[బాలబాలికల కోసం మూడు పొడుపు కథలు అందిస్తున్నారు శ్రీమతి యలమర్తి అనూరాధ.]


1.
లెక్కపెట్టలేనన్ని
నక్షత్రలు
ఒక్కో నక్షత్రం
ఒక్కో వెలుగు
ఆ వెలుగులన్నీ కలిస్తే
మెరుపే మెరుపు
మేం ముగ్గురం మిత్రులం
ఒకరు కనిపిస్తూ
మరొకరు వినిపిస్తూ
ఇంకరితో అందరం కలిసి..
మేమేవరం?
~
2.
నేను కదిలానంటే
హాం! ఫట్లా
అన్నీ మాయం
నా చేతుల్లో ఏమీ ఉండదు
అంతా మీ చేతల్లోనే!
మీరెలా చెబితే అలా
నడవటమే నా పని
నేనేవరిని?
~
3.
రమ్మంటే రాదు
పొమ్మంటే పోదు
ఉండమన్నా ఉండదు
వెళ్ళి రమ్మన్నా రాదు
వచ్చి పొమ్మన్నా పోదు
అలిగి రావద్దన్నా వినదు
వరుస తప్పక వస్తుంది, వెళుతుంది
వస్తాయి, వెళతాయి.
ఏమిటవి?
***
జవాబులు:
1. పుస్తకం, విద్య, విజ్ఞానం 2. డస్టర్ 3. ఏడు వారాలు

అనూరాధ యలమర్తి సుప్రసిద్ధ రచయిత్రి. కథలు 250కి పైగా, కవితలు 500కు పైగా, వ్యాసాలు 500కు పైగా రాసారు. నాలుగు నవలలు రచించారు. వెలువరించిన పుస్తకాలు- ప్రేమ వసంతం- నవల, సంసారంలో సరిగమలు (వ్యాసాలు), వెజిటేరియన్ వంటకాలు, చిట్కాల పుస్తకం, విక్టరీ వారి పెద్ద బాలశిక్ష లో మహిళా పేజీలు 100.
శ్రీ చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ సాహితీ వేత్త అవార్డు స్వీకరించారు. గుర్రం జాషువా, కొనకళ్ళ, వాకాటి పాండురంగారావు, పోతుకూచి సాంబశివరావు, సోమేశ్వర సాహితీ అవార్డుల లాంటివి 50కి పైగా అవార్డులు అందుకున్నారు.
ఆంధ్రభూమి దినపత్రికలో వీరి నవల ‘విలువల లోగిలి’ ప్రచురితమైంది. ఇంతకుముందు పచ్చబొట్టు’ సీరియల్ అందులోనే వచ్చింది.