హోరుమనిపించే ..
కేకలు .. గోలలు …డాన్సులు ..
ఎవరో నాయకుని ఊరేగింపని చూస్తే
కాదు .. వినాయకుడిది !.
కొన్ని వందల విగ్రహాలు
ఆకాశాన్ని తాకుతూ ..
హుస్సేన్‌సాగర్ చుట్టూ ..
యంత్రాల సాయంతో
పైకి లేపూతూ ..దబ్బుమని
ముంచేస్తున్నారు నీటిలో ..
గణేష్ మహారాజ్ కీ జై !!! అంటూ.
ఆ అరుపులు వింటూ ..
సగం తేలి చూస్తున్న గణేష్‌ని
మళ్ళీ ముంచేస్తున్నారు
బలవంతంగా …
మళ్లీ దబ్బున చప్పుడు
చూస్తే ..ఎవరో ..స్త్రీ …
నిమజ్జనమా ?.. ఆత్మహత్యా !?..
వీటన్నిటినీ చూస్తూ ..
తథాగతుడు.
తనుకూడా ఒకప్పుడు
మునిగి తేలినవాడే కదా …
దేవుడికీ …జీవుడికి…
ఈ హుస్సేన్ సాగర్కీ
ఏదో… సంబంధం ఉంది!!!
2 Comments
శ్రీధర్ చౌడారపు
విషయం వర్తమానానిదే, అంశం ఆలోచించాల్సినదే… కానీ కవితాత్మ అంతగా కనబడలేదు. “తను కూడా ఒకప్పుడు మునిగి తేలినవాడే” లాంటివి వాడిన మీరు మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది.
Chamarty bhanulinga murty
మీ సూచనలకు ధన్యవాదములు . తప్పకుండ ప్రయత్నిస్తాను .