సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ముప్పాళ్ల శ్రీ సూర్య ప్రకాశ రావు

    మనస్సు కి తెలుగు మాట ఏమిటా అని తల్లడిల్లుతున్న నాకు ‘ఉల్లము’ గుర్తు చేసి చల్లబరచారు 🙂

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన:
    “తూకానికి నిలబడని విమర్శ వంకరటింకరి వో”
    సంచిక అంతర్జాల పత్రికను ఆమూలాగ్రం చదివే పాఠకురాలిని నేనని సంచిక పాఠకులకు తెలుసు. అయితే ఈమధ్య పని ఒత్తిడితో, కొంత అనారోగ్యంతో ధారావాహికలకే పరిమితమౌతున్నాను. మొదటి నుండీ సంచిక పత్రిక సీరియల్స్ కి, ధారావాహిక వ్యాస పరంపరలకు పేరెన్నిక కలది.. కథలు, కవితలు కంటే.
    ఈ వారం హైలెట్ పూర్ణచందు గారి “విమర్శ” పై విమర్శ వ్యాసం.
    ఆయన ఖరాఖండిగా, చీల్చిచెండాడుతుంటే – నిజం చెప్పొద్దూ నాకు చాల సంతోషం కలిగింది.
    దాదాపు ఆరేళ్ల కిందట కస్తూరి మురళీకృష్ణ ఒక్కో పాయింట్ తీస్తూ విమర్శ ఎన్ని ‘హొయల్లో’ సాగుతోందో రాసారు. కొందరు ఉలిక్కిపడ్డారు. కొందరు ఆక్రోశం బైటకే నిర్లజ్జగా వెళ్ళగక్కారు. అయినా మురళీకృష్ణ తన పేరుతో, కలం పేరుతో “మొహమాటం లేని” విమర్శనా ఖడ్గాన్ని ప్రయోగిస్తూనే ఉన్నారు.
    ప్రస్తుతం పూర్ణచందు గారు –
    అవునండి..
    1. ఆహావోహోలు ముఖ్యమై పోయింది ఈరోజుల్లో. నువ్వు నన్ను పొగుడు, మరో సందర్భంలో నిన్ను నేను పొగుడుతా అనే ధోరణి. ఇస్తినమ్మ , పుచ్చుకొంటినమ్మా వాయినాల పద్ధతి బాగా అమలు జరుగుతోంది. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తూపోతే అది ఎవరెవరు అనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది.
    2. మెప్పు, ముప్పుల తలపోత
    మనకు తెలిసినవారు, కావలిసిన వారు అయితే అక్కడ విషయం ఏమీ లేకపోయినా “మెప్పులు” గుప్పిస్తారు.
    “అంతగా ఏముంది” అని నాలాంటి వారు తికమకపడతాం.
    అలాగే, ఆత్మాభిమానం గల విమర్శకుడు తన స్వంత గొంతుకతో రచనలోని దోషాలను ఎత్తిచూపితే… కనీసం సూచించితే “ముప్పు” తప్పదు. శత్రువుగా భావింపబడి బిక్కముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు రాసాన్రా దేవుడా అనుకునే దుస్థితి కలుగుతుంది. ( నేనలా పశ్చాత్తాప పడననుకోండి)
    3. వ్రాత లోని మంచీచెడులను ఎన్నిక చేసే చక్కని తలపోతే విమర్శ అన్నారు. అసలు ఆ మంచీ, ఆ చెడూ తెలిస్తేగా! పుస్తకాలు చదివితేగా! అందరికీ 24 గంటలే. కొందరు గంటలు గంటలు చదువుతారు, కొంచెం రాస్తారు. ఇప్పుడు అలాంటి “చదువరులు” చాలతక్కువ.
    “నేను చాల బిజీ. టైం ఉండదు” అంటుంటే ఆశ్చర్యమేస్తుంది. ఎవరు ఏం రాసారు, రాస్తున్నారు అని తెలుసుకోకుండా ‘విమర్శ’ అనే వంటను వండి వడ్డిస్తారు. అది రచయిత పై “ప్రేమో” “అభిమానమో” “ధన కనక వస్తు వాహనాది స్వీకరణ” ఫలితమో వెంటనే కాకపోయినా కొన్నాళ్ళకు బైట పడి మనం “ఓహో, అదా సంగతి” అనుకుంటాం. మీరన్నట్టు “ఈసులు, అంకపొంకాలు, గిట్టనితనాలు ” గంపల కొద్దీ.
    4. “ఇలానే రాయాలి అని కర్ర పుచ్చుకుని” చెప్పే పెద్ద మనుషులు ఉన్నారన్నారు. అవును.
    వారు “స్వయం ప్రకటిత మేధా సంపన్న విమర్శకులు”. వారు చెప్పిందే వేదం. వారు ఎక్కిందే గొప్ప పల్లకి. దానిని మోసే బోయీలను సిద్ధం చేసుకుంటారుగా. ఇంకేం! చలామణి అయిపోయి ఆధిపత్యం చెలాయిస్తారు.
    అసలు వాళ్ళు చెప్పే “ధోరణి” లోనే ఎందుకు రాయాలో నాకు అర్ధం కాదు. కవిత, కథ, నవల, నాటకం ఎలా సృజనాత్మకమో, ఎవరి స్వకపోల కల్పితమో – విమర్శ కూడ స్వతంత్రం కాదా!
    వ్రాతగాడు చదువరి కన్నా పై అంతస్తులో ఉన్నాను అనుకొని వ్రాయాలని కుందుర్తి అన్నారని చెప్పారు.
    విమర్శకుడు అంతకంటే ఒక అడుగు పైన ఉండి ఆలోచించాలి అన్నారు కేతు విశ్వనాథరెడ్డి.
    కానీ “కులం పేరుతో కొందరినీ, వర్గం పేరుతో కొందరినీ, ప్రాంతం పేరుతో కొందరినీ, తమవైపు వంగ లేదనే కారణంతో మరికొందరిని తక్కువ చేయటం… కొందరిని పొగిడి నింగికెక్కించటం పెద్ద పనిగా పెట్టుకున్నారు” అని మీరన్నది…
    ఎస్. నిఝ్ఝం. ఇవన్నీ రచయిత మీద కంటే విమర్శకుడి మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. వీళ్ళ వలన అప్పుడే కాదు ఇప్పుడూ తెలుగు వ్రాతలకు ఒరిగిందేమీ లేదు.
    5. “పెన్షన్ డబ్బులు పెట్టి నా పొత్తాన్ని నేనే అచ్చు వేసుకొని ఉచితంగా ఇచ్చినా ఒక్క పుటను కూడా తెరిచి చూడటానికి బరువుగా అనుకునే చదువరుల కోసమా” అని మీరన్నది నిజమండి.
    నా ఆవేదన కూడా అదే. ఇటువంటి “చదవని చదువరుల” కోసమా ఇంత కష్టపడేది అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ నేనైతే అందరి రచనలూ చదువుతా – కొందరు పంపినవి, కొన్ని నేను కావాలని కొనుక్కున్నవి.
    6. “మొన్నటి నన్నయాదులే కాదు నిన్నటి శ్రీశ్రీ చలాన్ని కూడా తెలియకుండా నిలువునా మాటల్ని పేర్చేసే వ్రాతగాళ్ళు పెరిగిపోతున్నారు” అన్నారు.
    భలే వారే. జగమెరిగిన శ్రీ శ్రీ పద్యాలనే కొంత కొంత మార్పు చేసి రాసి అకాడమీ అవార్డులు కొట్టేసిన వాళ్ళు ఉన్నారుగా. “తెలిసీ” ఇచ్చినవారు ఉన్నారుగా.
    7. సరే. మీరు స్పృశించిన AI గురించి చెప్పేదేముంది! కేవలం దాని మీదే ఆధారపడి, అది చెప్పిన పలుకులనే రాస్తున్న చిలుకలు ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోతున్నా.
    ఏది ఏమైనా మీ ఘాటైన విమర్శ చదివి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నాళ్లకు ఇటువంటి నికార్సైన విమర్శ చదివాను అనిపించింది.
    మీకు నా హృదయపూర్వక అభినందనలు.
    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®