7
ఆ రోజు సి.ఎ.ఐ.ఐ.బి పార్టు 1 లో అక్కౌంట్స్ పేపరు వ్రాయాలని గుర్తొచ్చింది. వెంటనే తయారయ్యేందుకు శుక్లా, బాట్లిబాయ్ అక్కౌంట్స్ బుక్స్ కొన్నాను. బాగా కష్టపడి చదివి, ఎలాగైనా పార్ట్ 1 పాసవ్వాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయాన్ని అమలు పరచే దిశగా, వినూత్నంగా ఆలోచించి, ఒక ఎ.4 సైజు పోస్టర్ తయారు చేశాను. ఆ పేపర్ పై సి.ఎ.ఐ.ఐ.బి. అని నల్లసిరాతో పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసి, మూడు కాపీలు తీసుకుని, మా యింట్లో హాల్లో, మిగతా రెండు గదుల్లో ప్రస్ఫుటంగా కనిపించే చోట అంటించాను. ఎందుకంటే ఆ పోస్టర్ చూసినప్పుడల్లా, నాకు సి.ఎ.ఐ.ఐ.బి. గుర్తుకు రావాలి. నేను శ్రద్ధ పెట్టి చదివి, సి.ఎ.ఐ.ఐ.బి.ని సాధించాలనే పట్టుదల నాలో పెరగాలి. ఆ పోస్టరు నా లక్ష్యాన్ని నాకు గుర్తు చేస్తూ, ఆ లక్ష్యాన్ని చేరుకునేలా నన్ను నడిపిస్తుందని నా నమ్మకం.
ఈ వినూత్న ఆలోచనకు నేపథ్యం గురించి ఇక్కడ చెప్పుకోవాలి.
***
అవి నేను కాలేజీ చదువుకునే రోజులు, హాస్టల్లో వుండేవాడ్ని. ఒక రూమ్‌లో ముగ్గురం ఉండేవాళ్లం. ఒక్కోక్కరికి ఒక్కో మంచం, ఒక కప్ బోర్డు, ఒక టేబిలు, ఒక కుర్చీ వుండేవి. నా కప్ బోర్డులో ఎ.4 సైజు పేపరుపై సంగీత ప్రియులందరికీ సుపరిచతమైన ఓ సినిమా పాటను, నల్ల సిరాతో, పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసి అంటించాను.
ఆ పాటే, నేను ప్రతి రోజూ వీలైనన్ని సార్లు చదువుకునే పాట!
ఆ పాటే, సమస్య వస్తే పరిష్కారం కోసం చదువుకునే పాట!
ఆ పాటే, కష్టం వస్తే ఎదుర్కొనేందుకు చదువుకునే పాట!
ఆ పాటే అలజడిని, దుఃఖాన్ని పారదోలేందుకు చదువుకునే పాట!
ఆ పాటే ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు చదువుకునే పాట!
ఆ పాటే నా జీవితానికి ఓ అర్థం చెప్పిన పాట!
ఆ పాటే నా జీవన గమనాన్ని నిర్దేశించిన పాట!
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుగారు అభినయించిన పాట!
కీ.శే. పెండ్యాల నాగేశ్వరరావు గారు స్వరకల్పన చేసిన పాట!
కీ.శే. ఘంటసాల వెంకటేశ్వరరావుగారు భావగంభీరంగా పాడిన ఓ గొప్ప పాట!
అందరూ మనసుకవి ఆచార్య ఆత్రేయగారు వ్రాశారు… అనుకునే పాట!
ఆ పాటే, వాస్తవానికి మహాకవి శ్రీశ్రీగారి అంతరంగం నుంచి పెల్లుబికిన పాట!
ఆ పాట, అలనాటి మేటి సినిమా, ‘వెలుగు నీడలు’ సినిమాలోని పాట…
“కలకానిదీ… విలువైనది…, బ్రతుకూ… కన్నీటి ధారలలోనే బలిచేయకూ….”
***
అప్పుడే తెలిసింది. నా స్నేహితుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో పని చేసే మహేష్ గురించి. తను సి.ఎ.ఐ.ఐ.బి. పరీక్షలకు తయారయే వారికి, అక్కౌంట్స్ ట్యూషన్ చెప్తాడట! ఇంకేం… పార్ట్ 1 లో నాకు మిగిలివున్న అక్కౌంట్స్ పేపర్ కోసం ట్యూషన్ చెప్పమని కోరాను మహేష్‌ని. ఏ మాత్రం ఆలోచించచుకోకుండా, రేపటి నుండే, ఉదయం ఏడుగంటలకల్లా, వాళ్ల రూమ్‌కి వస్తే, ఎనిమిది గంటల వరకు ట్యూషన్ చెప్తానన్నాడు.
మరసటి రోజు ఉదయమే, అప్పటికే నేను కొనుక్కున్న శుక్లా, బాట్లిబాయ్ అక్కౌంట్స్ పుస్తకాలను, ఓ లాంగ్ నోట్ బుక్‌ను, తీసుకొని మహేష్ రూమ్‌కి వెళ్ళాను.
ఒకటి రెండు రోజులు గడిచాయి. అక్కౌంట్స్ అంతగా అర్థం కావడం లేదు నాకు. కష్టంగా అనిపిస్తుంది. విషయం మహేష్‌కి వివరించాను. అతను పెదవులు బిగించి, కళ్లు మూసుకుని, ఒక్క నిమిషం ఆలోచించి…
“ఆ!… అయితే ఒక పని చేయ్! ఈ రోజే నువ్వు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అక్కౌంట్స్ పుస్తకం, తెలుగు మీడియం కొనుక్కో! రేపు ఆ పుస్తకం తీసుకొనిరా! పరీక్షలకు, ఇంకా రెండు నెలలు టైం వుంది. ఓ నెల రోజులు ఆ తెలుగు మీడియం పుస్తకం ద్వారా అక్కౌంట్స్ నేర్పుతాను. అప్పుడు నీకు చాలా సులభంగా అర్థమవుతాయి. ఆ తరువాత నెలలో ఇంగ్లీషు మీడియంలో నేర్పిస్తాను… అలా చేద్దాం..!” అని చెప్పాడు మహేష్.
“అలాగే!” అని చెప్పి ఇంటికి బయలుదేరాను.
ఆ రోజే ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం తెలుగు మీడియం అక్కౌంట్స్ బుక్ కొన్నాను. ఆ తరువాత రోజు నుండి, మహేష్ తెలుగులో చెప్పడం మొదలెట్టాడు. మొత్తానికి మహేష్ ప్రయోగం సత్ఫలితాలను ఇవ్వడం మొదలెట్టింది. బాగా అర్థమవుతున్నాయి అక్కౌంట్స్. రెండో నెల నుండి ఇంగ్లీషు మీడియంలో చెప్పడం మొదలెట్టాడు. రెండు నెలలు పూర్తయేసరికి, అక్కౌంట్స్‌లో పక్కగా తయారయ్యాను. పరీక్షలో ఉత్తీర్ణుడనవుతాననే గట్టి నమ్మకం కుదిరింది. మహేష్‌కి నా ఆనందాన్ని తెలియపరిచి, కృతజ్ఞతలు తెలియజేశాను.
***
ఆ రోజే నా అక్కౌంట్స్ పరీక్ష. బ్రహ్మాండంగా వ్రాశాను. ఏ మాత్రం డౌట్ లేదు. గ్యారంటీగా పాసవుతాననిపించింది. ఆ విషయాన్నే, ఆ రోజు సాయంత్రం, స్నేహితులమంతా కలిసినప్పుడు, మహేష్‌కి చెప్పాను. చాలా సంతోషించాడు. ఆ సంతోషంతో మరో సలహా ఇచ్చాడు.
“అన్నట్లు సి.ఎ.ఐ.ఐ.బి. పార్ట్ 2 లో అడ్వాన్స్డ్ అక్కౌంటెన్సీ పేపరు వుంటుంది. అది చాలా టఫ్‌గా వుంటుంది… సరే! … ఒక పని చేద్దాం… ఎటూ నువ్ పార్ట్ 1 అక్కౌంట్స్ పేపరులో పాసవడం ఖాయమైంది కాబట్టి, రేపటి నుండి పార్ట్ 2 లోని అడ్వాన్స్డ్ అక్కౌంటెన్సీకి ట్యూషన్ కంటిన్యూ చేద్దాం. ఈ టెంపోలోనే ఆ పరీక్షకి తయారైతే కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి, చాలా సులభంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా ఆరు నెలల టైం వుంది. అక్కౌంట్స్ పేపరుతో పాటు, మరో మూడు పేపర్లు, మొత్తం నాలుగు పేపర్లకి ప్రిపేర్ అవ్వు. ఆ నాలుగు పాసయిన తరువాత, మిగిలిన ఆ రెండు కష్టమైన పేపర్లు…, అంటే, కమర్షియల్ లా మరియు ఫారెన్ ఎక్స్ఛేంజి,… వాటిని మరో విడతలో రాద్దువుగాని… అర్థమయిందా?… సి.ఎ.ఐ.ఐ.బి. పార్టు 2 పాసవడానికి, ఇదీ మన స్ట్రాటజీ…, ఏమంటావ్?…” నవ్వుతూ అడిగాడు మహేష్.
“అదిరిపోయింది భయ్యా!… నీ స్ట్రాటజీ!… దాన్నే అమలు చేద్దాం!!.. రేపటి నుంచే స్టార్ట్!” హై ఫై ఇస్తూ మహేష్‌కి చెప్పాను.
8
అనుకోకుండా ఆరోజు సి.ఎ.ఐ.ఐ.బి. పార్ట్ 1 రిజల్స్ వచ్చాయి. కవరు తెరిచి చూసిన నాకు కండ్లు బైర్లు కమ్మాయి. తల మీద పిడుగు పడినట్లనిపించింది. అందుకు కారణం, అక్కౌంట్స్ పేపర్లో నేను ఫెయిల్ అయ్యాను! అదేంటి…?? నేను ఫెయిల్ అవడమేంటి?!… ఎంతో కష్టపడి చదివాను… నేను…! నో… నో…! నమ్మశక్యంగా లేదు. ఏ కోణంలో ఆలోచించినా… ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు…!.. మరి ఇప్పుడు నేనేం చేయాలి?… మహేష్‌కి నా ముఖం ఎలా చూపించాలి?…
వెంటనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్, బొంబాయి, వారికి ఓ రిప్రజెంటేషన్ పంపాను. నా పేపరును రివాల్యూ చేయమని అర్థించాను…
వారం తిరక్క ముందే సమాధానం వచ్చింది. రివాల్యూ చేసే అవకాశం లేదని, ఇన్స్టిట్యూట్ నిర్ణయమే అంతిమ నిర్ణయమని, ఈ విషయంపై ఉత్తర ప్రత్యుత్తరాలు వుండవని తెలియజేశారు.
విషయం తెలుసుకున్న నేను కుంగిపోలేదు. ఎందుకంటే… నా పైన, నా ప్రయత్నాల పైన, అంత నమ్మకం ఉంది… నాకు. మహేష్‌తో అదే చెప్పాను. పార్ట్ 2 లో అక్కౌంట్స్ పేపరు, మరో మూడు పేపర్లుకు, నా ప్రిపరేషన్‌ను కొనసాగిస్తున్నాను…., వచ్చిన రిజిల్టును ఖాతరు చేయకుండా….!!
***
మరో వారం రోజులు గడిచాయి. ఐ.ఐ.బి., బొంబాయి నుండి ఓ కవర్ వచ్చింది…, ఏమయ్యుంటుదబ్బా!… గుండె నిమిషానికి వందసార్లు కొట్టుకుంటుంది. వణుకుతున్న చేతులతో, కవర్ ఓపెన్ చేసి చదివాను.
ఆశ్చర్యం…!.. అద్భుతం….!!…
“మేము మీకు పార్ట్ 1 అక్కౌంట్స్ పేపరులో ఫెయిల్యూర్ నోట్‌ను పొరపాటున పంపాము. అందుకు క్షంతవ్యులం. మీరు ఆ పేపరులో పాసయ్యారు. పార్ట్ 1 పాస్ సర్టిఫికెట్‌ను కూడా ఇందులో జతపరుస్తున్నాము. మీకు అభినందనలు!”
ఆ విషయం చదివిన నేను, ఎగిరి గంతేశాను. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. ఆఫీసులో అందరికీ విషయం తెలియజేసి స్వీట్సు తెప్పించి పంచాను.
సాయంత్రం ఆరు గంటలకు నాజ్ సెంటర్‌కి వెళ్లి, నా ప్రియమిత్రులందరికీ స్వీట్లు పంచాను. వాళ్లందరూ నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. మహేష్, నా భుజం తట్టి…
“మొత్తానికి… సాధించావ్!…” అని సగర్వంగా నా వైపు చూశాడు. నిజమే కదా! శిష్యుడు పాసయితే, గురువుగారికి సంతోషంతో పాటు, గర్వం కూడా… వుండడం సహజమే కదా!
ఆనందంతో బరువెక్కిన హృదయంతో ఇంటికి బయలుదేరాను…
ఇల్లు చేరుకోగానే పార్ట్ 1 పాసయినట్లు నా శ్రీమతికి చెప్పాను. చాలా సంతోషించింది. ఇద్దరం ఒకరికొకరం స్వీట్లు తినిపించుకున్నాము. కొంచెం సేపు తనలోనే ఏదో ఆలోచించుకున్న నా శ్రీమతి…
“ఏవండీ! నేనొక ముఖ్యమైన విషయం మీకు చెప్దామనుకుంటున్నానండి! చెప్పమంటారా!”
“నిక్షేపంగా! చెప్పు… ఏంటి? పార్ట్ 1 పాసయినందుకు మనవాళ్లందర్నీ పిలిచి పార్టీ చేసుకుందామా?”
“అబ్బే… అదేం కాదండీ!”
“మరేంటి? త్వరగా చెప్పు!”
“ఏం లేదండీ! ఇప్పుడు పార్ట్ 1 పాసయినందుకు మీకు ఒక ఇంక్రిమెంట్ ఇస్తారుకదా! అలా వచ్చే డబ్బును మన కోసం ఖర్చు పెట్టుకోకుండా, మన పిల్లల కోసం పొదుపు చేద్దామండీ! ఏమంటారు?”
“ఎంత మంచి ఆలోచన! తప్పకుండా అలాగే పొదుపు చేద్దాం. దేవుడి దయ వల్ల పార్ట్ 2 కూడా పాసయితే మరో రెండు ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆ డబ్బును కూడా పిల్లల కోసమే పొదుపు చేద్దాం. అలా మూడు ఇంక్రిమెంట్ల తాలుకూ డబ్బుని, దాచుకుంటూ పోతే, పిల్లలు పెద్దయ్యే సరికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు తయారవుతుంది. ఆ డబ్బు మన పిల్లల పై చదువులకు ఉపయోగపడుతుంది!”
“చాలా సంతోషమండీ! నా మాటకు కాదననందుకు!”
“నువ్వు చెప్పే పని కొచ్చే మాటలను నేనెప్పుడన్నా కాదన్నానా!”
ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వంట గది వైపు వెళ్లింది తను. అప్పుడే నిద్ర లేచిన బాబును ముద్దాడాను నేను.
***
చూస్తుండగానే ఆరు నెలలు గిర్రున తిరిగాయి. సి.ఎ.ఐ.ఐ.బి. పరీక్షలు వచ్చాయి. అప్పటి వరకు మహేష్ దగ్గర ట్యూషన్ నిరాటంకంగా కొనసాగింది. అక్కౌంట్స్ పేపరు, మిగతా మూడు పేపర్లు బాగా వ్రాశాను. కష్టపడి చదివాను కాబట్టి, పాసవడంలో వీసమెత్తైనా సంశయం లేదు.
కొద్దిరోజుల తరువాత రిజల్ట్సు వచ్చాయి. నాలుగు పేపర్లులో పాసయ్యాను. ఆ రోజు సాయంత్రమే, మహేష్‌తో పాటు, మిగతా స్నేహితులందరికీ, గుంటూరు శంకర్ విలాస్‌లో మంచి పార్టీ యిచ్చి, వారితో నా ఆనందాన్ని పంచుకున్నాను.
(మళ్ళీ కలుద్దాం)

ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
53 Comments
Sambasivarao Thota
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..7 & 8..episodes prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …
sagar
పాసవ్వాలి అనే మీ దీక్షాదక్షతల ముందు జరిగిన పొరపాటు మీకు సలాం అన్నది సర్ . పోయిన పరీక్షను పట్టించుకోకుండా తరువాత పరీక్షలకు దీక్షగా తయారైన మీ దృడసంకల్పం ముందు అలాంటి పొరపాట్లు బలాదూర్ అనే చెప్పవచ్చు. అలాగే జీవిత బాగస్వామితో కలసి వచ్చిన అదనపు ఆదాయానికి మీ ప్రణాళిక అందరికీ ఆదర్శం. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్
Sambasivarao Thota
Brother Sagar!
Thank You very much for your observations and appreciation..
Jhansi koppisetty
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ప్రతి మనిషి వ్యక్తిత్వం మనస్తత్వం చిన్న వయసు నుండే వ్యక్తమవుతాయి. చదువు పట్ల మీ జిజ్ఞాస, అంకితభావం, క్రమశిక్షణే అందుకు ఋజువు. అటువంటివారు తప్పక జీవితంలో ఉన్నతిని సాధిస్తారు…You are a living example

Sambasivarao Thota
Jhansi Garu!
Thank You very much for your observations and appreciation
Rattaiah boddudu
Dear sambasiva rao garu,
Many thanks for ur excellent memory sequence of events. Nice to describe the standard accounts BOOKS of Shukla and Battliboi. Still, so many accounting background people not referring the standard books with but u have traced the good books .Ur deep interest about seriousness of dept exams good.
Now ur doing like young with ur writings
Please keep the same track with ur heartful truths.
Sambasivarao Thota
Rattaiah Garu!
Thank You very much for your observations and appreciation
డా కె.ఎల్.వి.ప్రసాద్
Caiib…..పరీక్ష. ఎన్తటి క్లిష్టమైన దో కాస్త చూచాయగా
తెలిసినవాడిని. ఇక్కడ అనుకున్న ది సాధించాలనే మీ కఠోర దీక్ష, సాధించిన ఫలితాలను బట్టి అర్థం అవుతుంది.
ఈ పరీక్షలు పాస్ అయ్యేవాళ్లు బహు తక్కువ. కానీ మీరు సాధించ గలిగినారు.
మీకు అభినందనలు.
Sambasivarao Thota
ప్రసాద్ గారు!
మీ అభిమానానికి ధన్యవాదాలు
సర్..
Sambasivarao Thota
Thanks mamaiah just I think to search that song…u already sent.
Like you I also past A4 size sheet with name of targets on paper in my house at Adilabad year 2008
My targets are purchase of House and Car and Vacant Site

One day my staff came to my house after observe that they said I have targets in bank and House also
After failure of JAIIB (Due to High Fewer)I cried like small KID in Sattenpalli mother House
I LOVE you mamaiah..it’s coming my Heart while reading your life I feel positive vibrations are touch my body and heart.
From
Mr.Nagaraju
Vijayawada
Sambasivarao Thota
Dear Nagaraju!
Thanks a lot for your observations and appreciation.
I am happy to see your personal experiences also..
Thank You very much
పాలేటి సుబ్బారావు
మీ ఆత్మవిశ్వాసం మిమ్ములను గెలిపించింది సాంబశివరావు గారూ. మీరు గనుక IIB వాళ్ళకు రాయకపోతే మీరు చాలా నష్టపోయేవారు. బాధ్యత కలిగిన వారు అంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ఎంతమంది నష్టపోతారు? పాస్ చెయ్యాలనుకుంటే 50 మార్కులు వేస్తారు, అదేంటో!? ఇంకొక విషయం సాంబశివరావు గారూ. నాకు కూడా వెలుగునీడలు సినిమాలో ఆ పాటే నాకూ ప్రేరణ. ఆ పాట నాకు కంఠస్థం వచ్చు. ఇప్పుడు కూడా నా జీవితంలో ఆ పాట ఒక భాగం. మీ అనుభవాలు చదువుతుంటే, నా అనుభవాలు కూడా గుర్తుకొస్తున్నాయి సాంబశివరావు గారూ. ధన్యవాదాలు.
Sambasivarao Thota
SubbaRao Garu!
Thanks for your observations and appreciation..
I am happy to know your experiences also..
It is sheer coincidence that the same song is inspired you also ..
Thanks Andi
Sambasivarao Thota
Very nice.
Thaks for sharing
Regards
From
Sri SheshuMohan
Hyderabad
Sambasivarao Thota
Sheshu Mohan Garu!
Thanks Andi
Sambasivarao Thota
మీ ఆత్మస్థైర్యానికి మీరే సాటి అంకుల్
..
ఫెయిల్ అయ్యాము అని తెలిసినా కూడా కుంగిపోకుండా మిగతా పరీక్షలకు సంసిద్ధమయ్యారు..
ఇలాంటి సంఘటనలు సినిమాలలోనే కనబడతాయి.. నిజ జీవితంలో మొట్టమొదటిసారి మీ రూపంలో చూశాను.
From
Mr.Leelaa Krishna
Tenali
Sambasivarao Thota
Leelaa Krishna!
Thank You very much for your observations and appreciation
Sambasivarao Thota
chala bagundi sambasivaraogaaru caiib exams preparation very nice
From
Sri Haribabu
Guntur
Sambasivarao Thota
Haribabu Garu!
Thank You so much
Sambasivarao Thota
Very surprise, to notice by institute to send wrong information. You are very lucky.
From
Sri K RamanaMurthy Murthy
Vizag
Sambasivarao Thota
RamanaMurthy Garu!
Thank You very much
Sambasivarao Thota
Sir, I have read the 7 & 8 episodes of your NAA JEEVANA GAMANAMLO. Really I felt very happy for your commitment in preparing for CAIIB exams especially ACCOUNTS paper and that by taking tuition from your friend MAHESH. Hats of to him for giving suitable coaching to you and made you pass in the exams. Really very nice you have shown keen interest in his teaching and thereby made him proud that he has suitably taught you in the subject. Really very interesting in reading your NAA JEEVANA GAMANAMLO. Thanks for posting to me.
From
Sri ShanmukhaRao
Hyderabad
Sambasivarao Thota
Shanmukharao Garu!
Thanks for your observations and appreciation and also for your good words
Sambasivarao Thota
Very superbly expressed your experience sir. Really nice

From
Mrs.Rathnakumari
Hyderabad
Sambasivarao Thota
Rathnakumari Garu!
Thank You very much
Sambasivarao Thota
సాంబశివ రావు గారు!
CAIIB అకౌంటెన్సీ పాస్ అయిన తీరు లో మీరు కలిగిన అనుభవం గొప్పది. మీ confidence మిమ్మలని నడిపించింది. ఆదర్శప్రాయం




. ఈ వృత్తాంతం లో జొప్పించి న నాటకీయత బాగుంది…
మరీ ముఖ్యం గ అది నాటకంగా మిగలకుండా నిజం అవడం ..మీ కృషి పట్టుదలకు నిదర్శనం.
ఇక ఒక పాట మీజీవిత గమనంలో ఇన్స్పిరేషన్ ఇవ్వడం..అది మీరు 100% నమ్మి ఆచరణలో పెట్టడం ముదావహం










From
Sri Ramana Prasad
Hyderabad
Sambasivarao Thota
Ramana Prasad Garu!
Thank You very much for your observations and appreciation…
Your comments are always inspirational to me..
Thank You so much for your affectionate words,which I always cherish…
Thanks Andi
Sambasivarao Thota
Wonderful andi.chaduvukovali ane mee deeksha pattudala ee tharam variki kooda unte jeevithmulo sadinchavachu.
Meeku inspiration ayina song super Andi..
From
Smt.Kasthuri Devi
Hyderabad
Sambasivarao Thota
Kasthuri Devi Garu!
Thank You very much for your observations and appreciation
K. Sreenivasa moorthy
Sir it is really a confidence of you on your attempt in an examination. If we are sure and confident we definitely feel a lot if we doesn’t cross the success line. I too felt the same experience in foreign exchange paper. Two rabis and three kariff seasons to complete the paper. Scores were 48, 44, 31 and 25 and atlast 58. Idea is good to save from the initial days of life.
Sambasivarao Thota
SrinivasaMurthy Garu!
Thanks for your observations and appreciation
rao_m_v@yahoo.com
Excellent! It has surprises like in a movie! Lookin forward to more episodes!
Sambasivarao Thota
Sri MN Rao Garu!
Thank You very much Sir
Sambasivarao Thota
జలపాతం లా సాగిపోతోంది
From
Sri Sathyanarayana
Hyderabad
Sambasivarao Thota
Sathyanarayana Garu!
Dhanyavaadaalandi
Bhujanga rao
మీరు caiib లాంటి కఠినమైన పరీక్షలను పాస్ అవ్వాలని, అంకిత భావంతో ,పట్టిన పట్టు విడవకుండా ,మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు.ఆ తదుపరి వచ్చే ఇంక్రిమెంట్ (ఆదాయం) మీ కోసం కాకుండా, పిల్లల కోసం పొదుపు ఆలోచన విధానం అందరికి ఆదర్శం. మీరు డబ్బు కోసం కాదు,మీ కోసం డబ్బు పని చేసే పొదుపు సూత్రం బాగుంది.ధన్యవాదములు సర్.
Sambasivarao Thota
Bhujangarao Garu!
Thank You very much for your observations and appreciation
P. Nagalingeswara Rao
సాంబశివ రావు గారు, మీ పట్టుదలకు, కార్యదీక్షకు జోహార్లండి. మీసతీమని చెప్పిన సలహా ఈనాటి ఉద్యోగులు కూడా పాటిస్తే వారికి అవసరమైన సమయం లో చాలా సహాయపడుతుంది. నా జీవనగమనం లో 7 పార్ట్ చాలా సంతోషకరం గా సాగింది.
దన్యవాదములు.
Sambasivarao Thota
NagalingeswaraRao Garu!
Thanks for your observations and appreciation
Sambasivarao Thota
బాగుంది .. పాసయిన పరీక్ష ఫెయిల్ అయినట్లు తెలియడం..ఇంక్రిమెంట్ మొత్తాన్ని పిల్లలకు దాచడం వగైరాలు. నిజమే ఎన్నెన్ని మెట్లు ఎక్కితే కోరుకున్న ఉన్నత స్థానానికి చేరగలుగుతారు..బాగా రాసారు
From
Sri Vempati KameswaraRao
Hyderabad
Sambasivarao Thota
Vempati KameswaraRao Garu!
Thanks for your observations and appreciation
Sambasivarao Thota
సార్ అద్భుతహః సింపుల్ పదాలు మనం రిలేట్ చేసుకోగల విషయం కధావస్తువు గా చక్కగా రాసారు. చాలా బాగుంది. అభినందనలు మీకు.
















జీవానందం
Hyderabad
Sambasivarao Thota
Jeevaanandam Garu!
Thanks for your observations and appreciation
Sambasivarao Thota
Nice Story..
Super Song..
From
Mrs.Bhavani
Hyderabad
Sambasivarao Thota
Thanks Bhavani Garu
Sambasivarao Thota
Good Episode
Nice Song
From
Mr.Krishna
Hyderabad
Sambasivarao Thota
Thanks Krishna
Sambasivarao Thota
అనుకున్నది సాధించారు పట్టుదలతో అనయగారు మీకు అభినందనలు
From
Smt.Seethakkaiah
Hyderabad
Sambasivarao Thota
Seethakkaiah !
Meeku Dhanyavaadaalandi
Sambasivarao Thota
Joking sir. You might have studied well in the midst of bank work and family with a small kid.
You might have maintained a dairy with all the names of managers regional managers etc.
From
Sri A R K Rao
Kurnool
Sambasivarao Thota
Ramakrishna Garu!
Your observations are quite correct…
I used to balance my personal life and official life to achieve my goals on both sides …
Both are so important …..
Names..Yes..
Some people,we never forget their association and helping nature…
Thank You very much for your comments and appreciation
Naccaw Sudhacaraw Rau
Thota Samba Siva Rao gaaru good morning sir
.
Just now went through your riveting episodes 7 &8. As usual, they are laced with thrilling incidents of your life and career…
Your stubborn perseverance and practice to go through the difficult and hard CAIIB papers and your plans, schedules, scheme, and strategies… buying books, choosing a teacher Mahesh from BoB and attending Tuition classes like primary school boys and girls, and appearing for the exam with FULL confidence and thorough preparation and understanding and the SHOCKING results… though a procedural lapse…. and yet your indefatigable optimistic attitude to go ahead and the preparation for the other papers … and the heavenly info that you have CLEARED the papers for which the earlier result as declared failed , now regretted, and the clearance of other papers successfully…are heroic and exemplary.
The inspiring song” Kala kaanidi.. viluvainadi from VeluguNeedalu, lyric by Srisri ,music ..Y N Rao, enacted by ANR,rendered by Gantasaala and your explanation for the possibility of mistaking the lyricist to be Athreya based on the theme of the song…..all are pleasant aspects of your gracious episodes 7, 8.
It’s a great lesson for any employee or students or aspirants to learn from your life how to achieve goals in the face of endless problems.
Your career and life is highly punctuated with intersting thrills and drills but no frills.
Naccaw Sudhacaraw Rau
Prog Executive,AIR Hyd.
Sambasivarao Thota
Sudhakar Rao Garu!



Your detailed analysis of the present episodes,has revealed my inner sight of those good olden days…
I am so much delighted to go through your comments, which are from an highly experienced and knowledgeable person..
As person of your stature , sending the realistic and practical opinion,made me felt a lot of happiness..
I wholeheartedly thank you,Sir for your time and patience..
I am also specially thank You for appreciating the episodes..