[మంగు కృష్ణకుమారి గారు రచించిన ‘నమ్మకం – నిజం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


శ్రీహరిని అరిగా చూడమన్నది కన్నతండ్రే అయినా
చూడ లేకపోయాడు బాల ప్రహ్లాదుడు!
మరణ దండన అరడుగు దూరంలోనే ఆగిపోయింది
నరసింహస్వామి అందరికీ అండగా అవతరించేడు.
భూమి గుండ్రంగా ఉంటుందన్న గెలీలియో,
నిలువునా దహనం అవుతున్నా
తన అభిప్రాయం మార్చుకోలేదు!
నెలవంక లాటి ఇలవంక మనవంక చేరింది
తనని వంచించిన సామంతుని పట్టి, కట్టి తెమ్మని
అతని పట్టినే సమరానికి పంపేడు శ్రీ కృష్ణదేవ రాయలు!
విశ్వనాధుని వీరత్వానికి నాగముడు
నిండుసభలో రాయల పాదాల, మీద వాలి మన్నించమని వేడుకున్నాడు!
ఆవుపాల లాటి నమ్మకానికి మంచితేనె లాటి నిజం కలిస్తే,
దేవుడైనా, మనిషైనా తల వంచాల్సిందే! జేజేలు పలకాల్సిందే
2 Comments
G. S. Lakshmi
కృష్ణకుమారి గారూ, మీ కవితకు జేజేలు.
జి. ఎస్. లక్ష్మి.
Mala
చాలా బాగుందండి. అభినందనలు.