‘ప్రత్యూష’ తెలంగాణ తొలినాటి ఆధునిక కవిత్వం. 1950లో సాధన సమితి దీని కూర్పు చేసింది. “ప్రత్యూష కేవలం పద్యాత్మకము. దీనిలో 28 మంది కవివర్యుల కొన్ని కొన్ని రచనలు ఒకచో కూర్చబడినవి” అని తొలి ప్రచురణ పీఠికలో మాడపాటి హనుమంతరావు గారు వ్రాశారు.
***
“హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం వెలువడ్డ మొదటి కవితా సంపుటి ‘ప్రత్యూష’. ‘ప్రత్యూష’ కవితా సంపుటిని సాధన సమితి తమ 18వ పుస్తకంగా వెలువరించింది.
ప్రత్యూష సంకలనం లోని కవిత్వం విషయానికొస్తే తెలంగాణ కవితా చరిత్రలో ఇది మైలురాయి. ఈ మైలురాయిని దాటి చాలా ముందుకు వచ్చాము. కాని ఇప్పుడెవ్వరికీ ఇది జ్ఞాపకములో లేదు. మనం నడిచొచ్చిన తొవ్వలో ఇది దారిదీపం. ఈ దీపపు వెలుగులో ఎంతో కవిత్వం పండింది. వెలిగింది. ఈ కవితవం యువతరానికి స్ఫూర్తినిచ్చింది. 1950 దశకంలో కవిత్వం రాయడం ప్రారంభించిన ప్రతి ఒక్కరికీ ‘ప్రత్యూష’ దిక్సూచిగా నిలిచింది.
మొత్తమ్మీద 1950వ నాటికి తెలంగాణ యువకవుల ప్రతిభా పాటవాలను తెలుగు నేలంతా తెలియజెప్పిన గొప్ప సంకలనమిది” అన్నారు సంగిశెట్టి శ్రీనివాస్ తమ ముందుమాట ‘కవిత్వమై నడిచొచ్చిన తెలంగాణ’లో.
“‘ప్రత్యూష’ కవితా సంకలనానికి 1950వ దశకం ప్రారంభంలో తగిన ప్రశంసలు, సానుకూల ప్రతిస్పందనలే లభించాయి. కవితా సంకలన ప్రయత్నం అభినందనీయమని ఆనాటి సమీక్షా వ్యాసాల్లో విమర్శకులు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆనాటి ప్రచురణ కర్తలు – సంపాదకుల కృషిని సాహిత్యలోకం సరిగ్గానే గుర్తించింది. అయితే, 1960ల తరువాత వచ్చిన పలు సాహిత్య సమీక్షలు, కవితా సంకలనాల పరిచయ వ్యాసాల్లో “ప్రత్యూష” ప్రస్తావనలు కనిపించకపోవడం చిత్రం! తెలంగాణ కవుల ప్రాతినిధ్యమే లేని “వైతాళికులు” సంకలనం తెలంగాణ ప్రాంతంలో విస్తారమైన ప్రచారాన్ని పొందితే దాదాపు నూరుశాతం ఈ ప్రాంత కవుల రచనలతో ఉన్న “ప్రత్యూష” విస్మరణకు లోనైంది. ఇది విచిత్రమనిపిస్తుంది! ప్రచార రాహిత్యం గొప్ప సాహిత్యాన్ని కూడా మటుమాయం చేయగలదని ఈ సంగతి చెబుతోంది! మలిదశ తెలంగాణ ఉద్యమం సాగిన పుష్కరకాలం పాటు అటు తర్వాత తెలంగాణ అవతరణ అనంతర దశలోని మూడేళ్ళలోనూ కొత్త కొత్త సాంస్కృతిక ఆవిష్కరణలు జరుగుతున్నాయి. మసకబారిన ఆనాటి సాహితీ సాంస్కృతిక జ్యోతుల్ని తిరిగి వెలుగులోకి తీసుకొనివచ్చే గొప్ప ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి” అన్నారు ఎస్వీ సత్యనారాయణ తమ ముందుమాట ‘పుస్తకావిష్కరణలో అమూల్య ఆశ్వాసం’లో.
ప్రత్యూష (కవితా సంకలనం) కూర్పు: సాధన సమితి ప్రచురణ: తెలంగాణ ప్రచురణలు పుటలు: 168, వెల: ₹ 100/- ప్రతులకు:
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™