సంచికలో తాజాగా

7 Comments

  1. 1

    Guru

    Wonderful narration by smt syamala garu
    From J Guru Prasad

    Reply
  2. 2

    విరించి

    ఈవారం శ్యామల గారి మాట కచేరీ చాలా శ్రావ్యంగా వుంది.. అలవోకగా మాటల విన్యాసాలతో పాటల గారడీ తో పాఠకులను మాటలు మర్చిపోయేలా చేశారు…ఎప్పటిలాగే సందర్భా నుసారం అపాతమధురాలను గుర్తుచేస్తూ సాగిన కథనం అలరించింది..అభినందనలు శ్యామల గారు..

    Reply
  3. 3

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి” ‘మాట’కచేరీ!”లో మాటల మంత్రాన్ని ప్రయోగించి తనదైన శైలిలో పాఠకులను అలరింపజేశారు.నిజమే….మన జీవనయానంలో “మాట”కున్న ప్రత్యేకత మరి దేనికీ లేదు.కేవలం “మాట”తోనే మిత్రత్వాన్ని…శత్రుత్వాన్ని పొందగలుగుతున్నాం.మంచిమాటకు…ఇచ్చినమాట నిలబెట్టుకున్నందుకు…మనిషి గౌరవాన్ని పొందుతాడు.తప్పుగా..కఠినంగా మాట్లాడితే శత్రువులను కొనితెచ్చు కుంటాడు.
    రామాయణంలో శ్రీరాముడు…రావణాసురుడు,
    మహాభారతంలో ధర్మరాజు…సుయోధనుడు మనకు సజీవ సాక్ష్యాలు.మనకు అన్నీ తెలిసిన విషయాలే…వేమన…బద్దెనల నీతి శతకాలు…పంచతంత్రంలో ఆవు పులికి ఇచ్చిన మాటకు కట్టుబడి మాట విలువను నిరూపించడం…అన్నీ మనకు తెలిసిన విషయాలే అయినా శ్రీమతి శ్యామల గారు శోధించి ఉదాహరణలతో చెబితే తప్ప మళ్లీ మనకు “మాట”విలువ జ్ఞాపకానికి రాలేదు.పర్యావరణ కాలుష్యం ఎంతటి ప్రమాదకారో….మాటల కాలుష్యం కూడా అంతటి ప్రమాదకారే!రచయిత్రి చెప్పినట్లు “మాట మనిషి స్వభావానికి ప్రతీక!”అందుకే…ఎదుటి వ్యక్తి మాట తీరుని బట్టే…మనం స్నేహాన్ని కొనసాగించాలో…లేదో నిర్ణయించుకుంటాం.మన నిత్య జీవితంలో ప్రధాన పాత్ర పోషించే “మాట” విలువనుసంగీతాత్మకం(పాటలతో)గా
    లిఖించిన శ్రీమతి శ్యామల గారికి అభినందలు.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  4. 4

    prabhakaramsivvam

    శ్యామలగారి ‘ మాటకచేరి” వ్యాసం బాగుంది.
    మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది” అనే
    సామెత ఉంది. మధురంగా మాట్లాడుతూ ఎదుటివారిని మెప్పించడం ఒక కళగా చెప్పుకో
    వచ్చు. అది భగవంతుడు ఇచ్చిన ఒక వరం. కొంతమంది మాట్లాడితే ఎంత మాట్లాడినా ఇంకా వినాలనిపిస్తుంది. మరికొంతమంది
    మాట్లాడితే కర్ణకఠోరంగా ఉంటాయి. మాటలతోనే మనసుల్ని జయించవచ్చు అన్న
    విషయాన్ని శ్యామలగారు తన వ్యాసంలో చెప్పకనే చెప్పారు. శ్యామలగారికి హృదయ
    పూర్వక అభినందనలు.

    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,
    ఫోన్ : 701 3660 252.

    Reply
  5. 5

    Ramana Velamakakanni

    Excellent narration with unique style. Abhinandanalu Shyamala garu..

    Reply
  6. 6

    Mramalakshmi

    మన మాట ఇతరులకు ప్రియంగా ధైర్యాన్నిచ్చేదిగా నైతికబలాన్నిచ్చేదిగా సాంత్వననిచ్చేదిగా ఉండాలని శ్యామల గారు అందించిన రచనా కుసుమం సుమనోహరం.✍👌🙏

    Reply
  7. 7

    Bhramara

    శ్యామలగారి మాట కచేరీ చాలా బాగుంది. ఎంతో ఆలోచింపజేసేదిగా ఉంది. మాటలు ఆచితూచి మాట్లాడాలన్న ఆవశ్యకతను తెలియజేస్తోంది. సుమతీశతకం లోని పద్యాలను ఉటంకించడం సందర్భోచితంగా మాత్రమే కాక ఆర్టికల్ కు మరింత వన్నె తెచ్చింది. మాటల కాలుష్యం అత్యంత ప్రమాదకరమన్న రచయిత్రి గారి మాటలతో అందరూ ఏకీభవించాల్సిందే ..మాటలు ప్రియంగా ..హుందాగా.. సాంత్వననిచ్చేదిగా ఉండాలన్న సందేశం బాగుంది .. ఆర్టికల్ మధ్యలో
    పాటల అమరిక చక్కగా కుదిరింది. మంచి మాటలతో ఆర్టికల్ ను అందించిన రచయిత్రి శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు.💐💐🙏గ

    Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!