[శ్రీ సాహితి రచించిన ‘నేను మొలవడం ఓ తమాషా..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నచ్చవు గాని
మెత్తగా గుచ్చినా
భలే ఇష్టం నీవంటే..
అమాంతం నిజంలోకి దూకి
ఆ ధూళిలోనే ఒడిసిన కలను
ఓర్పునల్లి, నీడను చల్లి
విస్తృతంగా వీచే ఎండను తాగి
ఎర్రని కిరాణాలని కౌగిట్లో ఆర్పి
మేఘమై కరగడంలో
తడవడం సరదా
తేమవడం సందడి
అందులో నేను మొలవడం ఓ తమాషా..
Related

శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘నువ్వు లేక నేను లేను’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.
In "మార్చి 2025"

శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘ప్రేమ అభయం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.
In "అక్టోబరు 2024"

శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘కొద్ది మందికే కంఠస్థం నేను..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.
In "మార్చి 2025"