వారా. చాలా చాలా సంతోషం. ధన్యవాదాలు మీ అభిప్రాయాలు, అభిరుచులకు. – రమాదేవి*

    Reply
  5. 5

    Bhuvanachandra

    హృదయపూర్వక ధన్యవాదాలు రమగారు. చక్కగా చదివి మా అభిప్రాయం వారం వారం తెలుపుతున్నందుకు మీకు నా కృతజ్ఞతలు …..ధన్యవాదాలు

    Reply
  6. 6

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ఈ వారం ఆలస్యంగా మహతిని చదివాను భువన్ జీ !
    ఈ భాగం మొత్తం కేరాఫ్ “అల”. చాలా ధైర్యంగా, ముందు చూపుతో తన పుట్టినరోజు అని చెప్పి గౌతమ్,. అహల్య, ఇందిరా ముగ్గురిని కలిపే ప్రయత్నం చేసింది. సమస్యకు భయపడి దూరంగా ఉండేకంటే, ఎప్పటికైనా ఎదుర్కోవడమే మంచిదని అల చెప్పడం బాగుంది.
    ఎప్పుడూ తెలివిగా ఆలోచించే మహతిని దాటేసింది ఈ వారం అల.
    హాస్పిటల్లోనే లంచ్ ఏర్పాటు చేసి డాక్టర్ గారిని కూడా పిలిచింది. తన తల్లితో పోల్చి ఇందిర మనసును ఆకట్టుకుంది. ప్రోగ్రాం సజావుగా జరుగుతుండగా హఠాత్తుగా ఇందిర ప్రవర్తన మాత్రం చాలా జుగుప్సా కరంగా ఉంది. అహల్యని దామినేట్ చేయాలని ఆమె చేసే ప్రతి ప్రయత్నం వల్ల పరిస్థితి మరి కాస్త క్లిష్ణతరంగా మారుతోంది. కళ్యాణి మహితో కలిసి అల ఎప్పటికప్పుడు సిట్యువేషన్ ని తన చేతిలోకి తీసుకోవడం చూస్తే ‘తిమ్ము’ని ఏడిపించిన, ఏడ్చిన అలనాటి అల “ఈమె నా” అనిపించింది.
    పాత్రల మానసిక పరిణామక్రమం వివరించడంలో మేటి అని గత నవలల్లోనే భువన చంద్ర నిరూపించుకున్నారు.
    “ప్రేమంటే ఏమిటి”, “పెళ్లి పరమార్థం ఏమిటి” అని పాత్రల మధ్య ఉన్న సంభాషణల్ని చూస్తే రచయిత అన్యాపదేశంగా ధృఢమైన తన భావాలని వెల్లడించటమే అనిపించింది.

    పనిలో పని గా – సినిమాల్లో జూవియర్ ఆర్టిస్టుల జీవన వైచిత్రి వివరించే కథలు భువన చంద్ర గారు రాసిన “untold stories” పై నా విశ్లేషణ చదవమని పాఠకులకు నా మనవి.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!